Top Telugu Headlines Today: సంక్షేమమే ధ్యేయంగా పాలిస్తున్నామన్న జగన్! దీపావళి బోనస్‌గా వెయ్యి కోట్ల పంపిణీపై కేసీఆర్ ప్రకటన
Top 5 Telugu Headlines Today 15 August 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top 5 Telugu Headlines Today 15 August 2023:
సంక్షేమమే ధ్యేయంగా పాలన- విజయవాడ నుంచి సీఎం జగన్ పంద్రాగస్టు మెసేజ్
విజయవాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఈక్రమంలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సాగుతున్న ఈ వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకం ఆవిష్కరించిన తర్వాత సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన కొనసాగుతోంది. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పేదలు చదివే బడులను పాడుబడేలా చేయడం అంటరానితనం కిందకే వస్తుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు
దీపావళి బోనస్‌గా వెయ్యి కోట్ల పంపిణీ, పంద్రాగస్టు వేడుకల్లో కేసీఆర్
తెలంగాణలో 77వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా సాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్మమంత్రి కేసీఆర్.. గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాణి మహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండకు చేరుకున్న సీఎం కేసీఆర్... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, కళాకారులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు సీఎం కేసీఆర్.. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సైనిక వీరుల స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. పూర్తి వివరాలు
వాలంటీర్ల వ్యవహారంలో తగ్గేదేలే - విపక్షాలకు మైండ్ బ్లాంక్ అయ్యే స్కెచ్ వేస్తున్న వైసీపీ
వాలంటీర్ల వ్యవహరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ అలర్ట్‌గా వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ల పాత్ర కీలకం కానున్న వేళ పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడస్తోంది. వాలంటీర్ల వ్యవహరంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్దితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్త లేదని స్పష్టం చేస్తోంది. అధికారుల కన్నా ముందు వాలంటీర్లకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వంలోని పెద్దలు, పార్టీలోని పెద్దలతో సహా వాలంటీర్లపై శ్రద్ద పెడుతున్నారు. వారిపై వచ్చే విమర్శలకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టటంతోపాటు, వాటిని తిప్పికొట్టేందుకు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివరాలు
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పేరు ఇండియన్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఆమె చేపట్టిన పాదయాత్రకు గానూ ఈ రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. తెలంగాణలో 3800 కిలోమీటర్ల పాయాత్ర చేసిన మొదటి మహిళగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా ఆమెను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్స్ ప్రతినిధులు కలిసి అభినందనలు తెలుపుతూ అవార్డును అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఈ అవార్డు రావడం పట్ల షర్మిల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన తండ్రి కాలంలో తెలంగాణ ప్రాంతామంతా కూడా బంగారు తెలంగాణలా ఉండేదని ఆమె అన్నారు. పూర్తి వివరాలు
వచ్చే ఆగస్టు 15న మళ్లీ వస్తున్నా- కలలన్నీ నెరవేరుస్తా: మోదీ
ఎర్రకోటపై ప్రసంగం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మీ ముందుక వస్తానని అన్నారు. 2014లో మార్పు తీసుకొస్తానని హామీ ఇచ్చాను. దేశప్రజలంతా నన్ను నమ్మారు. నేను మీకు ఇచ్చిన మాటను నమ్మకంగా మార్చుకున్నాను. చేసిన మంచి పనులకు 2019లో మద్దతుగా నిలిచారు. మళ్లీ నన్ను ఆశీర్వదించారు. నాకు మరో అవకాశం ఇచ్చారు. నీ కలలన్నీ నెరవేరుస్తాను. మళ్లీ ఆగస్టు 15న వస్తాను. నీ కోసమే బతుకుతున్నాను. మీరు నా కుటుంబం అందుకే మీ కోసం చెమటలు చిందిస్తాను. పూర్తి వివరాలు