News
News
వీడియోలు ఆటలు
X

Telangana Cabinet: ఈనెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ, కొత్త సెక్రటేరియట్‌లో తొలిసారిగా

18న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభం కానుంది. మంత్రుల‌తో పాటు ప‌లువురు ఉన్నతాధికారులు ఈ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు.

FOLLOW US: 
Share:

Telangana Cabinet Meeting in New Secretariat: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet Meet) స‌మావేశం జ‌ర‌గ‌నుంది. కొత్తగా నిర్మించిన తెలంగాణ స‌చివాల‌యంలో తొలిసారి కేబినెట్ సమావేశం జరగనుంది. 18న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభం కానుంది. మంత్రుల‌తో పాటు ప‌లువురు ఉన్నతాధికారులు ఈ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు. ఈ కేబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల (Telangana Formation Day Celebrations) నిర్వహణపై మంత్రివర్గ (TS Cabinet Meet) సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కేబినెట్‌లో (TS Cabinet) చర్చించి మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త సచివాలయం ఎదుట ప్రారంభానికి రెడీ అయిన వినూత్న రీతిలో నిర్మించిన తెలంగాణ అమర వీరుల స్మారకం ప్రారంభ తేదీని కూడా మంత్రి వర్గ సమావేశంలో ఖరారుచేసే అవకాశం ఉంది. 

పోడు పట్టాల పంపిణీ తేదీలు, గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ప్రకటించి అమలు కార్యచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయం కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. గవర్నర్‌ నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్‌ పదవీకాలం ఈనెల 27తో ముగియనుంది. ఆ రెండు స్థానాలకు ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్‌ ఆమోదించి గవర్నర్‌ తమిళిసైకు సిఫారసు చేసే అవకాశం ఉంది.

Also Read: Southwest Monsoon: ఈసారి రుతుపవనాలు కాస్త ఆలస్యమే, భారత్‌లోకి ఎప్పుడొస్తాయో చెప్పిన ఐఎండీ

రేపు (మే 17) బీఆర్ఎస్ ఎల్పీ (BRSLP Meeting) సమావేశం

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో బుధవారం (మే 17) మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష (BRSLP Meeting) సమావేశం జరగనుంది. బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ సభ్యులు పాల్గొనే ఈ సమావేశంలో జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై తెలంగాణ ఆవిర్భావానికి ముందు.. తర్వాత రాష్ట్రం సాధించిన ప్రగతిని ఆవిష్కరిస్తారని సమాచారం.

ఈ ఉత్సవాల నిర్వహణలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులుగా పోషించాల్సిన పాత్రపై రేపు జరిగే సమావేశంలో దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. దశాబ్ది ఉత్సవాల నిర్వహణతో పాటు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లను ఆహ్వానించినట్లుగా పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశించారు.

Also Read: E Garuda Buses: టీఎస్ఆర్టీసీ ఈ-గరుడ బస్సులు ప్రారంభం, HYD-VJA మధ్య 20 నిమిషాలకో బస్ నడిచేలా ప్లాన్

Published at : 16 May 2023 08:10 PM (IST) Tags: Telangana Cabinet TS Cabinet Meeting KCR New Secretariat

సంబంధిత కథనాలు

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

టాప్ స్టోరీస్

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

Andhra Politics :  వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం