By: ABP Desam | Updated at : 22 Feb 2023 12:19 AM (IST)
టీడీపీ నేత పట్టాభి రామ్, భార్య చందన
విజయవాడ : తన భర్తను ఎక్కడికి తీసుకెళ్లారో అర్థం కావడం లేదంటూ టెన్షన్ పడ్డ టీడీపీ నేత పట్టాభి భార్య ఎట్టకేలకు భర్తను కలుసుకున్నారని సమాచారం. పోలీసుల కళ్ళుగప్పి జీజీహెచ్‍కు వచ్చిన చందన తన భర్త పట్టాభిని చూసి కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి తన భర్త పట్టాభిను చూడడం కోసం చందన చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కోర్టు ఆదేశాలతో చికిత్స ఇప్పించేందుకు పట్టాభిని జీజీహెచ్ కు తరలించగా.. పోలీసుల కళ్లుగప్పి అక్కడికి చేరుకున్న చందన భర్త పట్టాభిని కలిసి జరిగిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. భర్త పరిస్థితి చూసి ఆమె చలించిపోయినట్లు సమాచారం. తన భర్తను చూపించకపోతే నిరాహార దిక్షకు దిగుతానని పట్టాభి భార్య చందన అల్టిమేటం జారీ చేయడం తెలిసిందే.
జీజీహెచ్‍లో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వైద్యులు. మంగళవారం రాత్రి జీజీహెచ్ లోనే ఉంచే అవకాశం ఉంది. పట్టాభితో పాటు 14 మంది టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. వీరిలో కొందరు టీడీపీ నేతలను గన్నవరం సబ్ జైలుకు తరలించారు. బుధవారం ఉదయం టీడీపీ నేతలందర్నీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గన్నవరం ఘటనలో టీడీపీ నేతలకు స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పట్టాభిరామ్ సహా 14 మంది టీడీపీ నేతలకు 14 రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. చికిత్స కోసం పట్టాభిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పట్టాభికి చికిత్స అందించాలని టీడీపీ నేతలు కోర్టును కోరారు. గన్నవరం కోర్టులో టీడీపీ నేత పట్టాభిని హాజరుపర్చారు పోలీసులు. కోర్టులో తన వాదనలు వినిపించిన పట్టాభి.... తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. ముగ్గురు వ్యక్తులు ముసుగుతో వచ్చి అరగంటసేపు కొట్టారన్నారు. వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారన్నారు. తోట్లవల్లూరు స్టేషన్‍కు వెళ్లేసరికి అంతా చీకటిగా ఉందని, అక్కడ తనపై దాడి చేశారని ఆరోపించారు. వివిధ స్టేషన్లకు తిప్పుతూ తనను చిత్రహింసలు పెట్టారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు ఉన్న కోర్టు పట్టాభికి చికిత్స అందించాలని ఆదేశించింది.
ముసుగులో వచ్చి అరగంటసేపు కొట్టారు- పట్టాభి
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, దొంతు చిన్నా, గురుమూర్తి సహా 14 మంది టీడీపీ నేతలకు గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గన్నవరం పోలీస్ స్టేషన్ లో వైద్య పరీక్షల అనంతరం టీడీపీ నేతలను జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఈ సమయంలో పట్టాభిరామ్ పోలీసులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తోట్లవల్లూరు స్టేషన్‌కు వెళ్లే సరికి అంతా చీకటిగా ఉందని, ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి అరగంట సేపు తీవ్రంగా కొట్టారని ఆవేదన చెందారు. తనను వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారని తెలిపారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కోర్టులో న్యాయమూర్తికి చెప్పారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభిరామ్ సహా 14 మంది టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్ విధించారు. పట్టాభికి చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది.
Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు
Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు
YS Jagan: వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష - రబీ సీజన్ ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
Lovers Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నో, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కలకలం!
Guntur Crime News: మాకు చెప్పకుండా జనాల్ని తీసుకెళ్తారా ? వ్యక్తిపై బ్లేడుతో దాడి చేసిన కానిస్టేబుల్!
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!
Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి