News
News
X

Tracking Tigers: పులులు దొరక్కుండా ఎలా తప్పించుకుంటాయ్, వాటిని ఎలా ట్రాక్ చేస్తారు?

పులుల్ని ట్రాక్ చేయటానికి అధికారులు రకరకాల ప్రొసీజర్స్ ఫాలో అవుతారు.

వీటిలో పగ్ మార్క్స్ ఆధారంగా ట్రేస్ చేయటం ఒక పద్ధతి.

మరి మిగతా మెథడ్స్ ఏంటి?

FOLLOW US: 

ఏపీలో దాదాపు రెండు వారాలుగా పులి కోసం వేట కొనసాగుతూనే ఉంది. పశువులపై దాడి చేస్తూ ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లిపోతోంది పులి. దాన్ని పట్టుకోవటం కోసం అధికారులు శ్రమిస్తూనే ఉన్నారు. ఇంత వరకూ ఆచూకీ దొరకలేదు. ట్రాకింగ్ వ్యవస్థకూ చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. ఏపీలో అనే కాదు. ఎప్పుడు, ఎక్కడ పులి ఇలాంటి అలజడి సృష్టించినా, పట్టుకోవటం కష్టమైపోతోంది. అసలురోజుల తరబడి ట్రాక్ చేస్తున్నా పులి ఆచూకీ ఎందుకు చిక్కటం లేదు..? అసలు పులిని ఎలా గుర్తిస్తారు..? ట్రాకింగ్ కోసం ఏయే పరికరాలు వాడతారు..?

పులిని ఎలా ట్రాక్ చేస్తారు..? 

స్కానింగ్‌కు చిక్కకుండా తప్పించుకుని తిరగటం పులికి సహజంగా ఉండే లక్షణం. అయినా ఏదో విధంగా శ్రమించి ట్రాక్ చేస్తుంటారు అధికారులు. కేవలం పులులను గుర్తించేందుకే కాదు, వాటి సంఖ్యని, ఎకాలజీని అనలైజ్ చేసేందుకు ఈ ట్రాకింగ్ ఎంతో అవసరం. కొన్నేళ్లుగా టైగర్ ట్రాకింగ్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావటం వల్ల ఈ పని సులభతరమవుతోంది. రెండు విధాలుగా పులిని ట్రాక్ చేస్తారు. ఇందుకోసం కెమెరా ట్రాప్స్‌, రేడియో కాలర్స్‌ను వినియోగిస్తారు. ఇంటర్నెట్ కనెక్టివిటీతో పని చేసే జీఎస్‌ఎమ్ కెమెరాలు కొన్ని సందర్భాల్లో వాడతారు. పులులు ఎక్కడికి వెళ్తున్నాయి..? ఎలా జీవిస్తున్నాయి..? వాటి సంతతి ఎంత..? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకునేందుకు పులులకు రేడియో కాలర్స్‌ అమర్చుతారు. అయితే ఇది కేవలం పులుల లైఫ్‌స్టైల్‌ని గమనించే సందర్భాల్లోనే ఉపయోగపడుతుంది. 

పగ్‌మార్క్స్‌ సేకరించేప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఓ గాజు పలకపై స్కెచ్‌పెన్‌తో పులి పాద ముద్ర ఆకారాన్ని గీస్తారు. తరవాత ఓ వైట్‌ పేపర్‌ని గాజు పలకపై ఉంచుతారు. నేలపై పాదముద్ర పడిన చుట్టూ సర్కిల్ గీస్తారు. తరవాత ఆ పగ్‌మార్క్‌పై చాక్‌ పౌడర్ వేస్తారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మిశ్రమం వేయటం వల్ల అది గడ్డకట్టి పాద ముద్రల అచ్చు పడుతుంది.  ఈ పగ్‌మార్క్స్‌ని ఎక్కడ, ఎప్పుడు తీసుకున్నారన్న ఆధారంగా పులి వయసుని లెక్కిస్తారు. పులి జెండర్‌నీ ఈ పాద ముద్రల ఆధారంగానే తేల్చుతారు. 

టైగర్‌ ట్రాకింగ్‌కు కెమెరా ఎలా ఉపయోగపడుతుంది..? 

రేడియో కాలర్స్ లేని పులులను పట్టుకునేందుకు సంప్రదాయ పద్ధతుల్నే అనుసరిస్తారు. పగ్‌మార్క్స్‌ (పాద ముద్రలు), చెట్లపై గోటి గుర్తులు, కెమెరా ట్రాప్స్‌ ఆధారంగా ట్రాక్ చేస్తారు. గతంలో పులి ఎక్కడెక్కడ సంచరించిందో లెక్కించి ఆయా ప్రాంతాల్లోని కెమెరాలు అమర్చుతారు. 
అయితే కొన్ని సార్లు కెమెరాలు లేని చోట్ల కూడా పులి సంచరిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కదలికల్ని గుర్తించటం కష్ట తరమవుతుంది. కెమెరాలు పెట్టాక  2 నుంచి 12 గంటల తరవాత రికార్డ్ అయిన విజువల్స్‌ని చెక్ చేస్తారు. అయితే కేవలం కెమెరాలపైనే ఆధారపడితే మాత్రం పులి దొరకటం కష్టమే. ట్రాక్‌ చేయలేని ప్లేసెస్‌లో అది ఎక్కడికి వెళ్లి ఉంటుంది..? అని అంచనా వేసి అక్కడ కెమెరాలు పెడతారు. కానీ కచ్చితంగా పులి ఆ ప్రాంతానికి వస్తుందని మాత్రం చెప్పలేం. చాలా సందర్భాల్లో ఆచూకీ దొరక్కపోవటానికి కారణమిదే. కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో పులి సంచరిస్తే మాత్రం సులువుగా ట్రాక్ చేసేందుకు కెమెరాలు ఉపయోగపడతాయి. 

టెలిమెట్రీ ట్రాకింగ్‌తో లాభమెంత..? 

పులిని రేడార్ ద్వారా ట్రాక్ చేయటమే టెలిమెట్రీ ట్రాకింగ్. పులుల కదలికలను గుర్తించటంతో పాటు పులి ఎలా ప్రవర్తిస్తోంది అన్నదీ తెలుసుకోవచ్చు. పులి ఎప్పుడు నడుస్తుంది..? ఎప్పుడు రెస్ట్ తీసుకుంటుంది..? ఎలా చంపుతుంది..? లాంటి వివరాలన్నీ సేకరించవచ్చు. అడవిలో అయితే పులులు ఏ దారిలో పడితే ఆ దారిలో వెళ్తూ వేట కొనసాగిస్తూ జీవనం సాగిస్తాయి. అదే జనావాసాల్లోకి వచ్చినప్పుడు 
మాత్రం ఓ దారిని ఎంచుకుని, ఎవరికీ దొరక్కుండా అదే దారిలో వెళ్లిపోతూ ఉంటుంది. ఓ టెరిటరీ అంటూ లేని పులులు ఇలా జనావాసాల్లోకి వచ్చి ఎవరి కంటపడకుండా వేట కొనసాగిస్తుంది. 

Published at : 01 Jul 2022 01:12 PM (IST) Tags: Tiger Tracking Tiger Pug Marks Tiger Tracking Procedure

సంబంధిత కథనాలు

Video Call Suicide: భార్యకు భర్త వీడియో కాల్, వెంటనే దూలానికి ఉరి! కారణం తెలిసి పోలీసులు షాక్

Video Call Suicide: భార్యకు భర్త వీడియో కాల్, వెంటనే దూలానికి ఉరి! కారణం తెలిసి పోలీసులు షాక్

DGP Rajendranath Reddy: ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి ప్రెసిడెంట్ మెడల్!

DGP Rajendranath Reddy: ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి ప్రెసిడెంట్ మెడల్!

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?

KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?

Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది: ఏపీ సీఎం జగన్

Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది:  ఏపీ సీఎం జగన్

టాప్ స్టోరీస్

Independence Day 2022: అంబానీ ఇంటిని చూశారా, మూడు రంగులతో ఎలా మెరిసిపోతోందో!

Independence Day 2022: అంబానీ ఇంటిని చూశారా, మూడు రంగులతో ఎలా మెరిసిపోతోందో!

PM Modi Speech Highlights: ఈ మార్గం చాలా కఠినం, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం - గెలిచి చూపించాం: మోదీ

PM Modi Speech Highlights: ఈ మార్గం చాలా కఠినం, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం - గెలిచి చూపించాం: మోదీ

Gaur Hari Das: స్వాతంత్య్ర సమరయోధుడిగా నిరూపించుకునేందుకు 32 ఏళ్లు పోరాడిన గౌర్ హరి దాస్

Gaur Hari Das: స్వాతంత్య్ర సమరయోధుడిగా నిరూపించుకునేందుకు 32 ఏళ్లు పోరాడిన గౌర్ హరి దాస్

Independence Day Google Doodle: ఇండిపెండెన్స్ డే సందర్భంగా గూగుల్ డూడుల్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా

Independence Day Google Doodle: ఇండిపెండెన్స్ డే సందర్భంగా గూగుల్ డూడుల్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా