అన్వేషించండి

Tirumala Laddu Controversy: లడ్డూ వివాదంలో మరో కీలక పరిణామం-టీటీడీ ఈవోకు సీఎంవో నుంచి పిలుపు

Tirumala Laddu Issue: లడ్డూ వివాదంలో చర్యలు దిశగా ప్రభుత్వం కదులుతోంది. ఏం జరిగిందో రిపోర్ట్ రెడీ చేయమని టీటీడీని ఆదేశించిన చంద్రబాబు... ఈవోను రాజధానికి పిలిచారు

Tirupati Laddu Dispute: తిరుపతి లడ్డూ కల్తీ వివాదం మరింత పెద్దది అవుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా దీనిపై ఆందోళనలు జరుగుతున్నాయి. బిజీపే నేతలు కూడా నెయ్యిలో కల్తీ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల భక్తుల మనోభావాలకు చెందిన విషయంగా చెబుతున్నారు. నిజంగా లడ్డూ తయారు చేసే నెయ్యిలో యానిమల్ ఫాట్ కలిసిందా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

బయటపెట్టిన చంద్రబాబు

గత వైసీపీ హయాంలో జరిగిన దారుణల్లో ఇది అత్యంత హేయమైనది అని సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనడంతో విషయం బయటకు వచ్చింది. వెంటనే వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి లాంటి వాళ్ళు తెరపైకి వచ్చి ఈ ఆరోపణలను ఖండించారు. అయితే టీడీపీ నేతలు నెయ్యిని టెస్ట్ చేసిన రిపోర్ట్స్ బయట పెట్టారు. దానితో ప్రజల్లో ఆందోళన మొదలైంది. 

బీజేపీపై జగన్ విమర్శలు

అంతవరకూ దీనిని రాజకీయ ఆరోపణగానే భావించిన వారు సైతం ఆ రిపోర్ట్ బయటకు రావడంతో షాక్ తిన్నారు. వివాదం మరింత ముదరడంతో మీడియా ముందుకు వచ్చిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదంతా ఫేక్ ప్రచారం అని కొట్టి పారేశారు. కేంద్రంలో బీజేపీ నాయకులు కూడా హాఫ్ నాలెడ్జ్‌తో అనవసర ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. అనేక టెస్టుల తర్వాతే నెయ్యిని తిరుమలకు అనుమతిస్తారని దానిలో కల్తీ జరిగే ప్రశక్తే లేదని కూడా జగన్ తెలిపారు.

సమగ్ర విచారణ చేస్తున్నామని ఈవో వివరణ 
ఈ వ్యవహారంపై ఇప్పటికే మాట్లాడిన టీటీడీ ఈవో శ్యామల రావు గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారు చేసే నెయ్యి లో కల్తీ జరిగిన మాట నిజమే అని అన్నారు. వెంటనే ఆ పాత డీలర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని చెప్పారు. ఈ వివాదంపై ఇంటర్నల్‌గా టీటీడీలో విచారణ చేస్తున్నామని అని కూడా చెప్పారు. ఆవు నెయ్యిని అంత తక్కువ ధరకు ఎలా సప్లయ్ చేస్తున్నారనే అనుమానంతో విచారణ ప్రారంభిస్తే అది కల్తీ నెయ్యి అనే విషయం బయటపడింది అని చెప్పు కొచ్చారు.

Also Read: లడ్డూ వివాదంతో చంద్రబాబు కీలక నిర్ణయం- పోటు నుంచి నెయ్యి ఉంచే ప్రదేశాల వరకు సంప్రోక్షణ

టీటీడీ ఈవో కు CMO పిలువు 

మరోవైవు ఏపీ ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి టీటీడీ ఈవోకు పిలువు వచ్చింది. ఇప్పటికే తమవద్ద ఉన్న రిపోర్ట్స్‌కు తోడు ఈవో దగ్గర ఉన్న ఆధారాలు కూడా పరిశీలించి ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ వివాదం పై సిబిఐ దర్యాప్తు కూడా అవసరం అని మిగిలిన రాజకీయ పక్షాలు, సెలబ్రిటీల నుంచి డిమాండ్ వస్తోంది. టీటీడీలో ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ఉన్నారు సామాన్య భక్తులు. మరి ఈ వివాదం మరెన్ని మలువులు తిరుగుతుందో చూడాలి.

Also Read: తిరుమలకు నెయ్యి సరఫరా చేసే సంస్థలు ఎన్ని?

టాప్ హెడ్ లైన్స్

Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Kesineni Chinni daughter Issue: ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget