అన్వేషించండి

Andhra News : వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని టీచర్ సస్పెన్షన్ - ఈ వింత కూడా ఏపీలోనే !

WhatsApp Suspend : వాట్సాప్ చూడటం లేదని ఓ టీచర్ ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. స్కూల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని మరో కారణం చెప్పారు. ఈ ఉత్తర్వులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Teacher suspended for not checking WhatsApp :  ఆఫీసులో అదే పనిగా వాట్సాప్ చూస్తే పై అధికారులు కింద  ఉద్యోగుల్ని హెచ్చరిస్తారు. వాడొద్దని  వార్నింగ్‌లు ఇస్తారు. కానీ వాట్సాప్ చూడటం లేదని  ఎవరైనా సస్పెండ్ చేస్తారా.. ఖచ్చితంగా చేస్తారు.. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్‌లో. 

విజయవాడలోని మొగల్రాజపురంలో  బీఎస్ఆర్కే మున్సిపల్ హైస్కూల్‌లో పని చేస్తున్న ఎల్‌ రమేష్ అనే ఉపాధ్యాయుడ్ని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో విద్యాశాఖాధికారి చెప్పినప్రధాన కారణం... సదరు ఉపాధ్యాయుడు ఎల్ రమేష్ వాట్సాప్ చూడటం లేదట. అంతే కాదు స్కూల్  గ్రూప్ నుంచి  ఎగ్జిట్ అయ్యారట. స్కూల్ గ్రూపు నుంచి ఎగ్జిట్ అయి.. వాట్సాప్ చూడకపోవడం  వల్ల...ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలను ఆయన మిస్ అవుతున్నారని అంటున్నారు. ఆయనతో కమ్యూనికేట్ చేయడం కష్టంగా ఉందని..చెబుతున్నారు.                  

ఇలా ఎందుకు చేశారని  ఎల్ రమేష్ ను పై అధికారులు వివరణ కూడా అడిగారు. అయితే  తనకు కంటి సమస్య ఉందని మొబైల్ ఫోన్ ను అదే పనిగా వాడవద్దని.. ముఖ్యంగా వాట్సాప్ చూడవద్దని వైద్యుడు సూచించారని  రమేష్ వివరణ ఇచ్చారు. అయితే ఆయన నోటి మాటగానే ఈ వివరణ ఇచ్చారని.. వైద్యుడు ఇచ్చిన సూచనల డాక్యుమెంట్లు సమర్పించలేదని వివరణ తీసుకున్న అధికారి తేల్చారు. ఇది పూర్తిగా నిర్లక్ష్యమేనని అందుకే ఆయనను  సస్పెండ్ చేయాల్సిందేనని తీర్మానించి.. నిర్ణయం తీసుకున్నారు.         
Andhra News : వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని టీచర్ సస్పెన్షన్ - ఈ వింత కూడా ఏపీలోనే !                   

అధికారుల ఉత్తర్వులు వైరల్ గామారాయి. వాట్సాప్ వాడకపోవడం తప్పు ఎలా అవుతుందన్న ప్రశ్నలు ఉపాధ్యాయ వర్గాల్లోనే వస్తున్నాయి. కమ్యూనికేషన్ ను వాట్సాప్ ద్వారా చేయడం అనేది ఓ ఆప్షనే కానీ.. అదేమీ నిర్బంధం కాదని.. చెబుతున్నారు. వాట్సాప్ లు లేక ముందు కూడా స్కూళ్లు, ఉపాధ్యాయులు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వాడాలా వద్దా అన్నది వ్యక్తిగత ఇష్టం.. వాట్సాప్ ఉన్న వారికి ఆదేశాలు వాట్సాప్ లో ఇచ్చి.. లేని వారికి.. మరో పద్దితలో సమాచారం ఇస్తే సరిపోయేదానికి  ఇలా సస్పెన్షన వేటు వేయడమేమిటన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.                                         

అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం.. ఆ ఉపాధ్యాయుడు విధుల్లో పూర్తి స్థాయి నిర్లక్ష్యంగా ఉంటున్నారని.. వాట్సాప్ లో ఉండకపోవడం కూడా కారణమని అంటున్నారు. ఏది ఏమైనా..  ఉపాధ్యాయులు ఈ ఉత్తర్వులను చూపించి పై అధికారులు ఎలా వేధిస్తున్నారో ఇంత కంటే సాక్ష్యం ఉంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నారు.                                               

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget