Bhogapuram Land Turns Gold : భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఇటుక పడలేదు కానీ భూములు మాత్రం బంగారం ! కోటీశ్వరులైన రైతులు
భోగాపురం దగ్గర భూములు ఉన్నరైతులు కోటీశ్వరులయ్యారు. విమానాశ్రయానికి మాత్రం ఇంత వరకూ ఇటుక పడలేదు.
Bhogapuram Land Turns Gold : అంతర్జాతీయ స్థాయిలో భారీ హంగులతో నిర్మానించాలని ఎయిర్పోర్ట్ ఆలోచన ఏడేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చింది. దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత పనులు జరగలేదు. జీఎంఆర్‌కు దక్కిన కాంట్రాక్ట్ రద్దు చేయడం ఐదు వందల ఎకరాలు తగ్గించి మళ్లీ జీఎంఆర్‌కే ఇవ్వడంలో ఆలస్యం జరిగింది. మొదట్లో 15000 ఎకరాలతో ప్రారంభమైన ఇక్కడ భూసేకరణ చివరకు2700 ఎకరాలకు కుదించుకుపోయింది. ప్రధానమంత్రి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలోనే రెడీ అవుతుందని చెప్పడంతో అక్కడ భూములకు రెక్కలు వచ్చాయి.
2019 ఫిబ్రవరిలో బోగాపురం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన
ఒకప్పుడు బీడు భూములు పనికిరావు అనుకున్న భూములకి ఏకంగా కోట్ల రూపాయలే విలువలు పలుకుతున్నాయి. ఎయిర్ పోర్ట్ భూములు అనేసరికి ఎక్కడ లేని వారందరూ కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది రైతులు భూములకు రేట్లు వస్తున్న సమయంలో అమ్మకాలు ఆపేశారు. రానున్న రోజుల్లో ఇంకా రేటు పెరుగుతుంది కనుక అమ్మడానికి సిద్ధంగా లేవని కొంతమంది భూములను అలాగే ఉంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగాగ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. అధునాతనంగా, భారీ ఎత్తున తలపెట్టిన ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి తొలుత 15 వేల ఎకరాలను సేకరించేందుకు ప్రతిపాదలనలు సిద్ధం చేశారు. అయితే దీనిపై స్థానికుల అందోళనలతో అది సుమారు ఐదున్నర వేల ఎకరాలకు, ఆ తర్వాత అది 2 వేల 7 వందల ఎకరాలకు కుదించారు. 2019 ఫిబ్రవరిలో అప్పటీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు శంఖుస్థాపన కూడా చేశారు.
ప్రభుత్వం మారడంతో నిలిచిపోయిన పనులు !
అప్పటీ నుంచి ఇప్పటీ వరకు ఈ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఆ శిలాఫలకం తప్ప మరొక ఇటుక కూడా పడలేదు. ఈ తరుణంలో విమానాశ్రయ నిర్మాణ పనున్ని ప్రారంభించాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.. దీంతో అక్కడ ప్రజలు ఒక్కసారిగా భూములు రేట్లు పెరగడంతో ఎయిర్పోర్ట్ పేరుతో భూములకు భారీగా రేట్లు వచ్చి పడ్డాయి చుట్టుపక్కల కనుచూపులు మేర వరకు కూడా భూములు అమ్మకానికి లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయం నిర్మాణాన్ని పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్) పద్ధతిలో జీఎంఆర్ సంస్థ నిర్మించనుంది. శంఖుస్థాపన జరిగి మూడేళ్లైనా కూడా ఇప్పటీ వరకు ఎయిర్ పోర్టుకు సంబంధిచిన పని ప్రారంభం కాలేదు. కానీ భోగాపురం ఎయిర్ పోర్టు ప్రకటన వచ్చినప్పటీ నుంచి భోగాపురం చుట్టూ పక్కల 10 కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం జోరందుకుంది.
భూముల ధరలకు రెక్కలు !
ఎయిర్ పోర్టు వస్తుందనే వార్తలతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మధ్యలో ఉండే భోగాపురం, దాని సమీప ప్రాంతాల్లో భూముల ధరలు ఊహకందని విధంగా పెరిగాయి.ఎయిర్ పోర్ట్ ప్రతిపాదన రాకముందు ఎకరా 20 లక్షలు, 30 లక్షలు ఉండేది. ఇప్పుడు ది కోటి, రెండు కోట్లు అయిపోయింది. హైవే దగ్గరైతే 10 కోట్లు కూడా అయింది . కొంత లోపలికి వెళితే రెండు కోట్లు, మూడు కోట్లకు వస్తుంది. ప్రస్తుతం బోగాపురం ప్రాంతంలో రైతులంతా భూములు అమ్మేసుకున్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఓనర్ల దగ్గరే భూములు ఉన్నాయి. వ్యాపారవేత్తలు బాగా కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల మరోపక్క విశాఖపట్నం క్యాపిటల్ గా ఏర్పడుతుందని చెప్పడంతో మరి కాస్త రేట్లు పెరిగాయి. చిన్నాచిత రైతులు కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని వారి భవిష్యత్తు చాలా బాగుందని అభివృద్ధికి ఇదే పునాదిని అంటున్నారు.