Top Headlines: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ, దివ్వెల మాధురిపై కేసు - తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్‌కు మరిన్ని చిక్కులు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ జరిగిన టాప్ హెడ్ లైన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
![Top Headlines: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ, దివ్వెల మాధురిపై కేసు - తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్‌కు మరిన్ని చిక్కులు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM today top news of 3 pm in ap and telangana latest telugu news Top Headlines: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ, దివ్వెల మాధురిపై కేసు - తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్‌కు మరిన్ని చిక్కులు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/11/bf0cdf0c4b9e2654f2c1b7cfb8f55e361728635754866876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Today Top Headlines In AP And Telangana:
1. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ, దివ్వెల మాధురిపై కేసు
తిరుమలలో రీల్స్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు అయింది. ఈ మధ్య తిరుమల వెళ్లిన దివ్వల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ తిరుమలలో హడావిడి చేశారు. ఈ నెల 7న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడే మాఢవీధుల్లో తిరుగుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. రీల్స్ కూడా చేశారు. ఈ వీడియోలు అప్పుడే చాలా వైరల్‌గా మారాయి. ఇంకా చదవండి.
2. క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ మారిపోతున్న నేతలు ఉన్న నియోజవవర్గాల నుంచి క్యాడర్ ను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అలాగే జిల్లాలకు పార్టీ అధ్యక్షుల్ని కూడా నియమిస్తున్నారు. వీలైనంత వరకూ సీనియర్ నేతల్ని నియమిస్తున్నారు. అందర్నీ యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జనవరిలో నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ లోపు పార్టీ కార్యకర్తలకు, క్యాడర్ కు నమ్మకం కలిగించేందుకు గుడ్ బుక్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఇంకా చదవండి.
3. రతన్ టాటాకు నచ్చిన 'కడియం' కుర్రాడు
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాను (Ratan Tata) స్వయంగా చూసిన వారే అరుదు. ఇక ఆయనతో కలిసి ఫోటో తీయించుకోవడం అంటే పెద్ద అదృష్టంగా భావిస్తుంటారు. అలాంటి ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం తూర్పుగోదావరి జిల్లా కడియంకు (Kadiyam) చెందిన ఓ పాతికేళ్ల కుర్రాడిని ఇష్టపడ్డారు. రతన్ టాటాకు ఉన్న ఎన్నో విభిన్నమైన అభిరుచులకు దగ్గరగా ఉండడమే ఈ కుర్రాడి ప్రత్యేకత. ఆ విభిన్న శైలితోనే ఆయనకు ఇష్టుడయ్యాడు. ఏడేళ్లుగా వారిరువురూ ఈ మెయిల్ మెసేజ్‌ల ద్వారా పరిచయాలు పెంచుకున్నారు. ఇంకా చదవండి.
4. తెలంగాణ మాజీ సీఎస్‌కు చిక్కులు
తెలంగాణలో వెలుగు చూసిన ఐజీఎస్టీ స్కాంలో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా వాణ్యిజ్య పన్నుల అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ శివరామ్ ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీస్, ఏ 5గా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు నమోదు చేశారు. ఇందులో అక్రమ నగదు చెలామణి జరిగినట్లుగా తేల్చడంతో ఈడీ కేసు పెట్టింది. ఇంకా చదవండి.
5. మూసీ సుందరీకరణకు సీఎం రేవంత్ రెడీ
మూసీ నదిని పూర్తిస్థాయిలో అభివృద్ది చేసి ఓ ఆర్థికరమైన కేంద్రంగా మార్చేప్రణాళికకు రేవంత్ రెడ్జి రెడీ అయ్యారు. కనీసం లక్షన్నర కోట్లను ఇందుకు ఖర్చుగా భావిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వస్తాయని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి రుణమాఫీకి నిధులు ఎలా తీసుకురాగలిగారో అలాగే.. మూసీ ప్రాజెక్టుకు కూడా నిధులు తీసుకు వస్తారని అప్పు కొద్దిగానే ఉంటుందని.. ఇతర మార్గాల ద్వారా నిధులు సమీకరిస్తారని అంటున్నారు. ఆ ప్లాన్లు ఏమిటో అన్యాపదేశంగా రేవంత్ రెడ్డినే ప్రకటిస్తున్నారు. ఇంకా చదవండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)