Tirumala Face Recognition : తిరుమలలో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ, ఇకపై దళారులకు చెక్!
Tirumala Face Recognition : తిరుమలలో మార్చి 1 నుంచి ముఖ ఆధారిత గుర్తింపు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. గదుల కేటాయింపు, కాషన్ డిపాజిట్ చెల్లించే కౌంటర్ల వద్ద ఈ విధానాన్ని వినియోగిస్తున్నారు.
![Tirumala Face Recognition : తిరుమలలో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ, ఇకపై దళారులకు చెక్! Tirumala temple introduces Face recognition technology rooms laddu counters DNN Tirumala Face Recognition : తిరుమలలో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ, ఇకపై దళారులకు చెక్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/02/53485290b4441d0423086ca4c752976a1677771636592235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tirumala Face Recognition : తిరుమలలో మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ప్రవేశపెట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. గదుల కేటాయింపు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద ఈ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ. ఫొటో ఆధారిత బయోమెట్రిక్ అమలుతో దళారులకు అడ్డుకట్ట వేయనుంది. గదుల కేటాయింపు సమయంలో ఫొటో క్యాప్చర్ తీసుకుంటున్నారు. గదులు ఖాళీ చేసే సమయంలో క్యాప్చర్ అయినా ఫొటో మ్యాచ్ అయితేనే కాషన్ డిపాజిట్ అకౌంట్ లో జమ చేస్తారు. రూమ్ రొటేషన్ విధానం ఆగిపోవడంతో త్వరిత గతిన సామాన్య భక్తులకి గదులు త్వరగా అందించగలుతోంది. గతంలో దళారుల చేతివాటంతో గదుల రొటేషన్ విధానం సాగుతూ వచ్చిన.... ఇప్పుడు ఫొటో ఆధారిత బయోమెట్రిక్ ద్వారా దళారులు గదులు పొందే అవకామే లేదు. ఉచిత లడ్డు జారీ విధానంలో సైతం ఫొటో ఆధారిత బయోమెట్రిక్ ప్రవేశపెట్టామని, లడ్డు మిస్యూస్ కాకుండా ఉండేందుకు ఈ విధానం పనిచేయనుంది అధికారులు తెలిపారు.
15 రోజుల పాటు ప్రయోగాత్మక పరిశీలన
తిరుమలలో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ అమలుతో అసలేన భక్తులు గదులు పొందుతున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. దీంతో దళారులు తగ్గారన్నారు. తిరుమలలోని పద్మావతి విచారణ కార్యాలయం, సీఆర్వో, ఎంబీసీ ప్రాంతాల వద్ద భక్తులకు గదులను కేటాయించే కౌంటర్ల వద్ద ఈవో ధర్మారెడ్డి ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని గురువారం పరిశీలించారు. మరో 15 రోజుల పాటు ఈ విధానాన్ని పరిశీలిస్తామన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు లడ్డూ ప్రసాదం అందించేందుకు త్వరలో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ద్వారా టోకెన్లు అందజేస్తా్మన్నారు. తిరుమలలో దళారులను పూర్తిగా తగ్గించేందుకు, టీటీడీ సౌకర్యాలు భక్తులకు అందించేందుకు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తిరుమలలో సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో ఈ టెక్నాలజీ ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్టు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గదులను రొటేషన్ చేసే పద్ధతిని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని చెప్పారు. గదుల కోసం పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు తొందరగా రూములు దొరుకుతున్నాయని ఈవో తెలిపారు.
గోవింద యాప్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తుల కోసం మొబైల్ యాప్ ను ఇటీవల అప్ డేట్ చేసింది. ఇది వరకు ఉన్న "గోవింద" యాప్ నే టీటీ దేవస్థానమ్స్(TT Devasthanams) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. జియో ప్లాట్ ఫామ్ ద్వారా ఈ యాప్ ను అభివృద్ధి చేసినట్లే టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ యాప్ ద్వారా ఎస్వీబీసీ భక్తి ఛానల్లో వచ్చే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చని తెలిపింది. దర్శనం, గదులు, ఆర్జిత సేవా టికెట్లను భక్తులు నేరుగా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొంది. యాప్ లో తిరుమల చరిత్ర స్వామి వారి కైంర్యాల వివరాలను పొందుపరిచినట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే గోవింద యాప్ ను తమ మొబైళ్లలో కల్గి ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి "టీటీ దేవస్థానమ్స్"ను అప్ డేట్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. కొత్త వారు నేరుగా టీటీ దేవస్థానమ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని వివరించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)