అన్వేషించండి

Vijayawada Sai Krishna Case: సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి

Vijayawada | గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై జరుగుతున్న మెజిస్టీరియల్ విచారణకు వైసిపి నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, సుధాకర్ బాబు, వంగవీటి నరేంద్ర హాజరై, వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వైసీపీ నేతలు సాయికృష్ణ లాకప్ డెత్ విచారణకు హాజరయ్యారు.
  • తమ అనుమానాలు వ్యక్తం చేస్తూ, సీబీఐ విచారణ కోరారు.
  • మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది, కుటుంబం వాంగ్మూలాన్ని సమర్పించింది.
  • నిష్పక్షపాత విచారణకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Sai Krishna Lockup Death Case | విజయవాడలో కలకలం రేపిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై జరుగుతున్న మెజిస్టీరియల్ విచారణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేతలు హాజరయ్యారు. ఈ విచారణ ప్రక్రియలో పార్టీ ముఖ్య నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, సుధాకర్ బాబు, వంగవీటి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసుపై తమకు ఉన్న పలు అనుమానాలను లేవనెత్తుతూ, ఒక  వినతి పత్రాన్ని విచారణాధికారికి అందజేశారు.

ఈ సందర్భంగా వైసిపి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. గాదె సాయికృష్ణ కేసులో తమకు అనేక తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ జరగడం, ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేయడానికి ప్రయత్నించడం వంటి పరిణామాలు ఎన్నో సందేహాలకు తావిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలోని అసలు వాస్తవాలు, నిజనిజాలు బయటకు రావాలంటే కేవలం సిబిఐ (CBI) ద్వారానే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ ఉదంతాన్ని తాము ప్రభుత్వ హత్య గానే భావిస్తున్నామని వైసిపి నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత మెజిస్టీరియల్ విచారణలో భాగంగానే తమకు ఉన్న ప్రతి ఒక్క అనుమానాన్ని రాతపూర్వకంగా వినతి పత్రం రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ కేసును తక్షణమే సిబిఐకి అప్పగిస్తేనే, బాధ్యులైన అసలు దోషులు బయటకు వస్తారని, బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని వారు స్పష్టం చేశారు.

Also Read: Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్! 


Vijayawada Sai Krishna Case: సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి

విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్.. ప్రారంభమైన మెజిస్టీరియల్ విచారణ
విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. భారతీయ న్యాయ సంహిత (BNS) చట్ట నిబంధనలకు లోబడి, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరిస్తూ ఈ విచారణను నిష్పక్షపాతంగా జరపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

విచారణకు హాజరైన బాధిత కుటుంబం
విచారణలో భాగంగా బాధితుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు తమ వాంగ్మూలాన్ని, సాక్ష్యాలను అధికారులకు సమర్పించేందుకు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రజల వద్ద ఎలాంటి సమాచారం, ఆధారాలు లేదా సాక్ష్యాలు ఉన్నా.. వాటిని వెంటనే విచారణాధికారికి సమర్పించి సహకరించాలని అధికారులు ఒక ప్రకటనలో ప్రజలను కోరారు.

ఇటీవల కోర్టుకు లేఖ రాసిన నాగరాజు

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు కోర్టులో ఒక సంచలన లేఖ సమర్పించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కస్టడీ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన లిఖితపూర్వకంగా తన వాదనను కోర్టుకు తెలియజేస్తూ.. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను పూర్తిగా నిర్దోషినని పేర్కొన్నారు. సిట్ అధికారులు కావాలనే తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికిస్తున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించిన ఆయన, ప్రస్తుతం తనకు ప్రాణహాని కూడా ఉందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. సిట్ అధికారులు తనను తీవ్రంగా బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా, మానసికంగా టార్చర్ చేయకుండా తగిన రక్షణ కల్పించాలని ఆయన కోర్టును వేడుకున్నారు.

మరోవైపు, ఈ కేసులో నిందితుడైన సిఐ నాగరాజును జులై 3 నుంచి ఎనిమిది రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, నిందితుడి న్యాయవాది సమక్షంలోనే ఆడియో-వీడియో రికార్డింగ్‌తో ఈ విచారణ జరగాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిజానికి తనకు పోలీస్ కస్టడీ అవసరమే లేదని, కేవలం తనను ఇరికించాలనే ఉద్దేశంతోనే అధికారులు కస్టడీ కోరారని నాగరాజు కోర్టుకు తెలిపారు.

Frequently Asked Questions

విజయవాడలో జరుగుతున్న మెజిస్టీరియల్ విచారణ దేనికి సంబంధించింది?

ఇది విజయవాడలో కలకలం రేపిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై జరుగుతోంది. ఈ ఘటనపై వైసిపి నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు.

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిబిఐ విచారణను ఎవరు డిమాండ్ చేస్తున్నారు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ కేసులో సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని ప్రభుత్వ హత్యగా వారు భావిస్తున్నారు.

మెజిస్టీరియల్ విచారణ ఏ నిబంధనల ప్రకారం జరుగుతోంది?

భారతీయ న్యాయ సంహిత (BNS) చట్ట నిబంధనలకు లోబడి, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మార్గదర్శకాలను అనుసరించి ఈ విచారణ జరుగుతోంది.

విచారణలో బాధితుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారా?

అవును, బాధితుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు తమ వాంగ్మూలాన్ని, సాక్ష్యాలను సమర్పించేందుకు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget