అన్వేషించండి

AP Employees Salaries : కొత్త జీతమా ? పాతదా ? ఉద్యోగులు - ప్రభుత్వం మధ్య పీటముడి ! ఒకటిన ఉద్యోగులకు జీతం అందడం కష్టమే ..

పాత జీతం కావాలని ఉద్యోగులు, కొత్త పీఆర్సీ ప్రకారం ఇస్తామని ప్రభుత్వం పట్టువీడకపోతూండటంతో ఒకటో తేదీన ఏపీ ఉద్యోగులకు జీతాలు రావడం అనుమానంగా మారింది.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెలా జీతాలు ఆలస్యం అవుతున్నాయి. ఒకటో తేదీ జీతం పడటం అరుదుగా మారింది. ‌అయితే రేపు ఒకటో తేదీనే జీతం ఇస్తామని ప్రభుత‌్వం చెబుతోంది. కానీ మాకు జీతాలు వద్దని ఉద్యోగులు అంటున్నారు. అసలు జీతాలు వద్దని అనడం లేదు కానీ పాత జీతాలు ఇవ్వాలంటున్నారు. ప్రభుత్వం మాత్రం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలిస్తామంటోంది. జీతాలు ప్రాసెస్ చేయాల్సిన ఉద్యోగులు చేయడం లేదు. ప్రభుత్వం సర్క్యూలర్ల మీద సర్క్యులర్లు ఇస్తోంది కానీ పని కావడం లేదు. ఈ రోజు జీతాల  బిల్లుల పని పూర్తి కాకపోతే ఒకటో తేదీన వారి అకౌంట్లలో జీతం పడటం కష్టమే. అందుకే జీతం వస్తుందా లేదా అన్న టెన్షన్ ఉద్యోగుల్లో ప్రారంభమయింది. 

జీతాల బిల్లులు ప్రాసెస్ చేయని ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు !

జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం చాలా రోజులుగా  ట్రెజరీ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ సర్క్యులర్లు జారీ చేస్తోంది. అయితే ఇప్పటికి పోలీసులు, మున్సిపల్ ఉద్యోగుల జీతాల బిల్లులు మాత్రమే ప్రాసెస్ అయినట్లుగా తెలుస్తోంది. పాత జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం లెక్క చూసి ఇస్తామని ప్రభుత్వం తేల్చేసింది. అయితే ఇప్పుడు ప్రాసెస్ చేయాల్సింది కూడా ఉద్యోగులే కావడంతో సమస్య వస్తోంది.  అయితే ప్రభుత్వం ముందు ఒక చాయిస్ ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సీఎఫ్ఎంఎస్‌ను అధీనంలోకి తీసుకుని అందరికీ జీతాలు వేయవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వం ఈ విధానాన్ని పాటిస్తుందో లేదో స్పష్టత లేదు. 

పాత జీతాలు కావాలంటున్న ఏపీ ఉద్యోగులు !

జనవరికి పాత జీతాలు వేస్తేనే చర్చలకు వస్తామనేది ఉద్యోగ నేతల డిమాండ్లలో ఒకటి. చర్చలకు రావాలని పిలిచిన ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి నేతలు ఇదే విషయం స్పష్టం చేస్తూ లేఖ ఇచ్చారు. కానీ  ప్రాసెస్ ప్రారంభించకుంటే.. క్రమశిక్షణా చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. డీడీఓలు, పీఏఓలు, ట్రెజరీ అధికారులకు చర్యలు తప్పవని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చిందది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే అంశంపై టైమ్ లైన్ నిర్దేశిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. శుక్రవారం సాయంత్రంలోగా అప్ లోడ్ చేసిన బిల్లులను ప్రాసెస్ చేయాల్సిందిగా పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి జీతాలు జమయ్యేలా చూడాలని ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖ సూచించింది.ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కార్యదర్శులకు, హెచ్ వోడీలకు, కలెక్టర్లకు ఆదేశాల్లో ఆర్ధిక శాఖ ఆదేశిచింది. 

చర్యలు తీసుకున్నా సరే తగ్గేదే లేదంటున్న ఉద్యోగులు !

ముందు జనవరి నెల జీతాలు పాత పద్దతి ప్రకారమే చెల్లిస్తే సరే కానీ..  కొత్త పీఆర్సీ ప్రకారం ఇస్తే ఊరుకునేది లేదని అంటున్నారు. చర్యలు తీసుకున్నా సరే తగ్గేది లేదని..ఒక్కరిపై చర్య తీసుకున్నా తక్షణమే సమ్మె ప్రారంభిస్తామని అంటున్నారు. ప్రస్తుతం నెలకొన్ని సందిగ్ధ పరిస్థితుల్లో కొంత మందికి జీతాలు అందుతాయి కానీ మెజార్టీ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చారు. ముందుగా  కొత్త జీతమా.. పాత జీతమా అనే సంగతి పక్కన పెడితే అసలు జీతం అందడం మాత్రం కష్టమన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ఏర్పడుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Embed widget