Zawad Update: బలహీన పడుతున్న జవాద్... ముందస్తు జాగ్రత్తగా రెస్క్యూ టీంలు మోహరింపు
భయం వీడుతోంది. తుపాను ముప్పు లేనట్టుగానే ఉంది. జవాద్ తుపాను కదలికలు చూస్తుంటే క్రమంగా బలహీన పడుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది.
జవాద్ తుపాను బలహీన పడుతున్నట్టు భారత్ వాతావరణ శాఖ ప్రకటించింది. ముందస్తు జాగ్రత్తగా ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ బలగాలు మోహరించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. క్రమంగా బలహీన పడుతున్న తుపాను.. డిసెంబర్ ఐదున అల్పపీడనంగా మారి తీరం దాట వచ్చని స్పష్టం చేసింది.
జవాద్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్నానికి ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 340 కిలోమీటర్లదూరంలో పూరికి నైరుతి దిశలో 410 కిలోమీటర్ల దూరంలో పారాదీప్‌కు నైరుతి దిశలో 490 కిలోమీటర్ల దూరంవో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
Cyclonic storm #Jawad lays centered over westcentral Bay of Bengal about 230 km southeast of Vishakhapatnam, 340 km south of Gopalpur, 410 km south-southwest of Puri and 490 km south-southwest of Paradip: India Meteorological Department (IMD)
— ANI (@ANI) December 4, 2021
జవాద్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. సుమారు 12 గంటల్లో ఉత్తరంవైపుగా కదులుతూ ఉత్తర ఈశాన్య దిశగా ఒడిశాలో తీరం దాటనుంది. డిసెంబరు 5 మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా పూరీ సమీపంలోకి చేరుకునే ఛాన్స్ ఉంది. ఇది మరింత బలహీనపడి ఉత్తర-ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని IMD ప్రకటించింది.
It's likely to weaken gradually & move nearly northwards during next 12 hours and then north-northeastwards along Odisha coast reaching near Puri around 5th Dec noon as a Deep Depression. It's likely to weaken further and move north-northeastwards towards West Bengal coast: IMD
— ANI (@ANI) December 4, 2021
తుపాను ముప్పు ఉన్న ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఎన్జీఆర్‌ఎఫ్ పటిష్ట చర్యలు చేపట్టింది. 11 ఎన్డీఆర్‌ఎఫ్, 5 ఎస్డీఆర్‌ఎఫ్, 6 కోస్ట్ గార్డు, 10 మెరైన్ పోలీస్ టీమ్‌లను రంగంలోకి దింపింది. జవాద్త్ కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా రెస్క్యూ టీంలను మోహరించింది. ఇప్పటికే 54వేల8 మంది లోతట్టు ప్రాంతాల నుంచి శిబిరాలకు తరలించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్టు అధికారులు ప్రకటించారు.
Andhra Pradesh | 11 NDRF, 5 SDRF, 6 Coast Guard, 10 Marine Police teams deployed in three districts of the state, in view of cyclone Jawad. 54,008 persons have been evacuated from low-lying areas of Vishakapatnam, Vizianagaram and Srikakulam
— ANI (@ANI) December 4, 2021
Also Read: తరలిపోయిన ఉమ్మడి రాష్ట్ర దిగ్గజ నేత.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత !