AP CM Jagan: సంక్షేమమే ధ్యేయంగా పాలన- విజయవాడ నుంచి సీఎం జగన్ పంద్రాగస్టు మెసేజ్
AP CM Jagan: విజయవాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
![AP CM Jagan: సంక్షేమమే ధ్యేయంగా పాలన- విజయవాడ నుంచి సీఎం జగన్ పంద్రాగస్టు మెసేజ్ Independence Day 2023 AP CM Jagan Hoisting National Flag in Vijayawada AP CM Jagan: సంక్షేమమే ధ్యేయంగా పాలన- విజయవాడ నుంచి సీఎం జగన్ పంద్రాగస్టు మెసేజ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/ce893a29daa3d49352449553800af17a1692083986098215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP CM Jagan: విజయవాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఈక్రమంలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సాగుతున్న ఈ వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకం ఆవిష్కరించిన తర్వాత సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన కొనసాగుతోంది. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పేదలు చదివే బడులను పాడుబడేలా చేయడం అంటరానితనం కిందకే వస్తుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. సమాన్య, మధ్య తరగతి ప్రజలు ఇంగ్లీషులో చదువుకోవద్దని గొడవ చేయడం, పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయడం కూడా అంటరానితనం కిందకే వస్తుందని అన్నారు. మెనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను నెరవేర్చామని చెప్పారు.
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం @ysjagan. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. 🇮🇳✨#IndependenceDay2023#IndependenceDay #IndependenceDayIndia#AndhraPradesh#CMYSJagan pic.twitter.com/9cpF9295P5
— YSR Congress Party (@YSRCParty) August 15, 2023
విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నాని, నాడు - నేడుతో 45 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానం అమలు చేశామని చెప్పుకొచ్చారు. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్ లు అందజేస్తున్నామన్నారు. భోజనం, వసతి ఖర్చుల కోసం రూ.20 వేల వరకు వసతి దీవెన.. రోజుకో మెనూతో పౌష్టికాహారం అందజేస్తున్నామని వెల్లడించారు. డిగ్రీ స్థాయిలో వంద శాతం ఫీజు రీయంబర్స్ మెంట్, ట్రిపుల్ ఐటీల్లో పెండింగ్ లో ఉన్న 3295 టీచింగ్ పోస్టుల భర్తీ చేసామన్నారు. వైద్య శాఖలో ఏకంగా 53 వేల 126 పోస్టులు, రాష్ట్రం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 108, 104 సేవల కోసం కొత్తగా 1514 వాహనాలు కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ప్రభుత్వం మనది. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పథకాలు కావాలంటే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితిని మార్చి.. అన్ని సేవలు ఇంటి వద్దకే అందిస్తున్నాం. ఎలాంటి… pic.twitter.com/YHB5UPkBpf
— YSR Congress Party (@YSRCParty) August 15, 2023
పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడం, పేదల సహనాన్ని పరీక్షించుకోవడం కూడా అంటరానితనమే అవుతుందన్నారు. పేదలు గెలిచే వరకూ వారి బతుకులు బాగుపడే వరకు యుద్ధం చేస్తామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పాలనలో ఏ సర్కారు చేయని మార్పులు చేశామన్నారు. 98.5 శాతం వాగ్దానాలు అమలు చేశామని చెప్పారు. పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా చేశామన్నారు. మూతపడిన చిత్తూరు డైరీకి జీవం పోశామన్నారు. భూవివాదాలకు పరిష్కారం కోసం సమగ్ర సర్వే చేపట్టగామని, వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారమని వెల్లడించారు.
గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామన్నారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదన్నారు. అన్ని సేవలు ఇంటి వద్దకే అందిస్తున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని మార్పులు తెచ్చామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లమ్మల పేరు మీదే ఇస్తున్నామని అన్నారు. 2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించామని వెల్లడించారు. ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు.. స్వాతంత్ర సమరయోధుల బలిదానాన్ని గుర్తు చేస్తూ.. మన జాతీయ జెండా ఎగురుతోందన్నారు. 76 ఏళ్ల ప్రయాణంలో దేశం ఎంతో పురోగమించిందని చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో ఎంతో ప్రగతి సాధించిందన్నారు. సాయంత్రం రాజ్ భవన్ ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.
Read Also: వచ్చే ఆగస్టు 15న మళ్లీ వస్తున్నా- కలలన్నీ నెరవేరుస్తా: మోదీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)