Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్
Tiger Roaming In Visakhapatnam: గత కొన్ని రోజులగా పలు జిల్లాల్లో పులుల సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పులిని పట్టుకునేందుకు అన్వేషిస్తున్నారు.
Tiger In Kakinada: ఏపీలో గత కొన్ని రోజులగా పలు జిల్లాల్లో పులుల సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. విజయనగరం జిల్లాలో మొదలైన పులి కాకినాడ జిల్లాలోకి ప్రవేశించింది. నెల రోజులు దాటినా అక్కడ అధికారులు పులిని మాత్రం పట్టుకోలేకపోయారు. స్థానికులు సమాచారం అందించినప్పుడల్లా అటవీశాఖ వచ్చి పులి జాడను గుర్తించామని చెప్పారని, కానీ వాటిని పట్టుకోలేకపోతున్నారని విమర్శలు ఎదురయ్యాయి. తాజాగా అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో పులి సంచారిస్తోందని గుర్తించారు. పెద్దపల్లి - కొక్కిరాపల్లి రిజర్వు ఫారెస్టు పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్టు శనివారం అటవీ శాఖాధికారులు వెల్లడించారు. పులి సంచరించిన ప్రాంతాన్ని డిఎఫ్‌ఒ అనంత శంకర్ పరిశీలించారు. అసలే ఒకటే పులి ఉందా, రెండా, లేక మూడు పులులు ఏపీలో సంచరిస్తున్నాయా అనే కోణంలోనూ అటవీశాఖ పర్యవేక్షిస్తోంది.
పులుల సంచారం నేపథ్యంలో ప్రజలకు అటవీ శాఖ జాగ్రత్తలు ఇవే..
1. రాత్రి సమయాలలో ఇంట్లోనే ఉండండి
2. ఇంటి ఆరు బయట నిద్రించవద్దు
3. అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దు
4. పొలాలు వాటి పరిసర ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లవద్దు
5. ఒక్కొక్కరుగా కాకుండా ప్రజలు గుంపులు గుంపులుగా తిరగండి
6. పులి లేదా వాటి పాద ముద్రలు కనిపిస్తే, వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులకు తెలియజేయండి
7. పులిని వెతకడానికి అడవులకు వెళ్లడం లాంటి సాహసం లాంటి పనుల జోలికి వెళ్లవద్దు. ఇది మీకు, పులికి చాలా ప్రమాదకరం. పులికి ఎటువంటి హాని కలిగించినా వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం మీకు శిక్ష పడుతుంది
8. ఏదైనా పశువు చంపినట్లు కనిపిస్తే, వెంటనే స్థానిక అటవీశాఖ అధికారులకు తెలియజేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోయిన పశువు దగ్గరకు వెళ్లకూడదు. పశువుల యజమానికి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వెంటనే పరిహారం చెల్లిస్తారు
9. పులి సమీపంలోనే ఉండి మీపై దాడి చేసేందుకు ప్రయత్నించవచ్చు కాబట్టి పశువులను తాకేందుకు, వాటి దగ్గరికి వెళ్లేందుకుగానీ ప్రయత్నించవద్దు
10. వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్న ఫొటోలు, వీడియోలను మీరు నమ్మవద్దు. వాటిలో చాలా వరకు ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం ఉంటుంది
11. పులి సంచారంపై ఎవరూ భయపడొద్దు. అటవీ శాఖ సిబ్బంది నిరంతరం పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. పట్టుకునేందుకు నిరంతన పర్యవేక్షిస్తున్నారని విశాఖపట్నం జిల్లా అటవీశాఖ అధికారి ఈ జాగ్రత్తలు సూచించారు.
పులి ఉంది జాగ్రత్త.. ఏపీ ప్రజలకు అటవీ శాఖ సూచనలివే #TigerFear #AndhraPradesh #Tigers #APForestDeptarment pic.twitter.com/ESedjopo8m
— ABP Desam (@ABPDesam) July 5, 2022
అటవీశాఖ అధికారులను కింది నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
అనకాపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌ను 9985543551 నెంబర్‌లో సంప్రదించాలి.
యలమంచిలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను మొబైల్ నెంబర్ 8639744755 లో సంప్రదించాలని ప్రజలకు జిల్లా ఫార్టెస్ ఆఫీసర్ సూచించారు.
Also Read: Tracking Tigers: పులులు దొరక్కుండా ఎలా తప్పించుకుంటాయ్, వాటిని ఎలా ట్రాక్ చేస్తారు?
Also Read: Bengal Tiger In AP: కోస్తాలో రెండు బెంగాల్ టైగర్స్ తిరుగుతున్నాయా? టెన్షన్ పెడుతున్న వరుస దాడులు