News
News
X

YS Jagan Vizag Tour: రేపటి నుంచి 3 రోజుల పాటు విశాఖపట్నంలో సీఎం జగన్‌, షెడ్యూల్ ఇలా

విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు. ఈ పెట్టుబడుల సదస్సును సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

FOLLOW US: 
Share:

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి (మార్చి 2) నుంచి మూడు రోజులపాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు. ఈ పెట్టుబడుల సదస్సును సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు 25 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు సదస్సులో పాల్గొననున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ సదస్సుకు ఘనంగా ఏర్పాట్లు చేసింది. 

02.03.2023 షెడ్యూల్‌
సీఎం వైఎస్ జగన్ సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, రాత్రికి అక్కడే బస

03.03.2023 షెడ్యూల్‌
ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు. రాత్రి 8.00 – 9.00 ఎంజీఎం పార్క్‌ హోటల్‌లో జీఐఎస్‌ డెలిగేట్స్‌కు ఏర్పాటుచేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు, అనంతరం రాత్రి బస

04.03.2023 షెడ్యూల్‌
ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

విశాఖపట్నంలో మూడు, నాలుగు తేదీలలో జరగనున్న పారిశ్రామిక సదస్సుకు 25 దేశాల నుంచి ప్రముఖులు తరలి వస్తున్నారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు 25 ప్రత్యేక విమానాలు విశాఖకు రాబోతున్నాయన్న సమాచారం అందిందని, 18 విమానాలను విశాఖ ఎయిర్ పోర్ట్ లో పార్క్ చేసే అవకాశం ఉందని, మిగిలిన విమానాలు రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు తరలించనున్నామని చెప్పారు. 
పదివేల మంది రిజిస్టర్
విశాఖకు తరలివస్తున్న ప్రముఖుల్లో అంబానీ, కరణ్ అదాని, కుమార్ మంగళం బిర్లా తదితరులు ఉన్నారని తెలియజేశారు. అందరికీ విశాఖ నగరంలోని వివిధ హోటల్స్ లో బస ఏర్పాటు చేశామని చెప్పారు. నగరంలోని వివిధ హోటళ్లలో 600 గదుల వరకు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. కాగా ఇప్పటివరకు సదస్సులో పాల్గొనేందుకు పదివేల మంది రిజిస్టర్ చేయించుకున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో అత్యధిక పెట్టుబడులు వచ్చే విధంగా ఉన్నాయని, ఇది రాష్ట్రంలో మేజర్ సెక్టర్ కాబోతోందని ఆయన అన్నారు. అలాగే పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఫార్మా రంగాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆయన తెలిపారు. దేశంలో మరి ఎక్కడా లేనివిధంగా 70 శాతం మంది స్కిల్ ఫోర్స్ ఏపీలో ఉందని అన్నారు. విశాఖ నగరం రాష్ట్రానికి భవిష్యత్తుగా నిలుస్తుందని మంత్రి అమర్నాథ్ అన్నారు. 

పటిష్టమైన భద్రత
ఇలా ఉండగా నగరానికి తరలివస్తున్న ప్రముఖులకు అత్యధిక భద్రత కల్పిస్తున్నట్లు మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. 11 సెక్టర్లలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశామని డ్రోన్ కెమెరా ద్వారా కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. సదస్సుకు హాజరయ్యే వారికోసం 25 ఎకరాలలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని చెప్పారు. కాగా ప్రధాన వేదికపై సుమారు 50 మంది అతిథులు కూర్చుంటారని, ప్రధాన వేదికలో 4,000 మంది ప్రతినిధులు కూర్చునే విధంగా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

Published at : 01 Mar 2023 10:14 PM (IST) Tags: YS Jagan VIZAG VisakhaPatnam Investors Summit Vizag Investors Summit Investors Summit In AP

సంబంధిత కథనాలు

AP SSC Exams: 'పది' పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ - అయితే?

AP SSC Exams: 'పది' పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ - అయితే?

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

తెలంగాణలో పగలు ఎండలు మండే- సాయంత్రం పిడుగులు పడే

తెలంగాణలో పగలు ఎండలు మండే- సాయంత్రం పిడుగులు పడే

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?