అన్వేషించండి

Kuppam News: కుప్పంలో టీడీపీ-వైసీపీ నేతల రచ్చ! అన్నా క్యాంటిన్ ధ్వంసం - రోడ్డుపైనే ఎంపీ, ఎమ్మెల్సీ నిరసన

Chandrababu Kuppam Tour: అన్న క్యాంటీన్ వద్ద ఉన్న టీడీపీ నాయకులపై దౌర్జన్యంతో వైసీపీ నేతలు దాడికి దిగారు. వైసీపీ, టీడీపీ నేతలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.

Chandrababu Kuppam Tour: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు కుప్పం పర్యటన ఉద్రిక్తంగా సాగుతోంది. గురువారం కుప్పంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిన్న కొల్లుపల్లిలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. నేడు కుప్పంలో వైఎస్ఆర్ సీపీ నేతలు బంద్ కు పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో రెండో రోజు చంద్రబాబు పర్యటనలో అన్న క్యాంటీన్ ప్రారంభించాల్సి ఉంది. అయితే, ప్రారంభోత్సవానికి చేరుకుని అన్న క్యాంటీన్ ప్రాంగణాన్ని వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. లోపలి ఫ్లె్క్సీలను చింపేశారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద టేబుళ్లు ధ్వంసం చేశారు. చంద్రబాబు పర్యటనకు బదులుగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేశారు. ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ కూడా తమ ఇళ్ల నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకూ నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు.

అన్న క్యాంటీన్ వద్ద ఉన్న టీడీపీ నాయకులపై దౌర్జన్యంతో వైసీపీ నేతలు దాడికి దిగారు. వైసీపీ, టీడీపీ నేతలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో చిత్తూరు ఎస్పీ కూడా కుప్పంకు చేరుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద, కట్టుదిట్టమైన బలగాలతో  పోలీసులు మోహరించారు. చిత్తూరు జిల్లా నుంచే కాక తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాల నుంచి అదనపు పోలీస్ బలగాలు కుప్పంకు చేరుకున్నాయి. కుప్పంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.Kuppam News: కుప్పంలో టీడీపీ-వైసీపీ నేతల రచ్చ! అన్నా క్యాంటిన్ ధ్వంసం - రోడ్డుపైనే ఎంపీ, ఎమ్మెల్సీ నిరసన

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ భరత్ ఇంటి నుంచి చేసిన నిరసనలకు పోటీగా, తెలుగు దేశం కార్యకర్తలు కూడా నిరసనలకు దిగారు. వారు ఏకంగా ఎమ్మెల్సీ భరత్ ఇంటికి ర్యాలీగా బయలుదేరారు. 

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన మూడు రోజుల పర్యటన బుధవారం (ఆగస్టు 25) ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తొలి రోజు రామకుప్పం మండలంలోని కొంగనపల్లె, కొళ్లుపల్లె, శివునికుప్పం, చల్దిగానిపల్లెల్లో చంద్రబాబు పర్యటించారు. నేడు గురువారం కుప్పంలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించి, టీడీపీ కార్యాలయాన్ని నేడు ప్రారంభించాల్సి ఉంది.

చంద్రబాబు వ్యాఖ్యలు

చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా నేడు (ఆగస్టు 25) తలెత్తిన ఉద్రిక్తతలు, అన్నా క్యాంటిన్ ధ్వంసం చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ నేతల తీరును ఖండించారు. తనపైనే దాడికి సిద్ధమైన వైఎస్ఆర్ సీపీ నేతలకు సామాన్య ప్రజలపై దాడి చేయడం ఓ లెక్కా అని అన్నారు. టీడీపీ నేత రవిచంద్ర 90 రోజుల నుంచి పేద ప్రజలకు అన్నం పెడుతుంటే అది నేరమా అని ప్రశ్నించారు. ఇది తప్పు అవునా కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా ధర్మపోరాటానికి కుప్పం నుంచే నాంది పలుకుతున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. ప్రజా పరిరక్షణకు నాంది అని అన్నారు. కుప్పంలో గురువారం చెలరేగిన ఉద్రిక్తతల వేళ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సీఎం జగన్, వైఎస్ఆర్ సీపీ నేతలను విమర్శిస్తూ మాట్లాడారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget