అన్వేషించండి

Telugu States IAS IPS : కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?

Andhra Pradesh : కేటాయించిన రాష్ట్రాల క్యాడర్‌లోనే చేరాలని కేంద్రం సివిల్ సర్వీస్ అధికారుల్ని ఆదేశించింది. దీంతో పలువురు అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మారనున్నారు.

Center has directed the civil service officers to join the cadre of the allotted states : రాష్ట్ర విబజన తర్వాత తెలంగాణ, ఏపీల మధ్య క్యాడర్ కేటాయింపులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయపోరాటం చేసిన ఐఏఎస్,ఐపీఎస్ అధికారులకు చివరికి నిరాశే ఎదురయింది. అభ్యంతరాలన్నింటినీ పక్కన పెట్టిన కేద్ర తక్షణం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తెలంగాణ నుంచి మొత్తం ఐదుగురు ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌లు.. ఏపీ నుంచి ఐదుగురు ఐఏఎస్‌లు ఇలా రిలీవ్ అవనున్నారు. 

ఏపీకీ మాజీ డీజీపీ అంజనీకుమార్ 

విభజనలో భాగంగా ఏపీకి కేటాయించినా తెలంగాణలోనే పని చేస్తున్న ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వారిని ఏపీ క్యాడర్ లో చేరాలని స్పష్టం చేసింది. వీరిలో అంజనీకుమార్ బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ డీజీపీగా పని  చేశారు. అభిషేక్ మహంతి 2019 ఎన్నికల సమయంలో కడప జిల్లా ఎస్పీగా పని చేశారు. తర్వాత తెలంగాణకు వెళ్లారు.                             

ఐఏఎస్ అమ్రపాలి కాటకు భారీ షాక్ - ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని కేంద్రం ఆదేశాలు !

అమ్రపాలి సహా ఐదుగురు ఐఏఎస్‌లు

ఐపీఎస్‌లతో పాటు ఐదుగురు ఐఏఎస్‌లను కూడా ఏపీ క్యాడర్ కు వెళ్లాలని కేంద్రం స్పష్టం చేశారు.  రోనాల్డ్ రాస్ , ప్రశాంతి , వాకాటి కరుణ ,  వాణి ప్రసాద్  ఈ జాబితాలో ఉన్నారు. 

ఏపీ నుంచి తెలంగాణకు ఐదుగురు ఐఎస్‌లు 

ఏపీ నుంచి  ఐదుగురు ఐఏఎస్లను కేంద్రం  రిలీవ్ చేసింది.  ఎస్ ఎస్ రావత్, అనంత్రామ్, సృజన, శివశంకర్, హరికిరణ్ ను రిలీవ్ చేసింది. ఈ ఐదుగురు  ఈ నెల16లోగా తెలంగాణలో రిపోర్టు చేయాల్సి ఉంది.                                                                  

ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?

కేటాయించిన రాష్ట్రాలను వద్దనుకున్న అధికారులు

రాష్ట్ర విభజన జరిగినప్పుడు సివిల్ సర్వీస్ అధికారుల్ని విభజించడానికి ఖండేకర్ కమిటీ ని నియమించి విధి విధానాలు ఖరారు చేశారు. ఆ విధి విధానాల ప్రకారం ప్రత్యూష్ సిన్హా కమిటీ అధికారుల్ని విభజించింది. అయితే తమను ఆయా రాష్ట్రాలకు కేటాయించడంపై పలువురు క్యాట్‌తో పాటు కోర్టుల్లో న్యాయపోరాటం చేశారు. చివరికి కోర్టుల్లోనూ వారికి అనుకూల ఫలితం రాలేదు. గతంలోనే సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయిస్తే తెలంగాణలో పని చేశారు. ఆయన ఏపీకి వెళ్లాల్సిందేనని కోర్టు ఆదేశించండతో వెళ్లక తప్పలేదు. ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆదేశాలు అందుకున్నవారంతా వారికి కేటాయించిన  రాష్ట్రాలకు వెళ్లాల్సిందే.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Embed widget