Moosi Funds : మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
Revanth : ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం మూసీ సుందరీకరణకు నిధులు ఎలా తెస్తుందని కొంత మంది రేవంత్ ను ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయన ప్లాన్లను మాత్రం అంచనా వేయలేకపోతున్నారు.
Revanth is preparing special strategies for raising funds for the Musi beautification project : మూసి నదిని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి ఓ ఆర్థికరమైన కేంద్రంగా మార్చేప్రణాళికకు రేవంత్ రెడ్జి రెడీ అయ్యారు. కనీసం లక్షన్నర కోట్లను ఇందుకు ఖర్చుగా భావిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వస్తాయని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి రుణమాఫీకి నిధులు ఎలా తీసుకురాగలిగారో అలాగే.. మూసీ ప్రాజెక్టుకు కూడా నిధులు తీసుకు వస్తారని అప్పు కొద్దిగానే ఉంటుందని.. ఇతర మార్గాల ద్వారా నిధులు సమీకరిస్తారని అంటున్నారు. ఆ ప్లాన్లు ఏమిటో అన్యాపదేశంగా రేవంత్ రెడ్డినే ప్రకటిస్తున్నారు.
రేవంత్ రెడ్డి నోట రేస్ కోర్స్ తరలింపు మాట
ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు విషయంలో విమర్శలు చేస్తున్న హరీష్ రావు, ఈటల రాజేందర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ సమయంలో అవసరమైతే రేస్ కోర్స్ ను తరలించి అయినా సరే ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఆ మాటలను యథాలాపంగా అన్నారేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి హింట్ ఇచ్చారని.. రేస్ కోర్సను తరలించి ఆ మొత్తాన్ని డెవలవప్ చేస్తే.. మూసీ సుందరీకరణకు అయ్యే నిదుల్లో సగం వస్తాయని రేవంత్ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ దిశగా చర్చలు కూడా ప్రారంభమయ్యాయని చెబుతున్నారు.
కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
మలక్ పేట లో 168 ఎకరాల్లో రేస్ కోర్స్
హైదరాబాద్ నడిబొడ్డున 168 ఎకరాల్లో రేస్ క్లబ్ ఉంది. రేస్ క్లబ్ భూమిని అభివృద్ధికి ఇవ్వడం ద్వారా వచ్చే నిధులను మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు వినియోగించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. మలక్‌పేటలో 168 ఎకరాల రేస్ క్లబ్ భూమిని ప్రభుత్వం తీసుకుని దానికి బదులుగా రేస్ క్లబ్‌కి ఫోర్త్ సిటీలో ఒకటిన్నర రెట్ల భూమిని ఇస్తామని రేస్ కోర్స్ క్లబ్ పాలకవర్గానికి ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. దీనిపై ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే తుది నిర్ణయానికి వచ్చే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు అంబర్‌పేటలో శిథిలావస్థలో ఉన్న సిటీ పోలీసు లైన్ క్వార్టర్ల భూమిని సైతం తీసుకొని.. ఈ రెండింటినీ అభివృద్ధికి ఇవ్వడం ద్వారా వచ్చే నిధులను మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రేవంత్ రెడ్డి బహిరంగసభలో చేసిన వ్యాఖ్యల ద్వారా కొంత మంది విశ్లేషిస్తున్నారు.
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
రేవంత్ ప్లాన్లు అమలైతే ఉభయ ప్రయోజనం
రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తే రేస్ కోర్స్‌తో పాటు ప్రభత్వానికీ లాభమే. రేస్ కోర్స్ ను ఎప్పుడో మలక్ పేట నగరశివారుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ఇరుకు కూడా అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ సిటీలో మూడు, నాలుగు వందల ఎకరాలు కేటాయిస్తే అత్యాధునిక రేస్ కోర్స్ తో పాటు క్లబ్ నిర్మించుకోగలు. అదే సమయంలో రేస్ కోర్స్ స్థలం ప్రభుత్వానికి వస్తే మూసీ ప్రాజెక్టును ఓ దారికి తెచ్చుకుంటారు. అంటే ఉభయులక ప్రయోజనమే అవుతుంది. రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రణాళికలతో మూసీని సుందీరకరమ చేస్తే.. ప్రభుత్వంపై పెద్దగా భారం కూడా ఉండదని అనుకోవచ్చు.