అన్వేషించండి

Vontimitta Brahmotsavam: ధ్వజారోహణంతో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - కార్యక్రమాల షెడ్యూల్ ఇదీ

Sitaramula Kalyanam: శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

Vontimitta Kodandarama Swamy: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) అనుబంధంగా ఉన్న కడప జిల్లా ఒంటిమిట్టలోని పురాతన, చారిత్రక ప్రాశస్త్యం గల శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు వృషభలగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజ స్తంభానికి నవకలశ పంచామృత అభిషేకం చేసి ఇంద్రాది సకల దేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. అదేవిధంగా, మధ్యతాళం - నాదనామక్రియా రాగం, భృంగిణి తాళం - లలిత రాగం, చంపక తాళం - భైరవి రాగం, ఏకతాళం - మలయమారుత రాగం, త్రిపుట తాళం - మేఘరంజని రాగం, రూపక తాళం - వసంతభైరవి రాగం, గంధర్వ తాళం - కింకర రాగం, నంది తాళం - శంకరాభరణం రాగం, గరుడ తాళం - ఆనందవర్ధన రాగం ఆలపించారు. కంకణబట్టర్‌ కెహెచ్. రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయినట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 13న హనుమంత వాహనం, ఏప్రిల్ 14న గరుడ సేవ, ఏప్రిల్ 15న కల్యాణోత్సవం, ఏప్రిల్ 16న రథోత్సవం, ఏప్రిల్ 18న చక్రస్నానం జరుగుతాయని తెలిపారు. 

పట్టువస్త్రాల సమర్పణ
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సీతారామ లక్ష్మణులకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ అమరనాథ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ డాక్టర్ రమణ ప్రసాద్, శ్వేత, సంచాలకులు ప్రశాంతి, ఏఈఓ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఆర్.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
Eluru Crime News: లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

వీడియోలు

Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan new movies: డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
డిప్యూటీ సీఎంగానే కాదు హీరోగానూ పవన్ బాధ్యతలు - రాజకీయంగా నైతికమేనా?
Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ
Eluru Crime News: లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Embed widget