అన్వేషించండి

AP Employee Transfer: ఎవరు కావాలి, ఎవరిని సాగనంపాలి! ఏపీలో ఉద్యోగుల బదిలీలపై ఉత్కంఠ!

ఏపీలో ఉద్యోగుల బదిలీపై మార్గదర్శకాలు రావడంతో కూటమి పార్టీల నేతలు తమకు అనుకూల ఉద్యోగుల కోసం సిఫారసులు మొదలుపెట్టారు.

రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధారణ ఉద్యోగుల బదిలీలకి తెరలేపింది. ఈ మేరకు 15 శాఖలలో బదిలీల కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇదే అదనుగా గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగాపనిచేసిన పలువురుని సాగనంపేందుకు ప్రజా ప్రతినిధులు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే తాము చెప్పినట్లుగా నడుచుకునే వారిని తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణినాయకులు సైతం తమకు కావాల్సిన వారి పేర్లు పట్టుకుని వారినేతమ గ్రామాలలోను, మండలాలలో నియమించాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు. ఈ మేరకు సిఫార్సు లేఖలను తీసుకునేందుకుఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు.

నేరుగా ఎమ్మెల్యేలతో పరిచయం లేని వారు వారి బంధువులు, వ్యక్తిగత సిబ్బంది, మిత్రులు ఇతరత్ర వారితో సంప్రదింపులు చేసి అనుకున్నస్థానాలను పొందేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. జీరో సర్వీసు నుంచి బదిలీకి అవకాశం కల్పించడంతో ఇదే అదనుగా గత పాలనలో ఇబ్బందులకి గురైన అధికారులు, సిబ్బంది ఇప్పుడులైమ్ లైట్ లోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నాయకులు ఇప్పుటికే వారి టార్గెట్ మేరకు మండల స్థాయి అధికారులను మార్చేసారు. సిఫార్సు లేఖలు ఇచ్చి కోరుకున్న కొందరిని ఎస్ డిపిఓలు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, సిఐలు, ఎస్.ఐలుగా వారి ప్రాంతాలకి బదిలీ చేపించుకుంటారు. 

ఇప్పుడు సాధారణ ఉద్యోగుల బదిలీల వంతురానే వచ్చింది. ప్రజలతో సంబంధాలు ఉన్న శాఖలలోనే బదిలీలు జరుగుతుండడంతో ప్రజా ప్రతినిధులు వీటిలో కూడా తమ మార్క్ ఉండేలా కసరత్తులు చేస్తున్నారు. ఇదే అదనుగా అనుకూలమైన స్థానాలలో చేరితే రానున్న ఐదేళ్ళు కొనసాగిపోవచ్చని కొందరు ఉద్యోగులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేర్వేరు శాఖల నుంచి జిల్లా అధికారులుగా డిప్యుటేషన్ లతో కొనసాగుతున్న వారు వాటిలో ఉండేందుకు తప్పి వేరే జిల్లా స్థాయి పోస్టులలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

పాతపట్నంలో ఎమ్మెల్యే దూకుడు
జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మామిడి గోవిందరావు దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఈ మూడు నెలలోనే ఆయన తన మార్క్ ను సొంతం చేసుకున్నారు. వినూత్న రీతిలో ఆయన ముందుకు సాగుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీల జీఓను విడుదల చేయగా తెలుగు తమ్ముళ్ళ అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏకంగా పాతపట్నం ఎమ్మెల్యే ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. బదిలీల జిఓపై నాయకులు, కార్యకర్తలకి సందేహాలు ఉంటే వాటి నివృత్తి కోసం క్యాంపు కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యేతో నేరుగా చర్చించవచ్చని పిలుపునిచ్చారు. 

పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని ఉన్న గ్రూపులలో ఈ మేరకు శాసనసభ్యుల నియోజకవర్గ కార్యాలయం పేరుతో వర్తమానం అందరికి పంపించారు. ఇది సోషల్ మీడియా గ్రూపులలో హల్ చల్ అవుతుంది. ఉద్యోగుల బదిలీలపై నాయకులకి, కార్యకర్తలకు ఉన్న సందేహాలు ఏంటి ...వారితో ఎమ్మెల్యే చర్చించడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు. గ్రామాలలోను ఎవరిని ఉంచాలని... ఎవరిని సాగనంపాలని అన్న విషయంపై ఎమ్మెల్యే చోటా నేతలతో మాట్లాడేందుకే ఈ తరహా చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తామని ఒక వైపు ప్రభుత్వం ప్రకటిస్తూ మార్గదర్శకాలు కూడా జారీ చేయగా క్షేత్ర స్థాయిలోఅందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్న విషయం స్పష్టమవుతుంది. 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని పొద్దుటూరులో ఐసిడిఎస్ సిడిపిఓ గా పనిచేస్తున్న విమలారాణి శ్రీకాకుళం జిల్లాలోపాతపట్నంలో ఏర్పాటైన నూతన ప్రోజెక్ట్ కి సిడిపిఓగా డెప్యుటేషన్ పై నియమితులయ్యారు. అప్పట్లో పాతపట్నం ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డి శాంతికి పూర్తిగా ఆమె అనుకూలంగా వ్యవహరిస్తూ కూటమి నేతలకి చుక్కలు చూపించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. విమలా రాణి డిప్యుటేషన్ ను రద్దు చేయాలని, పాతపట్నం ప్రోజెక్ట్ కి రెగ్యులర్ సిడిపిఓను తిరిగి కొనసాగించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకి పలువురు టీడీపీ నాయకులు కోరారు. అలాగే ఆయన కూడా సంబందిత అధికారిణి పనితీరుపై ఆరా తీసి బదిలీ చేయాలని భావించినా ఇంతలో ఏమి జరిగిందో ఏమో గాని తిరిగి డెప్యూటేషన్ పై ఉన్న విమలారాణినే కొనసాగించడం పట్ల ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నాయకులు పలువురు గుర్రుమంటున్నారు. ప్రస్తుతం బదిలీలలో ఆ శాఖ లేకపోవడంతో ఈ పంచాయితీని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్ళేందుకు పార్టీ నాయకులు రెడీ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితులు జిల్లాలో అనేక చోట్ల ఉన్నాయి. 

సామాజిక వర్గాలను అడ్డుపెట్టుకుని గతంలో కీలక స్థానాలలో పనిచేసే కొందరు అధికారులు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇప్పుడు అదే సామాజిక వర్గ నేతలను పట్టుకుని కోరుకున్న స్థానాలను సొంతం చేసుకుంటున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతునే ఉన్నాయి. రాజకీయంగా సిఫార్సులు లేకపోతే కోరుకున్న స్థానాలు దక్కవన్న ఆందోళన ఉద్యోగ వర్గాలలో వ్యక్తమవుతుంది. ఉద్యోగుల బదిలీల వేళ ప్రభుత్వ కార్యాలయాలలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
Embed widget