Viveka Case: వివేకా కేసులో కీలక పరిణామం, దస్తగిరికి అనుకూలంగా కోర్టు నిర్ణయం
Telugu Latest News: వివేకా కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. అందుకని, తనను నిందితుడిగా పరిగణించవద్దని.. సాక్షిగానే చూడాలని దస్తగిరి సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు.
AP News: ఏపీలో ఎంతో సంచలనాత్మకంగా ఉన్న వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల లిస్టు నుంచి దస్తగిరి పేరును సీబీఐ కోర్టు తీసేసింది. వివేకా హత్య కేసులో దస్తగిరి A 4గా గతంలో ఉన్నాడు. ఆ తర్వాత ఈ కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. దీంతో ఈ కేసులో తనను సాక్షిగా పరిగణించాలని.. నిందితుడిగా పరిగణించవద్దని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశాడు.
తాను అప్రూవర్‌గా మారినందున తన పేరును నిందితుల లిస్టు నుంచి తప్పించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను సాక్షిగా మాత్రమే పరిగణించాలని కోరారు. దీనిపై గురువారం (జూలై 25) విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు దస్తగిరికి ఊరట ఇస్తూ తీర్పు ఇచ్చింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న దస్తగిరి పేరును నిందితుల జాబితా నుంచి తొలగించారు. ఇకపై దస్తగిరిని సాక్షిగా పరిగణించనున్నారు.