అన్వేషించండి

TTD Adulterated Ghee Issue: కల్తీ నెయ్యి విషయంలో తప్పు చేసిన వారిపై చర్యలకు సిద్ధం - త్రిసభ్య కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం

TTD Adulterated Ghee Issue: టీటీడీ కల్తీ నెయ్యి ఘటనలో ఏకసభ్య కమిటీ నివేదికపై చర్యలు తీసుకునేందుకు మరో త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. వారంలో కమిటీ నివేదిక ఇవ్వనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టీటీడీ లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు.
  • ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇవ్వనుంది.
  • లడ్డూ నెయ్యి నాణ్యత, టెండర్ల ప్రక్రియపై నివేదిక పరిశీలన.
  • దోషులపై కఠిన చర్యలు, వ్యవస్థలో ప్రక్షాళన లక్ష్యం.

Three Member Committee on TTD Adulterated Ghee Case:  శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఈ వివాదంపై ఇప్పటికే విచారణ జరిపిన వన్ మెన్ కమిటీ సమర్పించిన నివేదికను లోతుగా విశ్లేషించేందుకు, తదుపరి చర్యల కోసం ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన హై లెవెల్ కమిటీ ని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీసి, దోషులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

 ముగ్గురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ 

ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేసిన ఈ హై లెవెల్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి  ఉంటారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యి నాణ్యత, టెండర్ల ప్రక్రియలో జరిగిన ఉల్లంఘనలపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ దినేష్ కుమార్  ఇచ్చిన నివేదికలోని ముఖ్యాంశాలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.

 వారంలోగా తుది నివేదికకు ఆదేశం 

ఈ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం, విచారణను వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం  వారంలోకా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం సూచించింది. వన్ మెన్ కమిటీ నివేదిక ఆధారంగా ఎవరెవరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి? ఏయే విభాగాల్లో లోపాలు జరిగాయి? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి నిబంధనలు తీసుకురావాలి? అనే అంశాలపై ఈ ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సులు చేయనుంది.

 దోషులపై ఉచ్చు బిగిస్తున్న ప్రభుత్వం 

లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. లడ్డూ తయారీకి వాడే నెయ్యి సరఫరాలో రాజకీయ జోక్యం, అర్హత లేని సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం వంటి అంశాలపై ఈ కమిటీ ఇచ్చే నివేదిక అత్యంత కీలకం కానుంది. నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం బాధ్యులైన అధికారులపై, గత పాలకమండలి సభ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

 విశ్వాసాన్ని పునరుద్ధరించే ప్రయత్నం 

కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని అత్యంత సున్నితంగా , పారదర్శకంగా పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. హై లెవెల్ కమిటీ ఇచ్చే నివేదిక ద్వారా శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి గల కారణాలను బహిర్గతం చేసి, టీటీడీ వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లో నివేదిక రానుండటంతో, తదుపరి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.                                                              

 

Frequently Asked Questions

టీటీడీ అక్రమ నెయ్యి కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది?

శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై విచారణకు ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వన్ మెన్ కమిటీ నివేదికను విశ్లేషించి, తదుపరి చర్యలపై సిఫార్సులు చేస్తుంది.

హై లెవెల్ కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారు?

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.

హై లెవెల్ కమిటీ నివేదికను ఎప్పటిలోగా సమర్పించాలి?

ఈ కమిటీ వారం రోజుల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం సూచించింది.

ఈ హై లెవెల్ కమిటీ విచారణలో ఏ అంశాలపై దృష్టి సారిస్తుంది?

లడ్డూ తయారీలో వాడిన నెయ్యి నాణ్యత, టెండర్ల ప్రక్రియలో జరిగిన ఉల్లంఘనలు, మరియు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన నిబంధనలపై కమిటీ దృష్టి సారిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget