అన్వేషించండి

Vizag Lands Scam : ఉత్తరాంధ్రలో క్రిస్టియన్ సంస్థల భూములను కబ్జా చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - విశాఖ టీడీపీ నేతల ఆరోపణలు !

విశాఖలో క్రిస్టియన్ మత సంస్థల భూములను కబ్జా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. కబ్జాకు గురైన పలు స్థలాల పత్రాలను విడుదల చేశారు.


Vizag Lands Scam :  ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఉన్న రూ.2 లక్షల కోట్ల విలువగల క్రిస్టియన్ మైనారిటీ స్థలాలను వైఎస్ఆర్‌సీపీ నేతలు కాజేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.  టిడిపి విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షులు ఉరికూటి డేవిడ్ పలు పత్రాలను మీడియా ముందు తీవ్రమైన ఆరోపణలు చేశారు.  సిరిపురం, టైకూన్ హోటల్ సమీపంలోని రూ.500 కోట్లు విలువగల సి బి సి ఎన్ సి స్థలాన్ని ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, వైజాగ్ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ జివి కలిసి కాజేస్తున్నారని, దీని వెనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసిపి కీలక నేత ఉన్నారని ఆరోపించారు.   ఈ స్థలం సర్వేనెంబర్ 75 లో ఉందని, సుమారు 1900 గజాల మేరకు ఉంటుందని ఆయన వివరించారు. 18 క్రిస్టియన్ సంస్థలకు ఈ స్థలం అప్పట్లో దారా దత్తం చేయడం జరిగిందని, ఈ వివాదం కోర్టులో ఉందని ఊరికూటి డేవిడ్ తెలిపారు. 

విశాఖ ఎంపీ క్రిస్టియన్ సంస్థల ఆస్తుల కబ్జా చేస్తున్నారు ! 

సిరిపురం లో  సర్వే నెంబర్ 75 లో  19 వేల గజాల స్థలం  500 కోట్ల విలువ చేసే సీ బీ సీ ఎన్ సి  భూమి  కబ్జా కు గురైంది.విశాఖపట్నం ఎంపీ M V V సత్యనారాయణ,  జగన్ మరియు సాయి రెడ్డి వీటికి సూత్రధారులన్నారు.  కుర్మాన పాలెం లో 14.1 ఎకరాల క్రిస్టియన్ మిషనరీ  భూమిని ఎంపీ MVV సత్యనారాయణ బెదిరించి దోచి దానిపై LIC హౌసింగ్ నుండి 125 కోట్లు ఋణం తీసుకొనిmvv హోసింగ్ సంస్థ పేరట నిర్మాణం చేస్తున్నారన్నారు. ఈ స్థలాల జోలికి వెళ్లొద్దని కోర్టు మొట్టికాయలు పెట్టినప్పటికీ ఎంవివి సత్యనారాయణ ఆగడం లేదని ఆయన మండిపడ్డారు. ఇలాగే విజయనగరం క్రిస్టియన్ మిషనరీకి చెందిన దువ్వాడలోని 15 ఎకరాల భూమిని ఎంపీ సత్యనారాయణ కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

బినామీ పేర్లతో  సి బి సి ఎన్ సి సంస్థ భూములు స్వాహా 

దశాబ్దాల క్రితమే లండన్‌లోని CBCNC   ద్వారా  ఈ సంస్థ మన రాష్ట్రం లో పెట్టారని..  ఈ సంస్థ ద్వారా వచ్చిన నిధులు నుండి అప్పట్లో ఈ స్థలాలు కొనడం జరిగినదన్నారు. తర్వాత కాలంలో  సి బి సి ఎన్ సి సంస్థ ద్వారా  రావలసినటువంటి నిధులు ఆగిపోయాయని.. అయితే భూమి విలువలు నానాటికి పెరగడంతో భూ కబ్జాదారుల దృష్టి  సిబిసిఎన్సి సంస్థల భూములపై పడిందన్నారు.  స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది బినామీల పేరిట సంస్థ యొక్క భూములను తమవని రాయించుకుని చట్టాల లోని లోసుగులను ఆధారంగా చేసుకుని యు ఎల్ సి అర్బన్ ల్యాండ్ సీలింగ్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూ కి లాభం చేకూరుతుంది అని మాయతో  రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు 18 ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి ప్రయత్నాలు చేశారని.. . వీటిపై హైకోర్టు పలుమార్లు  హెచ్చరికలు జారీ చేసిందన్నారు. 

దేవుని బిడ్డ జగన్ .. జీసస్ ఆస్తులను కాపాడరా ? 

దేవుని బిడ్డగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దేవుని ఆస్తులను కాపాడాల్సింది పోయి, తన అనుయాయులకు కట్టబెడుతున్నారని ఆయన తెలిపారు. వెంటనే వీటిపై సర్వే చేసి క్రిస్టియన్ ఆస్తులను కాపాడి, బినామీ పేరుతో కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో క్రైస్తవ మిషనరీస్ ఆస్తుల పరిరక్షణకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద క్రైస్తవులంతా కలిసి రిలే నిరాహార దీక్షలు చేపడతారని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు.కాకినాడ నుండి శ్రీకాకుళం వరకు సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే కృష్టియన్ మిషనరీ భూములకు రక్షణ లేదని క్రిస్టియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Sidhu True Husband: మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !
మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Sidhu True Husband: మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !
మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Samantha: మగాళ్లు నిందించినప్పుడు తలెత్తుకుని నిలబడు... సమంత పోస్ట్ చేసిన కవిత రాసింది ఎవరో తెలుసా? 
మగాళ్లు నిందించినప్పుడు తలెత్తుకుని నిలబడు... సమంత పోస్ట్ చేసిన కవిత రాసింది ఎవరో తెలుసా? 
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Embed widget