అన్వేషించండి

CI Nagarajau Arrest: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్! తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సిట్

Krishnalanka CI Nagarajau Arrest | విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సాయికృష్ణ కేసులో సిట్ అదుపులోకి తీసుకుంది.
  • సిట్ విచారణలో కుటుంబ సభ్యులు పోలీసులపై చిత్రహింసలు ఆరోపించారు.
  • పోలీస్ స్టేషన్ కీలక సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం ఉత్కంఠ రేపింది.

Vijayawada Sai Krishna Case | విజయవాడ: సంచలనం రేపిన సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయమే సిట్ అధికారులు విజయవాడలోని సీఐ నాగరాజు ఇంటికి వెళ్లారు. అయితే సీఐ నాగరాజును అరెస్ట్ చేయవద్దంటూ ఆయన మద్దతుదారులు ఉదయం నుంచి ఇంటి వద్ద ఆందోళకు దిగారు. అయితే పోలీసు సాయంతో సిట్ అధికారులు సీఐ నాగరాజును నివాసంలోకి అతికష్టం మీద వెళ్లారు. కేసు విషయమై కొన్ని గంటలపాటు ప్రశ్నించిన అనంతరం సిట్ అధికారులు సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని పోలీస్ గెస్ట్ హౌస్‌కు తరలిస్తున్నారు. అక్కడికి తీసుకెళ్లి సాయికృష్ణను కస్టడీకి ఎప్పుడు తీసుకున్నారు, ఏం జరిగిందని సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారించనున్నారు.

నాగరాజును అదుపులోకి తీసుకునేందుకు సిట్ అధికారులు ముందుగానే వాహనం సిద్ధం చేసుకుని రావడంతో సీఐకి మద్దతుగా భారీ ఎత్తున స్థానికులు, మద్దతుదారులు వచ్చారు. నాగరాజును అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అదుపులోకి తీసుకుంటారేమోనని గత మూడు రోజులుగా మాజీ సీఐ ఇంటి వద్దకు మద్దతుదారులు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి క్యాండిల్ ర్యాలీ సైతం నిర్వహించడం తెలిసిందే. ఆయన వల్లే ఏరియాలో మహిళలు ధైర్యంగా బయట తిరుగుతున్నారని, సీఐ నాగరాజు వచ్చాకే పరిస్థితిలో చాలా మార్పుల వచ్చిందన్నారు. 

సోమవారం సాయికృష్ణ కుటుంబసభ్యులను ప్రశ్నించిన సిట్
సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది. సిట్ సభ్యులు సోమవారం (జూన్ 22న) కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసం, పోలీస్ స్టేషన్, స్వర్గపురి శ్మశానవాటికలను స్వయంగా పరిశీలించారు. సాయికృష్ణ తల్లితో పాటు మేనమామలు, కుటుంబ సభ్యులను సుమారు 6 గంటల పాటు విచారించి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. పోలీసులు సాయికృష్ణను స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టి చంపేసి, ఆధారాలు లేకుండా మృతదేహాన్ని దహనం చేశారని కుటుంబ సభ్యులు సిట్‌కు తెలిపారు.

Also Read: Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్‌ సీసీటీవీ ఫుటేజీలు మాయం - వీడియో రికవరీ సాధ్యమేనా?

అనంతరం క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందంతో కలిసి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను సిట్ అధికారులు ఆమూలాగ్రం తనిఖీ చేశారు. సిబ్బంది స్టేట్‌మెంట్లు, వేలిముద్రలను సిట్ అధికారులు సేకరించారు. శ్మశానవాటిక వద్ద కాపరిని కూడా విచారించి, పరిసరాల్లోని సీసీ కెమెరాల వివరాలను ఆరా తీశారు.

సీసీటీవీ ఫుటేజీలు మాయం కావడంతో ఉత్కంఠ..
అయితే, సాయికృష్ణ కేసులో అత్యంత కీలకమైన పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీలు మాయమవడంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 18 నెలల ఫుటేజీ భద్రపరచాల్సి ఉండగా, దాదాపు ఏడాది కాలపు దృశ్యాలను తొలగించినట్లు సిట్ గుర్తించింది. కోర్టు ఆదేశాల ప్రకారం హార్డ్ డిస్క్, డీవీఆర్‌లను సీజ్ చేసి పరిశీలించగా.. కేవలం 2 రోజుల ఫుటేజీ మాత్రమే లభ్యమైంది. కేసు నుంచి తప్పించుకునేందుకు మాజీ సీఐ నాగరాజు స్థానిక టెక్నీషియన్‌తో ఈ వీడియోలను తొలగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సిట్ అదికారులు డేటా రికవరీ కోసం ఈ డేటాను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

సిట్ సభ్యులు వీరే..

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ప్రొవిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ విభాగం ఐజీ ఎం.రవిప్రకాశ్‌ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ ఎల్‌.సుధాకర్‌లను సిట్ సభ్యులుగా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే అదేరోజు సీఐ నాగరాజును అరెస్ట్ చేస్తారని ప్రచారం జరగగా, ఆయనకు మద్దతుగా రాత్రిపూట కొందరు మహిళలు స్థానికంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

Frequently Asked Questions

సాయికృష్ణ కేసులో ఏ అధికారిని అదుపులోకి తీసుకున్నారు?

సాయికృష్ణ కేసులో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని ఆయన నివాసంలో ప్రశ్నించిన అనంతరం పోలీస్ గెస్ట్ హౌస్‌కు తరలించారు.

సాయికృష్ణ కేసులో కీలకమైన సాక్ష్యం ఏమిటి?

సాయికృష్ణ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీలు కీలకం. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 18 నెలల ఫుటేజీ ఉండాల్సిందిగా, దాదాపు ఏడాది కాలపు దృశ్యాలు మాయమయ్యాయి.

సిట్ అధికారులు సాయికృష్ణ కేసులో ఎక్కడెక్కడ విచారణ జరిపారు?

సిట్ అధికారులు సాయికృష్ణ నివాసం, కృష్ణలంక పోలీస్ స్టేషన్, స్వర్గపురి శ్మశానవాటికలను పరిశీలించారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులను, శ్మశానవాటిక కాపరిని విచారించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget