By: ABP Desam | Updated at : 16 May 2023 09:20 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
మన దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకను వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈసారి రుతుపవనాల రాక కొద్ది రోజులు ఆలస్యం అవుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ 4వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికే కేరళలోకి వస్తుంటాయి. అయితే, ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా జూన్ 4న ప్రవేశించే అవకాశం ఉందని మంగళవారం (మే 16) ఓ ప్రకటనలో వెల్లడించింది. పోయిన సంవత్సరం మే 29 నాటికే అవి కేరళ రాష్ట్రాన్ని తాకాయి. 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న ప్రవేశించాయి. వీటితో పోల్చితే ఈ ఏడాది కాస్త ఆలస్యమే అని అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది ఎల్ నినో (El Nino) ప్రభావం ఉంటుందని, వాతావరణ నిపుణులు సహా ప్రైవేటు వాతావరణ సంస్థలు చాలా నెలల క్రితమే అంచనా వేసిన సంగతి తెలిసిందే. మన దేశంలో ఈసారి వర్షపాతం సాధారణంగానే ఉంటుందని, భారత వాతావరణ విభాగం గత నెలలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, భారత్‌లో వర్షపాతం ప్రధానంగా రుతుపవనాల వల్ల వస్తుంటుంది. దేశ వ్యవసాయ రంగానికి ఈ వర్షాలే ప్రధానమైన ఆధారం. సాగు విస్తీర్ణంలో 52 శాతం రుతుపవనాల వల్ల వచ్చే వర్షంపైనే ఆధారపడి ఉంటుంది. ఇది దేశ మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం వాటా. తద్వారా దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వానికి రుతుపవనాలు అనేవి మన దేశానికి కీలకంగా ఉన్నాయి.
నిప్పుల కొలిమిలా ఏపీ
ఏపీ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. మంగళవారం (మే 16) తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో 46.7 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 46.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. పలు జిల్లాల్లో మొత్తంగా 13 మండలాల్లో 46 డిగ్రీలకు, 39 మండలాల్లో 45 డిగ్రీలకు పైగా, 255 మండలాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు.
రేపు (మే 17) 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు చెప్పారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. మంగళవారం 40 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచాయని వివరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు విపత్తుల సంస్థ నుంచి హెచ్చరిక సందేశాలు పంపుతున్నామని అవి అందినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (20) :- అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ 1, ఎన్టీఆర్ 3, పల్నాడు 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోవు మూడు రోజులు కింద విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించారు
☀ మే 17 బుధవారం
ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీలు - 45 డిగ్రీలల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీలు - 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 36 డిగ్రీలు - 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
☀ మే 18 గురువారం
• విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీలు - 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీలు - 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీలు - 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
☀ మే 19 శుక్రవారం
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీలు - 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, SPSR నెల్లూరు కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలు - 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• కోనసీమ, పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు - 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
Also Read: Tirupati News : తిరుపతి గంగమ్మ గుడి అలంకరణలో గన్ - లోకేష్ ట్వీట్ వైరల్ !
Couple Died With Heart Attack: గుండెపోటుతో నవదంపతుల మృతి, శోభనం గదిలో విగతజీవులుగా మారిన కొత్త జంట
Bihar Bridge Collapse: బిహార్‌లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి, ఇది మొదటిసారి కాదు
Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!
CBI Probe Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు, వెల్లడించిన రైల్వే మంత్రి
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్