Janasena Party Symbol: గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్ కేటగిరీలో చేర్చిన ఈసీ- జనసేన నుంచి జారిపోయినట్టేనా!`
Jana Sena Party Symbol: జనసేన పార్టీకీ భారత ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. జనసేన గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చినట్లు తెలిపింది.
Jana Sena Party Symbol: భారత ఎన్నికల సంఘం జనసేన పార్టీకీ గట్టి షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. రాజకీయాల్లో గుర్తింపు రావాలంటే ఎన్నికల్లో గెలవాలి. ఒకవేళ ఓడిపోయినా ప్రజల్లో తగినంత మద్దతను ఓట్ల రూపంలో కూడగట్టుకోవాలి. అప్పుడే ఆ పార్టీకీ ప్రాంతీయ లేదా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. సినీ నటుడు పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పోటీ చేసినా సీట్లు రాలేదు. గెలిచిన ఒక వ్యక్తి కూడా వైఎస్‌ఆర్‌సీపీకి మద్దుతు తెలిపారు. అయితే తగినన్ని ఓట్లతోపాటు సీట్లు కూడా దక్కించుకోలేక పోయిందా పార్టీ. దీంతో ఆ పార్టీ సింబల్ ను ఎన్నికల సంఘం ఫ్రీ సింబర్ కేటగిరీలో చేర్చింది.
పార్టీకి గుర్తింపు రావాలంటే..!
ఏదైనా రాజకీయ పార్టీకి ప్రాంతీయ లేగా జాతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది. అవేంటంటే.. ప్రాంతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆరు శాతం, రెండు స్థానాలను దక్కించుకోవాలి. కానీ గత ఎన్నికల్లో జనసే పార్టీ వీటిని సాధించలేకపోయింది. ఓట్లు శాతం ఆరుగా ఉన్నప్పటికీ... కేవలం ఒకే ఒక్క సీటును కైవసం చేసుకుంది. మరో స్థానాన్ని కూడా జనసేన గెలుచుకొని ఉంటే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందేది. 25 లోక్ సభ స్థానాల్లో ఒక్క ఎంపీ సీటును గెలుచుకున్నా ప్రాంతీయ పార్టీ హోదా దక్కేది. కానీ మరో స్థానం గెలుచుకోలేకపోయినందున జనసేన పార్టీ గుర్తును.. ప్రీ సింబల్ జాబితాలోకి చేర్చారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అధికార పార్టీని గద్దె దింపడానికి విస్తృతంగా శ్రమిస్తున్న పవన్ కల్యాణ్ ఆశలపై ఈసీ నీళ్లు చల్లినట్లు అయింది. ఈసారి ఎలాగైనా మంచి సీట్లు సాధించాలన్న ప్లాన్‌తో రాజకీయం చేస్తున్న ఆయనకు ఎన్నికల సంఘం మాత్రం ఝలక్ ఇచ్చింది. జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీగా గుర్తించకుండా గాజు గ్లాస్ గుర్తును ఫ్రీసింబల్ జాబితాలో చేర్చేసింది. దేశంలో ఉన్న 197కుపైగా ఉన్న చిన్న పార్టీల వాటిలో దీన్ని కలిపేసింది.
ఒక్క జనసేన మాత్రమే కాదు దేశంలోని చాలా పార్టీలకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఏపీలో ప్రస్తుతం గుర్తింపు పొందిన పార్టీలు రెండుగానే చూపిస్తోంది. ఒకటి టీడీపీ, రెండోది వైఎస్‌ఆర్‌సీపీ. బీఆర్‌ఎస్, ఎంఐఎంతోపాటు టీడీపీ, వైసీపీని కూడా తెలంగాణ పార్టీల లిస్ట్‌లో చేర్చింది. ఈ పార్టీలకు మాత్రమే గతంలో కేటాయించిన గుర్తులను రిజర్వ్ చేయనున్నట్టు పేర్కొంది.