CM Jagan News: నేడు సీఎం జగన్ విజయవాడ పర్యటన, షెడ్యూల్ ఇదీ
Vijayawada Local News: నేడు ఉదయం 10 గంటల 20 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి జగన్ చేరుకుంటారు.
CM Jagan News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan reddy ) నేడు (నవంబర్ 11) విజయవాడ(Vijayawada) నగరంలో పర్యటించనున్నారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం(Indira Gandhi Municipal Stadium)లో నేడు భారతరత్న, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్(Maulana Azad) జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఇవి 135వ జయంతి ఉత్సవాలు. ఈ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమాల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్సీలు తలసీల రఘురాం, రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదిథి సింగ్ ఏర్పాట్లను నిన్న (నవంబరు 10) పరిశీలించారు.
నేడు ఉదయం 10 గంటల 20 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి జగన్ చేరుకుంటారు. అక్కడ మైనారిటీస్ వెల్పేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఏటా నవంబర్ 11వ తేదీని మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని దేశం మొత్తం జాతీయ విద్యా దినంగా, మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తుంటారు.