TTD Mangal Sutra: మహిళలకు శ్రీవారి నుంచి మంగళ సూత్రాలు - టీటీడీ కీలక నిర్ణయం
Tirumala News: దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
![TTD Mangal Sutra: మహిళలకు శ్రీవారి నుంచి మంగళ సూత్రాలు - టీటీడీ కీలక నిర్ణయం Tirumala News TTD plans to supply mangal sutra to woman says chairman Bhumana Karunakar reddy TTD Mangal Sutra: మహిళలకు శ్రీవారి నుంచి మంగళ సూత్రాలు - టీటీడీ కీలక నిర్ణయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/29/99f674d1c8fd43552cad3410d78c69a21706529216574234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నిర్ణయం తీసుకుంది. హిందువుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మహిళలకు మంగళసూత్రాలను అందజేయనున్నారు. వారు పవిత్రంగా భావించే తాళిబొట్లను (మంగళ సూత్రం) తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అందించబోతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి ధరించే మంగళ సూత్రాలు తయారు చేయించాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈ రకంగా తయారు చేసిన తాళి బొట్లను శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభ నష్టాలు లేని ధర నిర్ణయించి విక్రయిస్తారు. ఇప్పటికే వివాహం అయిన వారు, వివాహం చేసుకోబోయే వధువులు ఈ తాళిబొట్లను ధరించడం వల్ల దీర్ఘ సుమంగళిగా ఉంటారని భక్తుల విశ్వాసం.
సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ఈ మంగళ సూత్రాలు తయారు చేయబోతోంది. నాలుగైదు డిజైన్లలో తయారు చేసే ఈ మంగళ సూత్రాలు 5 గ్రాములు, 10 గ్రాముల బరువుతో ఉంటాయి. భూమన కరుణాకర రెడ్డి గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో నిర్వహించిన కల్యాణ మస్తు (సామూహిక వివాహాలు) ద్వారా సుమారు 32 వేల మంది వధువులకు స్వామివారి ఆశీస్సులు అందించిన మంగళ సూత్రాలు ఉచితంగా అందించారు. ఈ జంటలన్నీ స్వామివారి ఆశీస్సులతో జీవిస్తున్నారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మహిళలకు స్వామివారి ఆశీస్సులు అందిన మంగళ సూత్రాలు అందించాలనే ఆలోచన చేసి కార్య రూపంలోకి తెచ్చారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)