అన్వేషించండి

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట- గ్రూప్‌-1 రద్దు తీర్పు సస్పెండ్‌ చేసిన హైకోర్టు

AP High Court: 2018 గ్రూప్-1 కింద 167 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చింది. అయితే ఎంపిక‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, మూడు సార్లు మూల్యాంక‌న జ‌రిగింద‌ని కొంద‌రు అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

Group-1 News : హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. 2018 గ్రూప్‌ వన్‌ మెయిన్స్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్‌ ఇప్పటి వరకు ఎంపికైన ఉద్యోగులు విధుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. తదపరి విచారణ వారానికి వాయిదా వేసింది. 

2018 గ్రూప్-1 కింద 167 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చింది. అయితే ఎంపిక‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, మూడు సార్లు మూల్యాంక‌న జ‌రిగింద‌ని కొంద‌రు అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మ‌రోవైపు హైకోర్టు ఆదేశాల‌తో డిజిట‌ల్ మూల్యాంక‌న ర‌ద్దు చేసి ఒకేసారి మాత్రమే మాన్యువ‌ల్‌గా మూల్యాంక‌న చేశామ‌ని వాద‌న‌లు వినిపించింది ఏపీపీఎస్సీ బోర్డు. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న సింగిల్ జ‌డ్జి బెంచ్ మెయిన్స్ ప‌రీక్షను ర‌ద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.  దీంతో ఆ నోటిఫికేష‌న్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వారిలో ఆందోళ‌న మొద‌లైంది. ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని, అభ్యర్థుల ప్రయోజ‌నాలు కాపాడి తీరుతామ‌ని ఏపీ ప్రభుత్వం ప్రక‌టించింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును ఏపీపీఎస్సీ డివిజ‌న్ బెంచ్ ఎదుట స‌వాల్ చేసింది. తీర్పుపై స్టే విధించాల‌ని కోరింది. ఈ క్రమంలో మాన్యువ‌ల్‌గా ఒక్కసారే మూల్యాంక‌నం చేసిన సీసీ కెమెరా ఫుటేజీల‌ను డివిజ‌న్ బెంచ్‌కు ఏపీపీఎస్సీ స‌మ‌ర్పించింది. వాటిని ప‌రిశీలించిన డివిజ‌న్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. తదుప‌రి విచార‌ణ‌ను మార్చి 27కి వాయిదా వేసింది.

ఏపీలో 167 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి  2018 మే 26న ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80250 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో పేపర్-1 (జనరల్ స్టడీస్) పరీక్షకు 59,697 మంది అభ్యర్థులు; పేపర్-2 (జనరల్ ఆప్టిట్యూడ్) పరీక్షకు 59,200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో మొత్తం 8,351 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు. డిసెంబర్ 12 నుంచి 23 వరకు 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. వీటి ఫలితాలను వెల్లడించి, ఇంటర్వూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేసింది. తాజాగా హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ మెయిన్స్ పరీక్ష రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లడంతో ఊరట లభించింది. హైకోర్టు తాజా ఆదేశాలతో అభ్యర్థులకి కూడా  ఊరట లభించినట్లైంది.

టాప్ హెడ్ లైన్స్

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget