Vijayawada News: డ్రోన్ షో కోసం విజయవాడలో ఐదు ప్రాంతాల్లో భారీ డిజిటల్ స్క్రీన్‌లు
Andhra Pradesh News: అమరావతి డ్రోన్ సమ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. డ్రోన్ షో తిలకించడానికి విజయవాడలో ఐదు చోట్ల భారీ స్క్రీన్‌లు సిద్ధం చేశారు.
Extensive Arrangements For Amaravati Drone Summit 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని పున్నమీ ఘాట్ వద్ద 22వ తేదీ సాయంత్రం ఐదువేలకు పైగా డ్రోన్లతో మెగా షో నిర్వహిస్తున్నారు. ఈ డ్రోన్ షో నగర ప్రజలంతా చూసేందుకు వీలుగా విజయవాడలో విస్తృత ఏర్పాట్లు చేశారు. నగరంలో ఐదు ప్రాంతాల్లో పెద్ద పెద్ద డిజిటల్ స్క్రీన్‌లు సిద్ధం చేశారు. ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని చూసి ఎంజాయ్ చేసేలా ఉంటున్నాయి ఏర్పాట్లు చేసినట్టు డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ చెప్పారు.
డిజిటల్ తెరలు ఎక్కడంటే?
విజయవాడ సిటీలో బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగు, వారధి, బస్టాండు, ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ డిజిటల్ తెరలు ఏర్పాటు చేసి ఈ డ్రోన్ షోని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రజలంతా ఈ షోను తిలకించాలని, పున్నమి ఘాట్‌లో కూడా ప్రజలు ఈ షోను ప్రత్యక్షంగా చూసేలా ఆహ్వానిస్తున్నారు.
ఏర్పాట్లలో నిమగ్మమైన యంత్రాంగం
22-23వ తేదీల్లో నిర్వహించే అమరావతి డ్రోన్ సమ్మిట్ విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం రేయింబవళ్లు కృషి చేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర పెట్టుబుడులు, మౌలికసదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, ఏపీ డ్రోన్ కార్పొరేష్ ఎండీ కె. దినేష్ కుమార్ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో 22వ తేదీ ఉదయం అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహననాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి కూడా పాల్గొంటారు.
Also Read: రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
సాయంత్రానికి పున్నమి ఘాట్‌లో పెద్ద ఎత్తున డ్రోన్ షో, బాణసంచా షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రంగా తలమునకలైంది. 10 మంది డిప్యూటీ కలెక్టర్లకు ఈ ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. . దాదాపు 300 మంది అధికారులు, సిబ్బంది రేయింబవల్లు శ్రమించి ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రజలంతా ఈ డ్రోన్ షో తిలకించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిన ఏపీ డ్రోరన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ కోరారు. ఏర్పాట్లలో 10 మంది డిప్యూటీ కలెక్టర్‌లు సహా 300 మంది సిబ్బంది అధికారులు పనిచేస్తున్నారు.
ఇప్పటికే నగరానికి చేరుకున్న డ్రోన్‌లు
రెండు రోజులు నిర్వహించే డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా తొలి రోజు చేపట్టే డ్రోన్ షో కోసం ఇప్పటికే భారీగా డ్రోన్‌లు విజయవాడ చేరుకున్నాయి. వాటిని ఆదివారం నుంచి ఛార్జింగ్ చేస్తున్నారు. వాటిని పరీక్షిస్తున్నారు. ఈ డ్రోన్‌లతో దుర్గమ్మ సహా వివిధ ఆకారాలతో షోను ముస్తాబు చేస్తున్నారు. ప్రోటోకాల్‌ను బట్టి గ్యాలరీను సిద్ధం చేశారు.
Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ కళ్యాణ్ శుభవార్త