Tirupati: మానవత్వం చాటుకున్న ఎంపీ గురుమూర్తి... సీపీఐ నారాయణ కాలికి కట్టుకట్టిన వైసీపీ ఎంపీ
ముందు వైద్యుడ్ని ఆ తర్వాతే ఎంపీ అంటున్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. కాలు బెణికి బాధపడుతున్న సీపీఐ నారాయణకు చికిత్స చేశారు వైసీపీ ఎంపీ గురుమూర్తి.
తిరుపతి ఎంపీ గురుమూర్తి వృత్తిరీత్యా వైద్యుడు, ఫిజియోథెరఫిస్ట్. ప్రతిపక్ష నేత హోదాలో సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన సమయంలో గురుమూర్తి ఫిజియోథెరఫిస్ట్‌గా పనిచేశారు. తిరుపతి ఉపఎన్నికలో గురుమూర్తికి సీం జగన్ టికెట్ ఇచ్చి, గెలిపించారు. గురుమూర్తి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎంపీ అయినా వైద్యుడిగా తన బాధ్యతను మరవలేదు. రాజకీయ ప్రత్యర్థి అని కూడా చూడకుండా గాయపడిన సీపీఎం నేత నారాయణ చికిత్స చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి రాయల చెరువు పూర్తిగా నిండిపోయింది. ప్రమాదకర స్థాయిలో ఉన్న రాయల చెరువుకు గండి పడే స్థితికి చేరుకుంది. చాలాచోట్ల లీకులు రావడంతో అధికారులు అప్రమత్తమై వాటిని పూడుస్తున్నాయి. రాయల చెరువును మంగళవారం సీపీఐ, వైసీపీ నేతలు పరిశీలించారు.
Also Read: ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.. ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష
రాయల చెరువును పరిశీలించిన సీపీఐ నారాయణ
సీపీఐ నేత నారాయణ సహా కొందరు నాయకులు రాయల చెరువు, ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చారు. రామచంద్రాపురం మండలం కుప్పంబాదూరు వద్ద రాయల చెరువు లీకేజ్ తో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఇందుకోసం సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. రాయల చెరువు కట్టను పరిశీలించి తిరిగి వచ్చే సమయంలో బురదగా ఉండటం వల్ల నారాయణ జారి కింద పడబోయారు. దీంతో పక్కనే ఉన్న పార్టీ నాయకులు ఆయనను పట్టుకున్నారు. ఈ ఘటనతో నారాయణ కుడి కాలు స్వల్పంగా బెణికి వాపు వచ్చింది. వాపు రావడంతో నారాయణ ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో రాయల చెరువు కట్టను పరిశీలించడానికి ఉపముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్కడకు వచ్చారు.
Also Read: రాజధాని ఫార్ములా రెడీ.. జగన్ సై అంటే బీజేపీని ఒప్పిస్తానన్న ఎంపీ టీజీ వెంకటేష్ !
కాలికి కట్టుకట్టిన ఎంపీ
కాలు బెణికిందనే విషయాన్ని తెలుసుకున్న ఎంపీ గురుమూర్తి నారాయణ గాయాన్ని పరిశీలించారు. ఎంపీ గురుమూర్తి ఆయనకు ప్రథమ చికిత్స చేసి కట్టుకట్టారు. వృత్తిరీత్యా ఫిజియోథెరఫిస్ట్ కావడంతో అక్కడికక్కడే కాలికి కట్టుకట్టారు. నారాయణ కాలిని తన ఒడిలో పెట్టుకుని ప్రథమ చికిత్స చేశారు. అనంతరం చికిత్స కోసం నారాయణను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తన వాహనంలో హాస్పటల్ కు తీసుకెళ్లారు.
Also Read: ప్రజలంతా కష్టాల్లో ఉంటే.. సీఎం జగన్ విందులు, వినోదాల్లో ఉన్నాడు