News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Buddha Venkanna: A1 జగన్, A2 విజయ సాయిరెడ్డి ఢిల్లీ పర్యటన కేసులు ఎత్తివేత కోసమే! బుద్దా వెంకన్న సెటైర్లు

TDP leader Buddha Venkanna: ఎంతసేపూ తనపై ఉన్న కేసులు ఎప్పుడు ఎత్తేస్తారా.. ఎప్పుడు ప్రధాని మోదీ కి సాష్టాంగ నమస్కారాలు చేద్దామా అని సీఎం జగన్ ధ్యాస అని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.

FOLLOW US: 
Share:

TDP leader Buddha Venkanna: ’A 1  జగన్ మోహన్ రెడ్డి, A 2 విజయ సాయిరెడ్డి ఢిల్లీకి వెళ్లారని.. కానీ ఎందుకు వెళ్లారో చెప్పరు. ప్రధాని కలిసిన తర్వాత ఎందుకు కలిసామో ప్రజలకు ముఖ్యమంత్రి చెప్పాలి. కానీ జగన్ అది చెయ్యరు’ అని టీడీపీ నేత బుద్దా వెంకన్న సెటైర్లు వేశారు. ఎంతసేపూ తనపై ఉన్న కేసులు ఎప్పుడు ఎత్తేస్తారా.. ఎప్పుడు ప్రధాని మోదీ కి సాష్టాంగ నమస్కారాలు చేద్దామా అనే ధ్యాస తప్ప ప్రజలకోసం మాట్లాడిన దాఖలాలు లేవు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధీనం లోని రోడ్లన్నీ దారుణం గా తయారయ్యాయని, టీడీపీ హయాంలో వేసిన రోడ్లు తప్ప. జగన్ ప్రభుత్వం వేసిన రోడ్డు రాష్ట్రం లో ఒక్కటన్నా బాగుందా?? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులను ఈ విషయపై ఛాలెంజ్ చేశారు. టీడీపీ కట్టిన ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుంటుందని, ప్రజల సొమ్ము తాడేపల్లి ఆఫీస్ కు వెళ్ళిపోతోందని ఆరోపించారు. 

ఓన్లీ డైరెక్ట్  క్యాష్ తో మాత్రమే మద్యం వ్యాపారం చేసే ప్రభుత్వం వైసీపీ దేనని, ఎందుకు UPI పెమెంట్స్ అంగీకరించరు? అని ప్రశ్నించారు. ఎందుకంటే ఆ లిక్విడ్ క్యాష్ అంతా తాడేపల్లి ప్యాలెస్ కీ.. ఇడుపుల పాయకీ వెళుతోందని ఆరోపించారు. కేంద్రం దీనిపై సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలి. సీఎఖం జగన్ కు భూ దాహం.. ధన దాహం ఎక్కువ అని, కనుక జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ముందస్తు వచ్చినా.. రాకున్నా, ఎన్నికలకు టీడీపీ ఎప్పుడూ సిద్ధమే అన్నారు బుద్దా వెంకన్న.

ఉమ్మడి విశాఖ జిల్లాలో 1000కి పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయని, అక్కడ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఇటీవల సాహితీ ఫార్మాలో మృతుల కుటుంబాలకు 25లక్షల చొప్పున మాత్రమే పరిహారం ఇచ్చారని, అంతకు ముందు LG పాలిమర్స్ లో మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం చెల్లించారని గుర్తుచేశారు. సాహితీ ఘటన లో మృతులకు కూడా అధిక పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ కంపెనీని కాజెయ్యడానికి కూడా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు.

కార్పొరేషన్ ఎన్నికల్లో ఫార్మా కంపెనీల నుంచి అధిక మొత్తంలో ఫండ్ ను విజయ సాయిరెడ్డి పోగు చేశారని వ్యాఖ్యానించారు. అందుకే ఫార్మా కంపెనీ ల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నది పట్టించుకోవడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు బుద్దా వెంకన్న. అధికారులు తమ బాధ్యత నిర్వర్తించకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. సాహితీ ఫార్మా ఘటన లో మృతులకు అందాల్సిన కోటి రూపాయల నష్ట పరిహారంలో 75 లక్షల చొప్పున అక్కడి మంత్రి, ఇతరులు కలిసి కాజేసి కేవలం 25 లక్షలు మాత్రమే ప్రకటించారని ఆరోపించారు. ఈ ప్రమాదాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. మంత్రి అమర్నాథ్ అనకాపల్లి ఫార్మా కంపెనీల ప్రమాదాల పై ఎందుకు మాట్లాడడం లేదు. పేద వాళ్ల శవాలపై పైసలు వైసీపీ నాయకులు ఏరుకుంటున్నారంటూ మండిపడ్డారు.

Published at : 05 Jul 2023 11:58 PM (IST) Tags: YS Jagan YSRCP AP News Buddha Venkanna #tdp

ఇవి కూడా చూడండి

Vizag Port: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

Vizag Port: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

AP Liquor Policy: మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ సర్కార్

AP Liquor Policy: మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ సర్కార్

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

KA Paul: తెలంగాణలో కాంగ్రెస్ పగటి కలలు - 2న సికింద్రాబాద్‌లో బహిరంగ సభ: కేఏ పాల్

KA Paul: తెలంగాణలో కాంగ్రెస్ పగటి కలలు - 2న సికింద్రాబాద్‌లో బహిరంగ సభ: కేఏ పాల్

Breaking News Live Telugu Updates: ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు విచారణ వాయిదా

Breaking News Live Telugu Updates: ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు విచారణ వాయిదా

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?