Tirumala Temple: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచిన టీటీడీ
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను అధికారులు పెంచారు. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున టోకెన్లు జారీ చేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచిన్నట్లు వెల్లడించింది. రోజుకు 8 వేల టోకెన్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచడంతోపాటూ దర్శన సమయాన్ని పెంచింది టీటీడీ. కోవిడ్ తరువాత ఇందుకు తిరుమలలో పరిస్ధితులు మారాయి. ప్రతి భక్తుడు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ పరిమిత సంఖ్యలోనే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోంది.
ఆధార్ కార్డు ఆధారంగా అన్ని ప్రాంతాల వారికి టోకెన్లు జారీ చేయనున్నారు. నేటి నుంచి ఏకాంతసేవ రాత్రి 12 గంటలకు నిర్వహించనున్నారు. రాత్రి 12 గంటల వరకు శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా విడుదల చేసేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం తితిదే వెబ్‌సైట్‌లో ప్రత్యేక పోర్టల్‌ను తెచ్చింది. ఇప్పటివరకు కరెంట్ బుకింగ్ ద్వారానే ఉచిత టోకెన్లను తితిదే జారీ చేసింది. కరోనాతో భక్తులు గుమికూడే పరిస్థితి రానివ్వకుండా ఉండేందుకు ఆన్‌లైన్ విధానాన్ని తీసుకువస్తున్నారు. ప్రస్తుతం సాంకేతికంగా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ.. త్వరలో ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్ల జారీ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు.
Also Read: Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి.. ఇదే చివరిసారి, వచ్చే ఏడాది నుంచి మరోలా..
కరోనా కారణంగా ఏడాదిన్నర కాలం నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసిన టీటీడీ.. సెప్టెంబరు 8 నుంచి తిరిగి ప్రారంభించింది. కేవలం చిత్తూరు జిల్లాకు చెందిన ప్రజలకు మాత్రమే ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్టు గతవారం టీటీడీ తెలిపింది. తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయం వద్ద టోకెన్లు జారీచేస్తున్నారు. అయితే తాజాగా ఇతర ప్రాంతాల వారికి సైతం సర్వదర్శనం టోకెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Also Read: Today Weather Update: రెయిన్ అలర్ట్.. నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
తిరుపతికి చేరుకున్న భక్తులను అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్ సిబ్బంది నిలిపివేస్తున్నారు. దీంతో వారు మనోవేదనకు గురై తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ప్రతి నెల మొదటి శుక్రవారం టీటీడీ ఈవో ఫోన్ ద్వారా భక్తులతో మాట్లాడే డయల్ యువర్ ఈవో కార్యక్రమానికి ఫోన్ చేసి సామాన్య భక్తులు తమ ఆవేదనను వ్యక్తం చేసేవారు. లేఖల రూపంలోనూ తమ సమస్యను వివరించడంతో.. సర్వదర్శనంను పునః ప్రారంభించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. మరో రెండు వేల సర్వదర్శనం టోకెన్లు అధికంగా జారీ చేసింది.
Also Read: TollyWood Drugs : డ్రగ్స్ కేసులో తరుణ్, పూరీలకు క్లీన్ చిట్ ! మరి మిగతా వాళ్ల సంగతేంటి ?