అన్వేషించండి

న్యాయవ్యవస్థపై విశ్వాసం కాపాడేలా చర్యలు అవసరం: సీజేఐ

పదేళ్ల క్రితం నూతన కోర్టు భవనాలకు తానే శంకుస్థాపన చేశానని.. ఇప్పుడు వాటిని తానే ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు.

న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పు కోసం న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. సీనియర్‌ న్యాయవాదులు జూనియర్లకు ప్రోత్సాహమిస్తే బాగుంటుందని సూచించారు. 

తెలుగులో ప్రసంగం

పదేళ్ల క్రితం నూతన కోర్టు భవనాలకు తానే శంకుస్థాపన చేశానని.. ఇప్పుడు వాటిని తానే ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు. విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో నిర్మించిన జీ+7 నూతన భవనాలను ఈ ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ‘వక్తలంతా ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించారు. సీఎం తెలుగులో మాట్లాడాక.. తాను మాట్లాడకపోతే బాగుండదు. నేను, సీఎం జగన్‌ తెలుగులో ప్రసంగించడం సంతోషకర విషయం. కోర్టు భవన నిర్మాణాలు పూర్తికావడం చాలా సంతోషించదగ్గ విషయం. రాష్ట్ర విభజన, ఆర్థిక సమస్యలు, నిధుల జాప్యంతో ఈ భవనాల నిర్మాణం ఆలస్యమైంది. జాప్యం వల్ల లాయర్లు, జడ్జీలు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ఇబ్బందిపడ్డారు. ఇప్పటికీ ఈ కాంప్లెక్స్‌ పూర్తికావడం సంతోషదాయకం. పూర్తయిన భవనాలను సక్రమంగా వినియోగించుకోవాలి".

కేంద్రం సహకరించాలి

‘ప్రజలందరికీ సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉంది. న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చాం. భవనాల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావాలని కోరాను. కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భవనాల నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇస్తే సహకరించినట్లవుతుంది. ఇక న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం. న్యాయవ్యవస్థను పటిష్ఠ పరిచే కార్యక్రమాల్లో భాగస్వామ్యం తప్పనిసరి. సమాజంలో మార్పు కోసం న్యాయవాదులు కృషి చేయాలి. సీనియర్‌ న్యాయవాదులు జూనియర్లకు ప్రోత్సాహమిస్తే బాగుంటుంది. చాలా మంది గొప్ప మనసుతో నన్ను ఆదరించి పైకి తీసుకువచ్చారు. ఈ నెల 27న పదవీ విరమణ చేయబోతున్నా. నా ఉన్నతికి, విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు.

సీఎం సహకరించారు
‘రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సహకరిస్తానని సీఎం జగన్‌ అన్నారు. నిర్మాణాల పూర్తికి సీఎం సహకరించారు. విశాఖలో కూడా కొన్ని భవనాల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. విశాఖలో భవన నిర్మాణాల పూర్తికి సీఎం సహకరిస్తారని ఆశిస్తున్నా’ అని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పేర్కొన్నారు.

ఇది గుర్తుండిపోయే ఘట్టం: జగన్‌
‘విజయవాడలో నూతన జిల్లా కోర్టు భవనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ సీజేఐ చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. 2013లో జస్టిస్‌ ఎన్‌.వి. రమణ చేతులమీదుగా భూమిపూజ జరిగింది. నిర్మాణాల ప్రారంభోత్సం కూడా ఆయన చేతులమీదుగానే జరిగింది. ఇది గుర్తుండిపోయే ఘట్టం. న్యాయవ్యవస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. న్యాయవ్యవస్థకు చెందిన ప్రతి విషయంలో సహకారానికి సిద్ధం’ అని సీఎం జగన్‌ ప్రకటించారు.

టాప్ హెడ్ లైన్స్

DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget