Transfers In AP: దేవాదాయ శాఖలో సామూహిక బదిలీలు- అర్థరాత్రి జీవో విడుదల
దేవాదాయ శాఖలో సామూహిక బదిలీలు....
దేవాదాయ శాఖలో ఉద్యోగుల సామూహిక బదిలీలకు అర్దరాత్రి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఎఈవో, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెటంట్, జూనియర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ విభాగంలో డీఈ, ఎఈలను బదిలీ చేశారు. ఇటీవల బదిలీలపై ఆయా దేవాలయాలకు వచ్చిన వారిని మినహాయించారు. వీరితోపాటు అనారోగ్య సమస్యలు, పదవి విరమణకు దగ్గరగా ఉన్న వారిని కూడ తప్పించారు.
దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల పరిధిలో 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారందరినీ బదిలీ చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అత్యధికంగా విజయవాడ దుర్గగుడిలో 36 మందికి స్దాన చలనం కలిగింది. బదిలీల ఆదేశాలు జూన్ 30వ తేదీ అర్దరాత్రి తరువాత విడుదలయ్యాయి.
సీనియర్ అసిస్టెంట్ క్యాడర్‌లో జోన్-1 పరిధిలో ఉన్న విశాఖ సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పని చేస్తున్న ఎన్.శ్రీనివాసరావు, నాగసత్యవాణి, ఎం.రామజోగారావు, సాయిరామ్ సింగ్‌ను విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారికి బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న జె.లక్ష్మణరావును సింహాచలానికి బదిలీ చేశారు. జోన్-2 పరిధిలో అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానంలో పనిచేస్తున్న టి.వెంకటేశ్వరరావు, బీవీ రమణలను పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానానికి బదిలీ చేశారు.
అన్నవరం దేవస్థానంలో పని చేస్తున్న బాబూరావును విజయవాడ దుర్గగుడికి, ఎంవీ మోహనరావును ద్వారకతిరుమలకు, పోలనాటి లక్ష్మీనారాయణను ద్వారకాతిరుమలకు, ఎం.ఎల్.గణపతిరావును ద్వారకా తిరుమలకు, పప్పుల వెంకటరమణను విజయవాడ దుర్గగుడికి, వై.అప్పారావును విజయవాడ దుర్గగుడికి, వలేటి జగన్నాథాన్ని విజయవాడ దుర్గగుడికి, వెలగా రమేష్‌కుమార్‌ను ద్వారకాతిరుమలకు బదిలీ చేశారు. ద్వారకా తిరుమలలో పని చేస్తున్న జి.భారతి దుర్గ, ఎంవీఎన్ రాధాకృష్ణ, ఎ.శ్రీనివాసరావు, పీవీ శ్రీనివాసరావును అన్నవరం దేవస్థానానికి, వి.కృష్ణవేణిని విజయవాడ దుర్గగుడికి బదిలీ చేశారు.
దుర్గగుడిలో పనిచేస్తున్న త్రినాథరావు, కె.సీతారామయ్య, ఎం.శ్రీనివాసరావు. నరసింహరాజు, పద్మావతి అన్నవరానికి బదిలీ అయ్యారు.
అన్నవరం దేవస్థానంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కేవీఎస్ చౌదరిని ద్వారకా తిరుమలకు, ఈవీఎస్ శ్రీనివాసరావును విజయవాడ దుర్గగుడికి బదిలీ చేశారు. ద్వారకా తిరుమల ఏఈ టీజీకే రాజును విజయవాడ దుర్గగుడికి, విజయవాడలో పనిచేస్తున్న రవీంద్రనాథ్ ఠాగూర్, టి.లక్ష్మణ్‌లను అన్నవరానికి బదిలీ చేశారు. సింహాచలం ఆలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న చలపతిరావును అన్నవరం దేవస్థానానికి, అక్కడ పనిచేస్తున్న భాస్కర్‌ను సింహాచలానికి డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు.
సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, పెనుగంచిప్రోలు, విజయవాడ దుర్గగుడి, విశాఖ కనకమహాలక్ష్మి దేవస్థానాల్లో పనిచేస్తున్న 38 మంది జూనియర్ అసిస్టెంట్లను కూడా బదిలీ చేశారు. జోన్-1, 2 పరిధిలోని ఐదు ఆలయాల్లో పనిచేస్తున్న 13 మంది సూపరింటెండెంట్లను, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు నలుగురిని కూడా బదిలీ చేస్తూ దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు.