By: ABP Desam | Updated at : 17 May 2023 01:13 PM (IST)
వరుసగా ఎల్పీ మీటింగ్ - కేబినెట్ భేటీ ! కేసీఆర్ తీసుకోబోయే సంచలన నిర్ణయాలేంటి ?
Telangana Politics : తెలంగాణ ముఖ్యమంత్రి , భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలను అంచనా వేయడం అంత తేలిక కాదు. రిజల్ట్ వచ్చే దాకా ఓహో ఆయన ఈ ప్లాన్ వేశారా అని ప్రత్యర్థులు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ భేటీలను బుధవారం నిర్వహిస్తున్నారు. గురువారం కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. దీంతో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అవేంటి అన్నది మాత్రం స్పష్టత లేదు.
ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు ఇచ్చే చాన్స్
వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ విజయం సాధిచాలని లక్ష్యంగా పెట్టుకున్న కేీసఆర్ ఆ దిశగా పార్టీ యంత్రాంగాన్ని ముందుకు నడిపించేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే అత్యవసరంగా బుధవారం బీఆర్‌ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేచర్ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2గంటలకు జరుగనున్న ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులంతా విధిగా పాల్గొనాలని ఆదేశాలిచ్చా రు. పార్టీ సంస్థాగత అభివృద్ధి, గెలుపు కోసం అనుసరిం చాల్సిన వ్యూహాలపై అందరి అభిప్రాయాలు తెలుసు కుని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉండడంతో నియోజక వర్గాల్లో పెండింగ్‌లో ఉన్నఅభివృద్ధి పనులు, గత ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలపై వ్యూహరచన చేయనున్నారు. ప్రత్యేక నిధులు కేటాయించి చేపట్టాల్సిన కార్యక్రమాలను గురించి ఎమ్మెల్యేలకు అధినేత కేసీఆర్ ఈ సందర్భంగా మార్గనిర్ధేశం చేస్తారని చెబుతున్నారు.
ఇప్పటికే అనేక సార్లు సర్వేలు నిర్వహించిన కేసీఆర్ !
బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్నది ఎమ్మెల్యేల్లో ఉత్కంఠకు దారి తీస్తోంది. మొన్నటిదాకా ఇలా ప్రజాప్రతినిధులు లేదా కార్యవర్గ సమావేశం ఏర్పాటు- చేస్తే ముందస్తు ఎన్నికల గురించి ఏమైనా చెబుతారేమో అనుకునేవారు. అయితే ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది. వచ్చే ఆరు నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం ఏమైనా ఉంటే స్పష్టంగా చెప్పాలని ఎమ్మెల్యేలకు సీఎం అడుగనున్నారు. అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ఈ సారి నిక్కచ్చిగా ఉంటారని చెబుతున్నారు. సర్ేల్లో వ్యతిరేకత ఉన్న వారిని పూర్తి స్థాయిలో పక్కన పెట్టాలనుకుంటున్నారు. ఈ దిశగా కొంత మందికి సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు.
కొత్త స్కీములు.. ప్రత్యేక కార్యాచరణ !
గురువారం కేబినెట్ భేటీ కూడా నిర్వహించనున్నారు. బుధవారం నిర్వహించే ఎల్పీ సమావేశాల్లో బీసీ బంధు వంటి పథకాల గురించి వివరించే అవకాశం ఉందంటున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ఇలాంటి పథకాలను వెంటనే అమలు చేయాల్సి ఉంటుంది. కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుని ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ ఉండాలని ్నుకుంటున్నారు. వచ్చే ఆరు నెలల పాటు- ప్రజల్లో ఉండేలా ప్రత్యేకమైన కార్యక్రమాలకు కేసీఆర్ రూపకల్పన చేశారని.. వాటిని ఇంప్లిమెంట్ చేసేలా.. అందరికీ సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇస్తారని భావిస్తున్నారు.
Rajahmundry MP Bharat: చంద్రబాబు ఒక ఆల్ ఫ్రీ బాబా, దసరా మేనిఫెస్టో అక్కడినుంచే కాపీ కొడతారు- ఎంపీ భరత్ జోష్యం
Pankaja Munde: నేను బీజేపీలో ఉన్నాను, కానీ ఇది నా పార్టీ కాదు: మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజా ముండే
TDP Manifesto : టీడీపీ మేనిఫెస్టోకు వైఎస్ఆర్‌సీపీనే ఎక్కువ ప్రచారం కల్పిస్తోందా ? అధికార పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేస్తోందా ?
Delhi Liquor ScaM : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్ల టార్గెట్ ఎవరు ? కేజ్రీవాలా ? కవితనా ?
కాపీ చంద్రబాబు బిసిబేళ బాత్, పులిహోరా మేనిఫెస్టో వండారు, పత్తికొండలో సీఎం జగన్ ఆగ్రహం
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా