TTD On Archana Gautam : నటి అర్చనా గౌతమ్ ఆరోపణలు అవాస్తవం, వివాదంపై స్పందించిన టీటీడీ
TTD On Archana Gautam : యూపీకి చెందిన కాంగ్రెస్ నేత, సినీ నటి అర్చనా గౌతమ్ చేసిన ఆరోపణలను టీటీడీ ఖండించింది. టీటీడీ ఉద్యోగులపై నటి అర్చన గౌతం దాడికి పాల్పడడం హేయమైన చర్య అని పేర్కొంది.
TTD On Archana Gautam : టీటీడీ సిబ్బంది తీరుపై సినీ నటి అర్చనా గౌతమ్ చేసిన ఆరోపణలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. టీటీడీ ఉద్యోగులపై నటి అర్చనా గౌతమ్ దాడికి పాల్పడడం హేయమైన చర్య అని అభివర్ణించింది. అర్చనా గౌతమ్ వివాదంపై టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివకాంత్ తివారి, నటి అర్చనా గౌతమ్ మరో ఏడుగురితో ఆగస్టు 31న శ్రీవారి దర్శనం కోసం కేంద్ర సహాయమంత్రి నుంచి సిఫారసు లేఖను తీసుకుని తిరుమలకు వచ్చారు. అదనపు ఈవో కార్యాలయంలో దర్శనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ లేఖపై రూ.300 దర్శనం టికెట్లు మంజూరు చేస్తూ శివకాంత్ తివారికి చెందిన మొబైల్ నంబరుకు మెసేజ్ పంపారు. అయితే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదని టీటీడీ తెలిపింది. తరువాత శివకాంత్ తివారి అదనపు ఈవో కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే టికెట్లు తీసుకోవాల్సిన గడువు ముగిసిందని టీటీడీ ఉద్యోగులు వారికి తెలిపారు .
The actress-cum-politician @archanagautamm's video alleging false claims regarding VIP Darshan at TTD trending on social media is malicious. TTD issued a statement regarding the whole fiasco.
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) September 5, 2022
Thread regarding the whole incident 👇 https://t.co/yM3RACH68q
టీటీడీ సిబ్బందిపై దాడి
శివకాంత్ తివారితోపాటు అదనపు ఈవో కార్యాలయంలోకి వచ్చిన నటి అర్చనా గౌతమ్ ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి కార్యాలయ సిబ్బందిని దుర్భాషలాడారని టీటీడీ తెలిపింది. సర్దిచెప్పబోయిన ఒక ఉద్యోగిపై చేయి చేసుకున్నారని పేర్కొంది. తివారి ఆమె చేస్తున్న యాగీని చూస్తూ ఉరుకున్నారు తప్ప ఆమెను వారించే ప్రయత్నం చేయలేదని టీటీడీ తెలిపింది. చివరకు ఆదనపు ఈవో కార్యాలయ సిబ్బంది వారి వివరాలు తీసుకుని రెండోసారి రూ.300 టికెట్లు కేటాయించినా తీసుకోవడానికి నటి అర్చనా గౌతమ్ నిరాకరించారని టీటీడీ సిబ్బంది అంటున్నారు. అనంతరం అక్కడి నుండి టు టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కార్యాలయ సిబ్బంది తనపై చేయి చేసుకుని దురుసుగా ప్రవర్తించారని ఆమె తప్పుడు ఫిర్యాదు చేశారని టీటీడీ ఆరోపించింది. అదనపు ఈవో కార్యాలయ సిబ్బందిని అక్కడి సీఐ పిలిపించి విచారణ చేపట్టారని, సిబ్బంది తాము తీసిన వీడియోను సీఐకి చూపించగా నటి దురుసుగా ప్రవర్తించిన విషయం వెలుగుచూసిందని టీటీడీ తెలిపింది. దీంతో నటి వెనక్కి తగ్గి అక్కడి నుంచి వెళ్లిపోయారని వెల్లడించింది.
నటి అర్చన గౌతం దుష్ప్రచారం
"సెప్టెంబర్ 1వ తేదీకి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ కావాలంటే రూ.10,500 చెల్లించి శ్రీవాణి దర్శన టికెట్ పొందొచ్చని మాత్రమే సిబ్బంది సలహా ఇచ్చారు. వాస్తవాలు ఇలా ఉండగా అదనపు ఈవో కార్యాలయ సిబ్బంది దర్శనం టికెట్ కోసం రూ.10 వేలు డిమాండ్ చేశారని ఆ వీడియోలో నటి ఆరోపించారు. తాను సెలబ్రిటీ అయినందువల్ల ఏమి చెప్పినా భక్తులు నమ్ముతారనే అభిప్రాయంతో నటి అర్చన గౌతం అవాస్తవాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. భక్తులు ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దు" అని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
Also Read : Actor Archana Gautam : టీటీడీ అధికారి చేయి చేసుకున్నాడు, కన్నీటి పర్యంతమైన సినీ నటి అర్చన గౌతం!