అన్వేషించండి

US Kurnool Youth: అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం

US Andhra Man : తండ్రి వాచ్‌మెన్. అయినా కుమారుడు బాగుపడాలని అమెరికా పంపాడు.కానీ అక్కడ ఉద్యోగం దొరకలేదని ఆ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Unemployed Andhra youth Kills Self In US :  అమెరికా గడ్డపై తన భవిష్యత్తును వెతుక్కునేందుకు వెళ్లిన ఒక తెలుగు తేజం అర్థాంతరంగా తనువు చాలించింది. కర్నూలు జిల్లాకు చెందిన 26 ఏళ్ల  ఇరగనబోయిన చందు , చికాగోలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నవారి కష్టాలను తీర్చి, ఇంటికి అండగా నిలబడాల్సిన కొడుకు విగతజీవిగా మారాడన్న వార్త విన్న ఆ తండ్రి గుండె పగిలిపోయింది. ఉన్నత చదువుల కోసం చేసిన అప్పులు, తీరని ఉద్యోగ కల ఆ యువకుడిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేయడమే ఈ ఘాతుకానికి కారణమని తెలుస్తోంది.

కన్నవారి కష్టాన్ని చూసి తల్లడిల్లి..              

చందు చికాగోలోని డిపాల్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశాడు. తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కొడుకును విదేశాలకు పంపాడు. చదువు పూర్తయ్యాక కొద్ది వారాలుగా ఉద్యోగం కోసం చందు తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆశించిన ఫలితం రాకపోవడం, ఇంటి వద్ద తండ్రి పడుతున్న కష్టం, పెరుగుతున్న అప్పులు అతడిని కలచివేశాయి. తన వల్ల కుటుంబానికి భారం పెరుగుతోందన్న ఆవేదనతోనే చందు ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు అతని స్నేహితులు చెబుతున్నారు.

 అండగా నిలుస్తున్న ప్రవాస భారతీయులు                

చందు మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అయ్యే దాదాపు 25,000 డాలర్లు అంటే సుమారు 20 లక్షలు  ఖర్చు భరించడం ఆ కుటుంబానికి శక్తికి మించిన పని.  దీంతో చికాగోలోని భారతీయ సమాజం చేయి కలిపింది. చందు మృతదేహాన్ని కర్నూలుకు తరలించడంతో పాటు, ఆ కుటుంబం చేసిన అప్పులను తీర్చేందుకు  1,20,000 డాలర్ల  లక్ష్యంతో క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు. కేవలం రెండు రోజుల్లోనే సుమారు  76,000 డాలర్లు అంటేరూ. 63 లక్షలకు పైగా   విరాళాలు వచ్చాయి.  

 
 స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు             

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చే శారు.  చందు మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇంటికి చేర్చాలని కోరుతూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు హామీ ఇచ్చారు.

చందు ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లాడు. అందరికీ ఆపన్న హస్తం అందించే మంచి మనసున్న వ్యక్తి. కానీ విధి అతడిని ఇలా బలి తీసుకోవడం మా వల్ల కావడం లేదు అంటూ అతని స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.                      

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Embed widget