Tirupati News : తిరుపతి గంగమ్మ గుడి అలంకరణలో గన్ - లోకేష్ ట్వీట్ వైరల్ !
గంగమ్మ గుడి అలంకరణలో గన్ బొమ్మ ఉండటం కలకలం రేపింది.
Tirupati News : తిరుపతి గంగమ్మ జాతర కు లక్షల మంది భక్తులు వస్తారు. అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తారు. అయితే గుడికి ఇలా చేసిన ఏర్పాట్లలో గన్ బొమ్మ ఉండటం కలకలం రేపింది. గుడి బయట పూలతో చేసిన డెకరేషన్లలో రెండు వైపులా వైసీపీ జెండాలు, మధ్యలో ఇంగ్లిష్ J అక్షరం తర్వతా గన్ గుర్తు ఉన్నాయి. ఆలయానికి ఈ అలంకరణ ఏమిటన్న విమర్శలు వచ్చాయి. నారా లోకేష్ కూడా అలంకరణ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి వైసీపీ నేతల తీరును తప్పు పట్టారు.
దైవసన్నిధిలోనూ జగన్ గ్యాంగులు తమ నేరబుద్ధిని చూపించుకుంటున్నాయి. తిరుపతి గంగమ్మ గుడి ఆవరణలో జగన్ పేరు వచ్చేలా జె అక్షరం, గన్ బొమ్మలొచ్చేలా పూలతో అలంకరించడం చూస్తే, ఎంతగా బరి తెగించారో తేటతెల్లమవుతోంది.(1/2)#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/PVpFm5c0e9
— Lokesh Nara (@naralokesh) May 16, 2023
అయితే కాసేపటికే ఆ అలంకరణను గంగమ్మ గుడి అధికారులు తొలగించినట్లుగా తెలుస్తోంది. అయితే నారా లోకేష్ ట్వీట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది.
కన్నుల పండవుగా కొనసాగుతోంది. మొత్తం 8 రోజుల పాటు నిర్వహించే జాతరలో మాతంగి రూపంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర ఎంతో సుప్రసిద్ధమైంది.ఈ జాతరకు తిరుపతి నుంచే కాకుండా రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏడాది మే నెలలో గంగమ్మ తల్లి జాతర జరుగుతుంది.
జగన్ పాదయాత్రలో సెలవులు, కానీ విరామం లేకుండా లోకేష్ యువగళం: బుద్ధా వెంకన్న
మొత్తం 8 రోజుల పాటు జాతరను భక్తులు జరుపుకొంటారు. మే నెల మొదటి మంగళవారంలో జాతర ప్రారంభమై...రెండవ మంగళవారంతో జాతర ముగుస్తుంది. మొదటి మంగళవారం అర్థరాత్రి దాటాకా...కైకా వంశీయుల ఆధ్వర్యంలో చాటింపు కార్యక్రమంతో జాతర మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో గంగమ్మ జాతరను అక్కడి ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించింది. తిరుపతి పట్టణంలో ఏడుగురు గ్రామదేవతలు ఉన్నారు. అంకాళమ్మ, మాతమ్మ, ఉప్పంగి మారెమ్మ, తాళ్ళపాక పెద గంగమ్మ, ముత్యాలమ్మ, వేషాలమ్మ, తాతగట్టు గంగమ్మ అమ్మవార్లు కొలువు తీరారు. అయితే భక్తులు గంగమ్మ జాతరనే వైభవంగా నిర్వహిస్తారు. జాతరలో భాగంగా అమ్మవారికి కైంకర్యాలు, జాతర ఉత్సవాలు ప్రతీ ఏడాది వైభవంగా నిర్వహిస్తారు.
దరఖాస్తు చేసిన ప్రతి రైతుకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు - మంత్రి పెద్దిరెడ్డి
ఇక తాతగట్టు గంగమ్మ అమ్మవారిని శ్రీ వేంకటేశ్వరుని చెల్లెగా భావిస్తారు. గంగమ్మ జాతరలో భాగంగా ప్రతీ ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం వారు అమ్మవారికి పట్టు చీర సమర్పిస్తారు. ఈ జాతరకు ఏపీ నుంచే కాకుడా తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. గంగమ్మ తల్లికి భక్తులు పసుపు, కుంకుమ, చీరెలు, పొంగళ్ళు సమర్పించి కోరికలు కోరుకుంటారు. ఎప్పుడూ ఈ వేడుకలపై రాజకీయ వివాదం రాలేదు కానీ.. ఈ సారి పూల అలంకరణలో కొంత మంది అత్యుత్సాహంతో వివాదం ఏర్పడింది.