News
News
వీడియోలు ఆటలు
X

Top 5 Headlines Today: జనసేన పార్టీకి ఈసీ షాక్ ! కేసీఆర్ తీసుకోబోయే కీలక నిర్ణయాలేంటి - నేటి టాప్ హెడ్ లైన్స్

Top 5 Headlines Today 17th May 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

FOLLOW US: 
Share:

గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్ కేటగిరీలో చేర్చిన ఈసీ- జనసేన నుంచి జారిపోయినట్టేనా!
భారత ఎన్నికల సంఘం జనసేన పార్టీకీ గట్టి షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. రాజకీయాల్లో గుర్తింపు రావాలంటే ఎన్నికల్లో గెలవాలి. ఒకవేళ ఓడిపోయినా ప్రజల్లో తగినంత మద్దతను ఓట్ల రూపంలో కూడగట్టుకోవాలి. అప్పుడే ఆ పార్టీకీ ప్రాంతీయ లేదా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. సినీ నటుడు పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పోటీ చేసినా సీట్లు రాలేదు. గెలిచిన ఒక వ్యక్తి కూడా వైఎస్‌ఆర్‌సీపీకి మద్దుతు తెలిపారు. అయితే తగినన్ని ఓట్లతోపాటు సీట్లు కూడా దక్కించుకోలేక పోయిందా పార్టీ. దీంతో ఆ పార్టీ సింబల్ ను ఎన్నికల సంఘం ఫ్రీ సింబర్ కేటగిరీలో చేర్చింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

అఖిలప్రియ, సుబ్బారెడ్డి వివాదంపై చంద్రబాబు సీరియస్‌ - త్రిసభ్య కమిటీ ఏర్పాటు
నంద్యాలలో అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య వార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో మాట్లాడిన ఆయన వివాదం పరిష్కారానికి సీనియర్లతో కమిటీ వేసినట్టు సమాచారం. లోకేష్ యువగళం పాదయాత్ర సాగుతున్న నంద్యాలలో టీడీపీ అంతర్గత పోరుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. లోకేష్‌కు స్వాగతం చెప్పే టైంలో సుబ్బారెడ్డి, అఖిల ప్రియ వర్గీయుల రోడ్లపై కొట్టుకోవడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వివాదం పరిష్కారానికి తిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు.  మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

వరుసగా ఎల్పీ మీటింగ్ - కేబినెట్ భేటీ ! కేసీఆర్ తీసుకోబోయే సంచలన నిర్ణయాలేంటి ?
తెలంగాణ ముఖ్యమంత్రి , భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలను అంచనా వేయడం అంత తేలిక కాదు. రిజల్ట్ వచ్చే దాకా ఓహో ఆయన ఈ ప్లాన్ వేశారా అని ప్రత్యర్థులు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ భేటీలను బుధవారం నిర్వహిస్తున్నారు. గురువారం కేబినెట్ భేటీ ఏర్పాటు  చేశారు. దీంతో  కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అవేంటి అన్నది మాత్రం స్పష్టత లేదు.  వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్‌ విజయం సాధిచాలని లక్ష్యంగా పెట్టుకున్న  కేసీఆర్ ఆ దిశగా పార్టీ యంత్రాంగాన్ని ముందుకు నడిపించేందుకు   కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే అత్యవసరంగా బుధవారం   బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ, లెజిస్లేచర్‌ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2గంటలకు జరుగనున్న ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులంతా విధిగా పాల్గొనాలని ఆదేశాలిచ్చా రు.  మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు జరగబోతోందా ? ఢిల్లీలో ఈటల టూర్ అజెండా అదేనా ?
కర్ణాటక ఎన్నికల ఫలితాల తరవాత తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి కీలక నేతలతో సమావేశం అయ్యారు. అయితే ఈ విషయం చివరి వరకూ వెలుగులోకి రాలేదు. వెలుగులోకి వచ్చిన తర్వాత బీజేపీలో అంతర్గత రాజకీయం క్లైమాక్స్‌కు వచ్చిందన్న ప్రచారం ఆరంభమయింది. బండి సంజయ్‌ను కూడా హైకమాండ్ ఢిల్లీ పిలిపించిందన్న ప్రచారం ప్రారంభమయింది. అయితే బండి సంజయ్ మాత్రం తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తి వేయాలని ఇప్పటికే కేంద్రనాయకత్వాన్ని కోరామన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి 

26న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ - ఎజెండా ఏమిటంటే ?
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు.   ఈ ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్‌ కీలక సమావేశానికి సీఎం జగన్‌ హాజరు కానున్నారు. సీఎం జగన్‌ నీతి ఆయోగ్‌ సమావేశం అనంతరం ప్రధాని మోడీ, హోం శాఖా మంత్రి అమిత్‌ షాలతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరుతూ సీఎంవో వర్గాలు పీఎంవోకు సమాచారం అందిచినట్లు ;తెలుస్తోంది. అదే క్రమంలో అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌కు కూడా సీఎంవో వర్గాలు ఆయన పేషీకి సమాచారం అందించారు.  ఈనెల 27వ తేదీన నీతి ఆయోగ్‌ బృందం ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో సమావేశం కానుంది.    మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

Published at : 17 May 2023 03:03 PM (IST) Tags: BJP YSRCP AP Latest news BRS TDP Telangana LAtest News

సంబంధిత కథనాలు

Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!

Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!

AP Weather: మరింత లేట్‌గా నైరుతి రుతుపవనాలు, ఆ ఎఫెక్ట్‌తో తీవ్రవడగాల్పులు - ఈ మండలాల్లోనే

AP Weather: మరింత లేట్‌గా నైరుతి రుతుపవనాలు, ఆ ఎఫెక్ట్‌తో తీవ్రవడగాల్పులు - ఈ మండలాల్లోనే

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ