అన్వేషించండి

Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!

Rayalaseema Industrial Hub: చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమను దేశంలోనే సరికొత్త తయారీ రంగ హబ్ గా మార్చేందుకు అడుగులు వేస్తోంది. గత రెండేళ్లలో మెగా ప్రాజెక్టులు వచ్చాయి.

Andhra Pradesh SIPB Approved Projects Jobs: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చిత్రపటంలో రాయలసీమ ప్రాంతం సరికొత్త విప్లవానికి వేదికవుతోంది. ఒకప్పుడు కేవలం కరవు పీడిత ప్రాంతంగా, ఫ్యాక్షనిజం నీడలో మగ్గిన సీమను.. ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తయారీ రంగ కేంద్రం గా మార్చేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది.  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో అధికారంలోకి వచ్చిన గత రెండేళ్ల  కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రూ.21.64  లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదం తెలపగా.. అందులో అత్యధిక శాతం మెగా ప్రాజెక్టులను రాయలసీమకే  వచ్చాయి. 

కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం 

ఈ పారిశ్రామిక ప్రగతికి సరికొత్త మైలురాయిగా.. దశాబ్దాల కాలంగా కడప జిల్లా ప్రజల కలగా మిగిలిపోయిన  కడప స్టీల్ ప్లాంట్  కల సాకారమైంది. జూలై 3, 2026 నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు గ్రామాల్లో రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న  జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్  నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. గత ప్రభుత్వాల హయాంలో కేవలం శిలాఫలకాలకే పరిమితమైన ఈ మెగా ప్రాజెక్టును, కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే అన్ని అనుమతులు సాధించి క్షేత్రస్థాయిలో గ్రౌండింగ్ చేయడం సీమ పారిశ్రామిక చరిత్రలోనే ఒక విప్లవాత్మక అడుగు. 2 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో, పర్యావరణహిత  గ్రీన్ స్టీల్ టెక్నాలజీతో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్ ద్వారా రాయలసీమ అంతటా వేలాది మంది యువతకు ఉపాధి లభించనుంది.
 
సీమకు 'రాయల్' వైభవం 

ఆటోమొబైల్ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనంతపురం కియా మోటార్స్ విజయవంతం కావడంతో.. తాజాగా తిరుపతి సమీపంలో ద్విచక్ర వాహన దిగ్గజ సంస్థ  రాయల్ ఎన్‌ఫీల్డ్  తన భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ..  ఇది కేవలం రాయలసీమ కాదు, పారిశ్రామికంగా నిజమైన  రాయల్  సీమ  అని అభివర్ణించారు. కేవలం భారీ పరిశ్రమలే కాకుండా, హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనూ రాయలసీమను నిలబెట్టేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై డీల్స్ కుదుర్చుకుంటోంది. ఇటీవల సింగపూర్‌లో జరిగిన 'సెమికాండక్టర్ ఎకోసిస్టమ్ రౌండ్‌టేబుల్' సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు.. గ్లోబల్ టెక్నాలజీ సంస్థలను ఆంధ్రాకు ఆహ్వానించారు. ఇందులో భాగంగా భవిష్యత్తులో అత్యంత డిమాండ్ ఉన్న  సెమికాండక్టర్ చిప్ తయారీ కేంద్రాన్ని  రాయలసీమలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ మరియు ఎయిర్‌క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలకు రాయలసీమ భౌగోళికంగా అత్యంత అనుకూలమైన ప్రాంతమని ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్లకు రోడ్ మ్యాప్ చూపిస్తోంది.

ఒప్పందాలే కాదు..గ్రౌండింగ్ కూడా 

మరోవైపు, చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీ ఇప్పటికే ఫాక్స్‌కాన్, క్యాడ్‌బరీ, పెప్సికో, డిక్సన్ టెక్నాలజీస్ వంటి వందలాది అంతర్జాతీయ బ్రాండ్లతో దేశంలోనే టాప్ ఎలక్ట్రానిక్స్ హబ్‌గా వెలుగుందుతోంది. దీనికి అదనంగా పునరుత్పాదక ఇంధన  రంగంలోనూ రాయలసీమ దూసుకుపోతోంది. కర్నూలు జిల్లాలో గ్రీన్‌కో  వంటి ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్, విండ్ పవర్ స్టోరేజ్ పార్కులు శరవేగంగా విస్తరిస్తున్నాయి. పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం కడప స్టీల్ ప్లాంట్‌ను నేషనల్ హైవే-67తో అనుసంధానించడం, పీఎం గతిశక్తి కింద ముద్దనూరు రైల్వే స్టేషన్‌కు 12 కిలోమీటర్ల ప్రత్యేక రైల్వే లింక్ ఏర్పాటు చేయడం వంటి పనులను ప్రభుత్వం ఇప్పటికే గ్రౌండింగ్ చేసింది.

వచ్చే మూడేళ్లు పెట్టుబడుల విప్లవమే 

  గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అనుసరించిన దూకుడు, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీల పర్యవేక్షణ కారణంగా రాయలసీమ రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్ బాంబుల మోతతో వార్తల్లో నిలిచిన ప్రాంతం.. ఇప్పుడు పరిశ్రమల సైరన్ల మోతతో ప్రగతి పథంలో పయనిస్తోంది. కడపలో జేఎస్‌డబ్ల్యూ గ్రీన్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కావడం, తిరుపతికి రాయల్ ఎన్‌ఫీల్డ్ రావడం, ప్లానింగ్‌లో ఉన్న సెమికాండక్టర్ హబ్ వంటి ప్రాజెక్టులు పూర్తయితే.. రాబోయే ఐదేళ్లలో రాయలసీమ దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన పారిశ్రామిక సామ్రాజ్యంగా అవతరించడం ఖాయమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget