(Source: ECI/ABP News/ABP Majha)
Top Headlines: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్ - తెలంగాణ గ్రూప్ 1 వాయిదాకు సుప్రీంకోర్టు నో, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top Headlines In AP And Telangana:
1. ఏపీ హైకోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిటిషన్
హీరో అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల టైంలో నంద్యాలలో పర్యటన సందర్భంగా తనపై నమోదు అయిన కేసుపై అప్పీల్‌కు వెళ్లారు. ఆ కేసును క్వాష్ చేయాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారించే అవకాశం ఉంది. కాగా, ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ అభ్యర్థి ఇంటికి వచ్చి మద్దతు తెలిపారు. అయితే, సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా జన సమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన హైకర్టును ఆశ్రయించారు. ఇంకా చదవండి.
2. వాలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్
మాజీమంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన వాలంటీర్ హత్య కేసులో ఈయన ప్రధాన నిందితుడుగా ఉన్నారు. కొన్ని రోజుల నుంచి గాలిస్తున్న ఖాకీలు రాత్రి అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అక్కడే కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై ఏపీకి తీసుకురానున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిందీ దుర్గటన. కోనసీమ అల్లర్ల టైంలో వాలంటీరు దుర్గాప్రసాద్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు 2022 జూన్ 6న దుర్గా ప్రసాద్‌ను హత్య చేశారు. ఇంకా చదవండి.
3. డ్రోన్ షో కోసం విజయవాడలో భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని పున్నమీ ఘాట్ వద్ద 22వ తేదీ సాయంత్రం ఐదువేలకు పైగా డ్రోన్లతో మెగా షో నిర్వహిస్తున్నారు. ఈ డ్రోన్ షో నగర ప్రజలంతా చూసేందుకు వీలుగా విజయవాడలో విస్తృత ఏర్పాట్లు చేశారు. నగరంలో ఐదు ప్రాంతాల్లో పెద్ద పెద్ద డిజిటల్ స్క్రీన్‌లు సిద్ధం చేశారు. ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని చూసి ఎంజాయ్ చేసేలా ఉంటున్నాయి ఏర్పాట్లు చేసినట్టు డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ చెప్పారు. ఇంకా చదవండి.
4. గ్రూప్ 1 పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ
గ్రూప్ 1 వాయిదా వేయాలని కోరుతూ గ్రూప్ 1 అభ్యర్థులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పరీక్షల నిర్వాహణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఓ వైపు పరీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్న భయం సీరియస్‌గా ప్రిపేర్ అయిన అభ్యర్థులు, అధికారుల్లో ఉంది. ఇంకా చదవండి.
5. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కోట్ల మంది ప్రజలు హాయిగా నిద్రపోతున్నారంటే అందుకు పోలీసులే కారణమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే శాంతి భద్రతలు కీలకమైన అంశమని గుర్తు చేశారు. శాంతిభద్రతలు లేని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకురారని గుర్తు చేశారు. తెలంగాణలో పోలీసులు అవసరమైతే తమ ప్రాణాలైనా వదులుతున్నారు కాని శాంతి భద్రతల్లో రాజీ పడటం లేదని అభినందించారు. ఇంకా చదవండి.