అన్వేషించండి

కడప రామకీర్తన హత్య కేసు.. నిందితుడు వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు

కడప జిల్లా ఖాజీపేటలో ఇంటర్ విద్యార్థి రామకీర్తనను గొంతుకోసి హత్య చేసిన నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి శనివారం నాడు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

కడప: వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటలో సంచలనం సృష్టించిన బాలిక రామకీర్తన హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలిక గొంతుకోసి కిరాతకంగా హత్య చేసిన నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు వివరాలను డీఎస్పీ రాజేంద్రప్రసాద్ మీడియాకు వెల్లడించారు.

డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 10వ తేదీన ఖాజీపేట అగ్రహారంలో రామకీర్తన అనే బాలికను వెంకటేష్ అత్యంత క్రూరంగా హత్య చేశాడు. నిందితుడిని పట్టుకునే క్రమంలో అతను అటవీ ప్రాంతంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పోలీసులపై దాడికి పాల్పడటంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిసిందే. గాయపడిన నిందితుడు వెంకటేష్‌ను తొలుత మైదుకూరు ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు.

చికిత్స పూర్తి చేసుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై హత్య కేసుతో పాటు పోలీసులపై దాడి చేసినందుకు గానూ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పి.టి వారెంట్‌పై అతడిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ప్రేమించలేదని యువతి గొంతుకోశాడు..

కడప జిల్లా ఖాజీపేటలో జరిగిన రామకీర్తన హత్య రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. తనను ప్రేమించడం లేదనే కనికరం లేని కక్షతో వెంకటేష్ అనే యువకుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. కేవలం 17 ఏళ్ల వయసున్న రామకీర్తన ఇంటిలోకి చొరబడి, ఆమె గొంతు కోసి కిరాతకంగా ప్రాణాలు తీశాడు. ఈ నెల 14వ తేదీన తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాల్సిన ఆ బాలిక, అంతలోనే విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. పండగలా ఉండాల్సిన ఆ ఇల్లు కళ తప్పింది.

ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు కొన్ని రోజుల కిందటే అదుపులోకి తీసుకున్నారు. అయితే, మైదుకూరు నుండి అతడిని తరలిస్తుండగా బసాపురం చెక్‌పోస్ట్ వద్ద నిందితుడు పోలీసులపై తిరగబడ్డాడు. కానిస్టేబుళ్లపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు హెచ్చరించినప్పటికీ నిందితుడు లొంగిపోకపోవడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు అనివార్యంగా మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వెంకటేష్ రెండు మోకాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడిని భారీ బందోబస్తు నడుమ కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు, పట్టపగలే జరిగిన ఈ ఘోర హత్యపై స్థానికులు, బాధితురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వారు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఉన్మాది చేతిలో బలైన బాలికకు న్యాయం చేయాలని వారు నినదించారు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కుమారుడు అమాయకుడంటూ తల్లి ఆవేదన

రామకీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ తల్లి సుజాత కొన్ని రోజుల కిందట మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడి జేబులో దొరికిన లేఖ ద్వారానే వారి ప్రేమ వ్యవహారం తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. హత్య జరిగిన రోజు వెంకటేష్ ఇంటికి వచ్చి, తనను హత్తుకుని ఏడ్చాడని తెలిపారు. కీర్తన తనను మోసం చేసిందని, నిలదీయగా ఆమె కత్తితో బెదిరించిందని, ఆ పెనుగులాటలోనే ప్రమాదవశాత్తు గొంతు తెగిందని తన కొడుకు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. బాలిక తల్లిదండ్రులు ముందే హెచ్చరించి ఉంటే బాగుండేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
Advertisement

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
హైరైడర్ హైబ్రిడ్‌ & డస్టర్ టర్బో DCT కంపారిజన్‌ - లాంగ్‌టర్మ్‌లో ఎక్కువ లాభం ఇచ్చేది ఏ కారు?
సిటీలోఎక్కువ డ్రైవ్‌ చేసేవాళ్లకు ఏ SUV బెస్ట్‌? టయోటా హైరైడర్ హైబ్రిడ్‌ Vs రెనాల్ట్ డస్టర్‌ - ఏది కొనాలి?
Shreyas Iyer World Record: కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్ 
కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్ 
Embed widget