Telangana BJP : తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు జరగబోతోందా ? ఢిల్లీలో ఈటల టూర్ అజెండా అదేనా ?
తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు ఉంటుందా ? సీనియర్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా ?
Telangana BJP : కర్ణాటక ఎన్నికల ఫలితాల తరవాత తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి కీలక నేతలతో సమావేశం అయ్యారు. అయితే ఈ విషయం చివరి వరకూ వెలుగులోకి రాలేదు. వెలుగులోకి వచ్చిన తర్వాత బీజేపీలో అంతర్గత రాజకీయం క్లైమాక్స్‌కు వచ్చిందన్న ప్రచారం ఆరంభమయింది. బండి సంజయ్‌ను కూడా హైకమాండ్ ఢిల్లీ పిలిపించిందన్న ప్రచారం ప్రారంభమయింది. అయితే బండి సంజయ్ మాత్రం తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తి వేయాలని ఇప్పటికే కేంద్రనాయకత్వాన్ని కోరామన్నారు.
వరుసగా ఎల్పీ మీటింగ్ - కేబినెట్ భేటీ ! కేసీఆర్ తీసుకోబోయే సంచల నిర్ణయాలేంటి ?
బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండటంపై ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన కొంత మంతి కీలక నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగాసాగుతోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాల్సిందేనని నేతలు పట్టుబడుతున్నారని గతంలోనూ ప్రచారం జరిగింది. హస్తినకు వెళ్లిన ఈటెల రాజేందర్ ఇదే విషయంపై చర్చించారన ిచెబుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక తరవాత నుండే నేతలు అసంతృప్తితో ఉన్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక తరవాత పార్టీలో ఎవ్వరూ చేరకపోవడానికి కారణం కూడా అదేనని చెబుతున్నారు.
పార్టీలో చేరినప్పుడు యాక్టివ్ గా కనిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. పార్టీకి, బండి సంజయ్ కి అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈటల రాజేందర్, వివేక్ కూడా బండి సంజయ్ పై తీవ్ర అసహనంతో ఉన్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ సస్సెండ్ చేసిన పొంగులేటితో కూడా బీజేపీ చేరికల కమిటీ నేతలు చర్చలు జరిపారు. అప్పట్లో బండి సంజయ్.. ఇలా పొంగులేటితో చర్చలకు వెళ్తున్నట్లుగా తనకు తెలియదని ప్రకటించడం ఆ పార్టీలో విబేధాల్ని బయట పెట్టినట్లయింది కర్ణాటక ఎన్నికల తర్వాత పరిస్థితిని మరింత లోతుగా అధ్యయనం చేస్తున్న బీజేపీ హైకమాండ్.. తెలంగాణ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నరు.
ఈనెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ, కొత్త సెక్రటేరియట్‌లో తొలిసారిగా
ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో బండి సంజయ్‌కు మినహా ఇతర నేతలకు ఎక్కడా ప్రాధాన్యం లభించడం లేదని.. సీనియర్లు మండిపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే తమను పక్కన పెడుతున్నారని కొంత మంది ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చే సీనియర్ నేతలను చేర్చుకోవాలంటే వారికి కొంత భరోసా ఇవ్వాల్సి ఉంటుందని.. అందు కోసం కొన్ని చర్యలు తీసుకోవాలని ఈటల వంటి వాళ్లు ప్రతిపాదిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనిపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.