By: ABP Desam | Updated at : 27 Dec 2022 12:44 AM (IST)
తిరుమలలో శ్రీవారి భక్తుల ధర్నా
Devotees Protest at Tirumala Tirupati Devasthanam: తిరుపతి: కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తులు ధర్నాకు దిగారు. దర్శనానికి అనుమతించక పోవడంతో మ్యూజియం వద్ద శ్రీవారి భక్తులు నిరసనకు దిగారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా శ్రీవారి దర్శనం ఈ 27న ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఆలయ శుద్ది అనంతరం ఉదయం 11 గంటల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు భక్తులను అనుమతించనున్నారు. కానీ విషయం ముందే తెలపకపోవడంతో సోమవారం రాత్రి సమయానికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులతో పూర్తిగా నిండి పోయింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కు వెలుపల ఉన్న భక్తులను క్యూ లైన్ల లోనికి టిటిడి సిబ్బంది అనుమతించడం లేదు.
సమాచార లోపంతో వైకుంఠం క్యూలైన్స్ వద్దకు చేరుకున్న భక్తులు ఆందోళన చేస్తున్నారు. దాంతో టిటిడి విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. విజిలెన్స్ అధికారులు సర్ధి చెప్పడంతో భక్తులు శాంతించారు. శ్రీవారి దర్శనానికి ముప్పై గంటల సమయం పడుతుందని టిటిడి ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం రాత్రి క్యూలైన్స్ లోకి భక్తులను అనుమతించడం లేదని టిటిడి విజిలెన్స్ అధికారులు భక్తులకు తెలిపారు.
జనవరి 1 నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్లు జారీ
తిరుమలలో టీటీడీ అధికారులతో కలిసి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని ఈవో చెప్పారు. ఇందుకోసం ఆన్‌లైన్ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 2 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. తిరుపతిలో అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం, రైల్వేస్టేషన్ వెనుక ఉన్న 2, 3 సత్రాలు, ఆర్‌టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్ హైస్కూల్, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూల్, ఎంఆర్ పల్లి జడ్‌పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో జనవరి 1న సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభిస్తామన్నారు.
జనవరి 1న ఆఫ్‌లైన్ విధానంలో తిరుపతిలో టీటీడీ టోకెన్లను కేటాయించనుంది. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల టిక్కెట్లను టీటీడీ కేటాయించింది. భక్తులు ఈ టికెట్లను పొందొచ్చు. జనవరి 1న సర్వదర్శనం టికెట్ల జారీ ఉంటుంది. అంతేకాదు వైకుంఠ ద్వార దర్శనం జరిగే పది రోజులు సామాన భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని టీటీడీ చెబుతోంది. ప్రతిరోజూ 2000 మంది దాతలు తమ దర్శన కోటాను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే దర్శన టిక్కెట్లు కేటాయిస్తారు. సిఫార్సు లేఖలు తీసుకోరు.
ఆంధ్రప్రదేశ్లో టాప్ హెడ్లైన్స్ ఇవే!
తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలెర్ట్!
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
Kadapa Crime : ఆధార్ ఫింగర్ ప్రింట్స్ డూప్లికేట్, బ్యాంక్ అకౌంట్లలో కోటికి పైగా నగదు చోరీ
వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
Government Websites Hacked: ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు
Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!