CAT 2024: క్యాట్‌కు అప్లై చేసే విద్యార్థులూ ఈ తప్పులు చేయొద్దు
Education News: దేశం లో ప్రముఖ ఐఐయం లో అడ్మిషన్ సాదించాలి అంటే క్యాట్ పరీక్షా 2024 రాయాలి. ఈ పరీక్షా ఎలా అప్లై చేసుకోవాలి.. ఎవరు అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకుందాం
Tirupati: దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో సగానికి పైగా సీఈవోలు, సంస్థ వ్యవస్థాపకులు ఐఐఎంలలో చదివి పట్టభద్రులైన వారే. దేశంలోని ప్రముఖ ఐఐఎంలో విద్యాభ్యాసం చేస్తే అవకాశాలు వాటి అంతటకు అవే వెతుక్కుంటూ వస్తాయని విద్యార్థులు నమ్ముతారు. ఇలాంటి ఐఐఎంలో అడ్మిషన్లకు సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (క్యాట్)- 2024 ప్రకటన విడుదలైంది.
దేశంలోని ఐఏఎంలో ప్రవేశాలకు ప్రతి ఏటా లక్ష నుంచి రెండు లక్షల మందిపైగా విద్యార్థులు పోటీపడి క్యాట్ పరీక్షలు రాస్తారు. ఈ ప్రవేశ పరీక్షల్లో 5వేల మందికి మాత్రమే సీట్లు లభిస్తాయి. ఇలా అడ్మిషన్ పొంది ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థుల భవిష్యత్తు, క్యాట్ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
దేశంలో అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, ముంబై, లక్నో, షిల్లాంగ్, ఇండోర్, కోజికోడ్, తిరుచ్చి, రాయపూర్, రాంచీ, రేహ్తక్, అమృత్ సర్, బోథ్‌గయా, జమ్మూ, కాశీపూర్, నాగ్‌పూర్, సింబల్ పూర్, సిర్మౌర్, ఉదయపూర్, విశాఖపట్నంలో ఐఐఎంలు ఉన్నాయి. ఇక్కడ 5000 ఎంబీఏ (పోస్ట్ గ్రాడ్యుయేట్) సీట్లు ఉన్నాయి. ఇందులో అడ్మిషన్లు పొందాలంటే డిగ్రీ పూర్తి అయిన విద్యార్థులు... ప్రస్తుతం డిగ్రీ పైనల్ ఈయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
క్యాట్ పరీక్ష
జాతీయ స్థాయిలో ప్రవేశాలకు అభ్యర్థులు క్యాట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా ప్రవేశ పరీక్ష రాస్తే 2025-2027లో ఏంబీఏ చేయవచ్చు.
అర్హత: కనీసం 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత ( ఎస్సీ, ఎస్టీ, ప్రత్యేక ప్రతిభావంతులైన వారికి 45% ఉత్తీర్ణత సరిపోతుంది)
ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ప్రత్యేక ప్రతిభావంతులైన అభ్యర్థులు రూ.1250, ఇతర విద్యార్థులు రూ.2500 ఆన్ లైన్లో చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష కేంద్రాలు: ఏపీలో అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏదో కేంద్రాన్ని విద్యార్థులు దరఖాస్తు చేసే సమయంలో ఎంపిక చేసుకోవాలి.
క్యాట్ పరీక్ష విధానం:
1. క్యాట్ పరీక్ష మూడు సెషన్స్‌గా విభజించారు. Verbal ability reading comprehension (VARC) ఉంటాయి. 16 ప్రశ్నలు ఉంటాయి.
2. Logical reading (LR) Data Interpretation (DI) -20 ప్రశ్నలు
3. Quantitative ability (QA) -22 ప్రశ్నలు
అన్ని సబ్జెక్టుల ప్రాథమిక అంశాలపై పట్టు బిగిస్తూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ టెస్టులు చేసి తప్పిదాలు సరి చేసుకొని మంచి స్కోరు సాధించేందుకు కృషి చేయాలి. ఇందులో మొత్తం 80% మార్కులు సాధిస్తే మంచి ఐఐఎం లో సీటు సాధించే అవకాశం ఉంటుంది.
ముఖ్య తేదీలు: దరఖాస్తు- ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 13 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు చివరి తేది
అడ్మిట్ కార్డు డౌన్ లోడ్: 2024-11-05 నుంచి 2024-11-24వరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
క్యాట్ పరీక్ష తేదీ:- 24-11-2024
ఫలితాలు విడుదల:- 2025 జనవరిలో
* దరఖాస్తు చేసే సమయంలో పేరు ఇతర వివరాలను ఎంటర్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చేయాలి. పదో తరగతి సర్టిఫికెట్ ఆధారంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చేసుకుంటే హాల్ టికెట్లు, పరీక్షల్లో ఇబ్బందులు లేకుండా ఉంటుంది.
* రిజర్వేషన్ ఆధారితంగా సీట్లు కేటాయిస్తారు కాబట్టి అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
* అభ్యర్థులు ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్‌సీ సర్టిఫికెట్లు లేకపోతే వెంటనే అప్లై చేసుకుని వాటిని దగ్గర ఉంచుకోవాలి. ఒకసారి అభ్యర్థులు ఏ క్యాటగిరీకి అయితే దరఖాస్తు చేసుకుంటారు ఆ తర్వాత మార్చే అవకాశం ఉండదు.
కృషి చేస్తే ఫలితం దక్కుతుంది
క్యాట్‌లో 95 నుంచి 80 శాతం పర్సంటైల్ సాధించిన విద్యార్థులు ఐఐఎం సీటు వస్తుంది. అన్ని అంశాలపై దృష్టి పెట్టి కృషి చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. లక్ష్యం పెద్దగా పెట్టుకుని ప్రయత్నం చేయండి.. విజయం సాధిస్తారు. - శ్రీధర్, కౌటిల్య కోచింగ్ సెంటర్ డైరెక్టర్, తిరుపతి