అన్వేషించండి

AP CM Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. ఏపీకి దిగ్గజ సంస్థ రావడంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్

Rayalaseema to become Royal Seema | తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పెట్టుబడులకు నిర్ణయం తీసుకోవడంతో సీమ ప్రాంతానికి 'రాయల్' కళ రాబోతోందని సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్ చేశారు.

Andhra Pradesh News Today | అమరావతి: రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్న తన నిబద్ధతను చాటుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. సీమ ప్రాంతానికి పాత వైభవం తీసుకువస్తూ, ఇకపై ఇది కేవలం రాయలసీమ మాత్రమే కాదు, నిజమైన 'రాయల్' సీమ అని ఆయన అభివర్ణించారు. తిరుపతిలో ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గజ సంస్థ 'రాయల్ ఎన్‌ఫీల్డ్' భారీ పెట్టుబడులతో తన యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో, ఆ సంస్థ పేరులోని రాయల్ అనే పదాన్ని సీమకు అన్వయిస్తూ సీఎం చంద్రబాబు ఈ పోస్ట్ పెట్టారు.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న రాయలసీమ.. 
రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం పారిశ్రామికంగా, ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ పారిశ్రామిక రంగంలో అనేక అంతర్జాతీయ, జాతీయ స్థాయి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ (Sri City) ఒక భారీ పారిశ్రామిక హబ్‌గా అవతరించింది. ఇక్కడ క్యాడ్‌బరీ, పెప్సికో, కోల్గేట్-పామోలివ్, కెల్లాగ్స్, మొబైల్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ వంటి కంపెనీలు తమ యూనిట్లను నడుపుతున్నాయి.

 ఇక ఆటోమొబైల్ రంగంలో అనంతపురం జిల్లాలో ఉన్న కియా మోటార్స్ ఒక గేమ్ చేంజర్‌గా నిలిచింది. దీనికి తోడు తాజాగా తిరుపతి సమీపంలో ద్విచక్ర వాహన దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తన భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. వీటితో పాటు, చిత్తూరు జిల్లాలో అమర రాజా బ్యాటరీస్, మదనపల్లె పరిసరాల్లో డిక్సన్ టెక్నాలజీస్ వంటి సంస్థలు వేలమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కడప జిల్లాలో స్టీల్ పరిశ్రమల ఏర్పాటు దిశగా జేఎస్‌డబ్ల్యూ (JSW Steel) వంటి సంస్థలు అడుగులు వేస్తున్నాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్, విండ్ పవర్ పార్కులు (గ్రీన్ కో వంటి సంస్థల ఆధ్వర్యంలో) ఏర్పాటు కావడం విశేషం. సిమెంట్ పరిశ్రమకు పుట్టినిల్లు అయిన ఈ ప్రాంతంలో అల్ట్రాటెక్, జువారీ, పన్యాం సిమెంట్స్ వంటి ప్రముఖ సంస్థలు దశాబ్దాలుగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మరిన్ని సంస్థల రాకతో రాయలసీమ ప్రాంతం ఒక పవర్‌ఫుల్ పారిశ్రామిక కారిడార్‌గా మారుతోంది.

అదేవిధంగా, విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారుతున్న క్రమంలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభం కానుండటంపై కూడా చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వైజాగ్ అభివృద్ధిని ప్రతిబింబించేలా గూగుల్ లోగో శైలిలో ఒక ప్రత్యేకమైన పోస్టును ఆయన పంచుకున్నారు. రాష్ట్రంలోకి గూగుల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి అంతర్జాతీయ సంస్థలు వస్తుండటం ఏపీ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని, దీని ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Annadata Sukhibhava Status: ఏపీలో అన్నదాత సుఖీభవపై లేటెస్ట్ అప్‌డేట్! ఖరీఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఇస్తారంటే?
ఏపీలో అన్నదాత సుఖీభవపై లేటెస్ట్ అప్‌డేట్! ఖరీఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఇస్తారంటే?
Chandrababu Wishes Balakrishna On His Birthday: నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kit:ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?
ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?
Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
Telangana Congress Internal Conflicts: తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
Vijay Deverakonda: విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
US Military Attack: పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Rohit Sharma, Virat Kohli: రోహిత్, విరాట్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా.. టీమిండియా సీనియర్ల ఫ్యూచర్‌పై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!
రోహిత్, విరాట్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా.. సీనియర్ల ఫ్యూచర్‌పై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!
Embed widget