By: ABP Desam | Updated at : 28 Jan 2023 12:34 PM (IST)
Edited By: jyothi
విచారణకు హాజరవుతానంటూ సీబీఐకి లేఖ రాసిన ఎంపీ అవినాష్ రెడ్డి
Vivekananda Reddy Case: ఈనెల 28వ తేదీన జరిగే విచారణకు తాను హాజరవుతానని చెబుతూ సీబీఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. "వివేకానంద రెడ్డి కేసు ప్రారంభమైన దగ్గర నుంచి తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. పని గట్టుకొని ఓ వర్గం మీడియా తనపై లేని పోని కథనాలను ప్రచారం చేస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే తప్పు దోవబట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని కోరారు. తనతోపాటు ఒక న్యాయవాది వెంటే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
ఈరోజే సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి
వివేకా హత్య కేసులో నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం ౩ గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రానున్నారు. అవినాశ్ రెడ్డిని అడిగే ప్రశ్నలు ఏంటి ఎంతటైం ప్రశ్నిస్తారు.. మళ్లీ రమ్మంటారా అనేది ఇప్పుడు సస్పెన్ష్‌గా మారింది. వైసీపీ నేతలే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఎపిసోడ్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. వివేకానంద హత్య కేసులో ఇప్పటి వరకు చాలా మందిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వాళ్లంతా చాలా సామాన్యులు, ప్రజల్లో పెద్దగా గుర్తింపు లేనోళ్లు. ఇప్పుడు మాత్రం తొలిసారిగా ఓ ప్రజా ప్రతినిధిని సీబీఐ విచారిస్తోంది. అందుకే ఈ విచారణ తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తోంది. అందులోనూ అవినాష్ రెడ్డి సీఎం జగన్‌కు సోదరడి వరుస అవుతారు. ఈయనపై వివేకా కుమార్తె సునీత కూడా అనుమానం వ్యక్తం చేశారు. హత్య కేసులో ఈయనతోపాటు వాళ్ల నాన్న పాత్ర ఉందని మొదటి నుంచి నమ్ముతున్నారు.
ఇన్నాళ్లు చాలా స్లోగా సాగిన సీబీఐ దర్యాప్తు తెలంగాణ నుంచి ప్రారంభమైనప్పటి నుంచి స్పీడ్ అందుకుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఎప్పటి నుంచో అవినాష్ రెడ్డిని పిలుస్తారు. విచారరిస్తారన్ని ప్రచారం జరుగుతున్నా ఇన్నాళ్లకు ఆయన్ని పిలిచి విచారిస్తున్నారు. కేసులో ఇకపైనా అయినా నిజాలు నిగ్గు తేలాలని కుటుంబ సభ్యులతోపాటు చాలామంది కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దర్యాప్తు సాగినన్నాళ్లు... సీబీఐ అధికారులపై అధికార పక్షం వైసీపీ ఒత్తిడి తీసుకు వచ్చిదని అందుకే దర్యాప్తు చాలా ఆలస్యంగా జరిగిందని ప్రతిపక్షాలతోపాాటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు. అందుకే సునీత కోర్టులో పిటిషన్ వేసి... ఏపీల నుంచి దర్యాప్తును వేరే రాష్ట్రానికి మార్చాలని విజ్ఞప్తి చేశారు. దీంతో తెలంగాణ నుంచి దర్యాప్తు కొనసాగాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణలో దర్యాప్తు ప్రారంభమైన తొలి విడతలోనే అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. మొదటి నోటీసులు ఇచ్చిన సీబీఐ అధికారులు తర్వాత రోజే విచారణకు రమ్మమన్నారు. అంటే జనవరి 24న నోటీసులు జారీ చేసిన అధికారులు జనవరి 25న విచారణ రావాలని పిలుపునిచ్చారు. అయితే తనకు ముందస్తుగా నిర్ణయించు షెడ్యూళ్లు ప్రకారం చాలా పనులు ఉన్నాయని చెప్పారు. ఐదు రోజల పాటు విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు సమాధానం ఇచ్చారు.
Breaking News Live Telugu Updates: రేపు మరోసారి ఢిల్లీకి సీఎం జగన్, రెండు వారాల్లోనే రెండోసారి హస్తినకు
AP CM Delhi Visit: రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్ - మరోసారి ప్రధానితో భేటీ?
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ - అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!
Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!
Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్ గడువును పొడిగించే ఛాన్స్, మరో 3 నెలలు అవకాశం
మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు