News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

కొత్త చరిత్ర సృష్టించిన షర్మిల- ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో చోటు!

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రెడ్డి పేరు ఇండియన్‌ బుక్‌ రికార్డ్స్‌ లో చోటు దక్కించుకుంది. ఆమె చేపట్టిన పాదయాత్రకు గానూ ఈ రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు.

FOLLOW US: 
Share:

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రెడ్డి పేరు ఇండియన్‌ బుక్‌ రికార్డ్స్‌ లో చోటు దక్కించుకుంది. ఆమె చేపట్టిన పాదయాత్రకు గానూ ఈ రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. తెలంగాణలో 3800 కిలోమీటర్ల పాయాత్ర చేసిన మొదటి మహిళగా ఆమె రికార్డు క్రియేట్‌ చేశారు. 
ఈ సందర్భంగా ఆమెను ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్స్‌ ప్రతినిధులు కలిసి అభినందనలు తెలుపుతూ అవార్డును అందజేశారు.

స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఈ అవార్డు రావడం పట్ల షర్మిల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన తండ్రి కాలంలో తెలంగాణ ప్రాంతామంతా కూడా బంగారు తెలంగాణలా ఉండేదని ఆమె అన్నారు. ఒకనాడు ఇండియాను తెల్లదొరలు పాలిస్తే..ఈనాడు తెలంగాణని ఓ నల్లదొర పాలిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ నల్లదొర చెర నుంచి విడిపించుకోవాలని ఆమె కోరారు. కేసీఆర్‌ పాలన పోయిన రోజునే తెలంగాణకు నిజమైన స్వతంత్రం అంటూ ఆమె పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఆమె జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె కేసీఆర్‌ మీద విరుచుకుపడ్డారు.

తెలంగాణలో అధికారంలోకి రాగానే గ్రూప్‌ 1 ఉద్యోగాలు అన్నాడు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు.. ఏ తెలంగాణ వారు ఎవరూ కూడా గ్రూప్‌ 1 ఉద్యోగాలకి అర్హులు కారా అంటూ ఆమె నిలదీశారు. కేసీఆర్‌ దీనికి సమాధానం చెప్పాలని ఆమె అన్నారు. బీసీ బంధు అంటూ..దళిత బంధు అంటూ కోతలు కోశాడు..అవన్నీ ఎక్కడ పెట్టాడు.ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం చేతనైందా అంటూ కేసీఆర్‌ మీద విరుచుకుపడ్డారు. 

2021 అక్టోబర్‌ లో వైఎస్‌ షర్మిల తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టిన చేవెళ్ల నియోజకవర్గం నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. ఆమె సుమారు ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేశారు. ఆమె పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

పాదయాత్ర సమయంలో కూడా ఆమె తెలంగాణ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. ఒకానొక సమయంలో ఆమెను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. దాంతో కొన్ని రోజులు ఆమె పాదయాత్రకు బ్రేక్‌ పడింది. 

ఆ సమయంలో ఆమె కోర్టుకు వెళ్లి పాదయాత్ర చేయడానికి అనుమతి తెచ్చుకున్నారు.  తెలంగాణలో  సుదీర్ఘంగా 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరారు.

Published at : 15 Aug 2023 01:35 PM (IST) Tags: YS Sharmila Indian Book Of Records Telangana YSRTP

ఇవి కూడా చూడండి

Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం

Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం

అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ- స్పీకర్‌ తీర్పుపై తీవ్ర విమర్శలు

అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ- స్పీకర్‌ తీర్పుపై తీవ్ర విమర్శలు

Rahul Gandhi: భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: రాహుల్‌ గాంధీ

Rahul Gandhi: భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: రాహుల్‌ గాంధీ

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

Vasundhara Raje: బీజేపీ పరివర్తన యాత్రకు వసుంధర రాజే డుమ్మా ! అధిష్టానం తీరుపై అలక

Vasundhara Raje: బీజేపీ పరివర్తన యాత్రకు వసుంధర రాజే డుమ్మా ! అధిష్టానం తీరుపై అలక

టాప్ స్టోరీస్

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు