News
News
X

Tirupati: తిరుపతిలో వింతైన ఘటన.. పైకి దూసుకొచ్చిన భారీ నీళ్ల సంపు.. అసలెలా జరిగిందంటే..

భూమి లోపల ఉన్న ట్యాంకులోకి దిగి మహిళ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా అది అమాంతం నిట్టనిలువుగా పైకి లేచింది. దాదాపు 11 సిమెంటు వరల మేర బయటికి, పైకి చొచ్చుకొని వచ్చింది.

FOLLOW US: 

తిరుపతిలో ఓ వింతైన ఘటన చోటు చేసుకుంది. భూమిలో ఉండే నీళ్ల సంపు ఒక్కసారిగా పైకి చొచ్చుకొచ్చింది. దీనిని సిమెంటు వరలతో నిర్మించారు. సాధారణంగా నీళ్ల సంపులు భూమిలో కుంగడం వంటివి చాలా అరుదుగా జరుగుతుంటుంది. భూమి తీరు సరిగ్గా లేనప్పుడు, భూమి గుల్లగా ఉన్న సందర్భాల్లో కుంగడం వంటివి చూస్తుంటాం. కానీ, ఇక్కడ 18 సిమెంటు వరలతో భూమిలో నిర్మించిన నీళ్ల సంపు అమాంతం పైకి లేవడం అమితమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

ఈ నీళ్ల సంపు భూమిలో నుంచి దాదాపు 25 అడుగుల మేర పైకి లేచింది. దాదాపు 18 సిమెంట్ వరలను ఒకదానిపై ఒకటి ఉంచి భూమిలో దీన్ని నిర్మించారు. ఆ సిమెంటు రింగులకు జాయింట్లలో సిమెంటుతోనే అతికించారు.

అయితే, ఈ నీళ్ల ట్యాంకులోకి ఓ మహిళ దిగి శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. భూమి లోపల ఉన్న ట్యాంకులోకి దిగి మహిళ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా అది అమాంతం నిట్టనిలువుగా పైకి లేచింది. దాదాపు 11 సిమెంటు వరల మేర బయటికి, పైకి చొచ్చుకొని వచ్చింది. దీంతో మహిళ భయపడి ట్యాంక్ నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు గాయాలు కూడా అయ్యాయి. 

స్థానికులకు ఈ విషయం తెలియడంతో వారు ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. ఈ వింతను చూసేందుకు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎలా జరిగిందన్నదానిపై కచ్చితమైన స్పష్టత లేదు. అయితే, భారీ వర్షాల వల్ల భూమిలో నీరు చేరి నీళ్ల సంపు అమాంతం పైకి వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

News Reels

కారణం ఏంటంటే..
గత కొన్నేళ్లలో ఇలాంటి ఘటనలు జరిగినట్లుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్‌గా ఉన్న ప్రొఫెసర్ బాలకిషన్ వెల్లడించారు. గతంలో మణికొండలో కూడా ఓ నీళ్ల సంపు ఆరడుగుల ఎత్తు లేచినట్లుగా చెప్పారు. ‘‘భూమి పొరల్లో సాధారణంగా నీటి ప్రవాహాలు ఉంటాయి. అవి సహజంగా పల్లంవైపు ప్రవహిస్తుంటాయి. అలా ఒక చోట నీరు పోగుపడడంతో నీటి సంపు పైకి ఎగబాకే అవకాశం ఉంటుంది. అంతేకాక, ఈ నీటి సంపు 25 అడుగుల వరకూ ఉంది. సాధారణంగా నీటి సంపు అంత లోతుగా నిర్మించరు. 25 అడుగుల లోతులో నీరు పెల్లుబకడం వల్ల నీటి సంపు పైకి ఎగదన్నుకొని వచ్చి ఉండొచ్చు.’’ అని ప్రొఫెషన్ బాల కిషన్ అంచనా వేశారు.

Also Read: సమాజంలో విలువల్ని కాపాడాలి.. మరొకరికి ఇలాంటి అవమానం జరగకూడదని నారా భువనేశ్వరి బహిరంగ లేఖ

Also Read : ఏపీ వరి ధాన్యం లారీలకు తెలంగాణలో నో ఎంట్రీ .. సరిహద్దుల్లో నిలిచిన లారీలు !

Also Read : ఏపీలో సినిమా టికెట్ల ఇష్యూ నేడు తేలుతుందా? చిరంజీవి ట్వీట్‌పై పేర్ని నాని ఏమన్నారంటే..

Also Read: Kodali Nani: ఎన్టీఆర్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఎప్పుడో విడిపోయాం 

Also Read: Chiru : దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 26 Nov 2021 12:25 PM (IST) Tags: Tirupati News Tirupati Water Tank Krishna nagar water Tank Water sump

సంబంధిత కథనాలు

Gold-Silver Price 1 December  2022: 54 వేల వైపు పరుగులు పెడుతున్న బంగారం- మీ ప్రాంతాల్లో రేటు తెలుసా?

Gold-Silver Price 1 December 2022: 54 వేల వైపు పరుగులు పెడుతున్న బంగారం- మీ ప్రాంతాల్లో రేటు తెలుసా?

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirupati: తగ్గేదేలే, ఛేజ్ చేసి ఎర్రచందనం కూలీలను పట్టుకున్న పోలీసులు - సినిమా సీన్ తరహాలో !

Tirupati: తగ్గేదేలే, ఛేజ్ చేసి ఎర్రచందనం కూలీలను పట్టుకున్న పోలీసులు - సినిమా సీన్ తరహాలో !

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

AP New CS Jawahar Reddy: ఏపీ సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

Tirupati News: గంజాయి రవాణా చేస్తున్న కానిస్టేబుల్, సినీ ఫక్కీలో పట్టుకున్న ఖాకీలు !

Tirupati News: గంజాయి రవాణా చేస్తున్న కానిస్టేబుల్, సినీ ఫక్కీలో పట్టుకున్న ఖాకీలు !

టాప్ స్టోరీస్

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

AP Police Constable Application: ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?